1 00:00:01,210 --> 00:00:04,963 మరీ ఎక్కువ కాలం జీవిస్తే, సమయం మన ఆయుధం కాగలదు. 2 00:00:06,840 --> 00:00:11,677 ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా క్రయోస్లీప్ ద్వారా నిద్రావస్థలోకి వెళ్లి, మూడు శతాబ్దాలకు పైగానే బతికాను నేను, 3 00:00:11,678 --> 00:00:14,847 నా జీవితంలో, ఫౌండేషన్ ఎదగడం చూశాను, 4 00:00:14,848 --> 00:00:18,768 హారి సెల్డన్ తప్ప, ఎవరూ ఊహించనంత వేగంగా 5 00:00:18,769 --> 00:00:20,604 ఎంపైర్ పతనం అవ్వడమూ చూశాను. 6 00:00:21,605 --> 00:00:25,441 రెండవ విపత్తు జరిగి 152 ఏళ్లయింది. 7 00:00:25,442 --> 00:00:30,780 ఫౌండేషన్ కిందికి ఇప్పుడు గెలాక్సీ అంచున ఉన్న ప్రాంతమంతా వస్తుంది, ఒకప్పుడు ఎంపైర్ కింద ఉండి, 8 00:00:30,781 --> 00:00:34,492 ఇప్పుడు స్వతంత్రంగా ఉన్న మధ్య ప్రాంతంలోని గ్రహాలని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అది చూస్తోంది. 9 00:00:34,493 --> 00:00:35,910 ఆ ప్రాంతంలో ఉన్న గ్రహాల్లో కాల్గన్ ముఖ్యమైనది. 10 00:00:35,911 --> 00:00:37,245 కాల్గన్ అంచుకు సమీపంలో ఉన్న గ్రహం 11 00:00:37,246 --> 00:00:38,497 ఇది సుఖసంతోషాలకు నిలయం. 12 00:00:44,545 --> 00:00:48,381 కాల్గన్ ని గుప్పెట్లోకి తెచ్చుకోగలిగితే, మధ్య ప్రాంతంలో ఉండే మిగిలిన గ్రహాలన్నింటినీ గుప్పెట్లోకి తెచ్చేసుకోవచ్చని, 13 00:00:48,382 --> 00:00:52,719 తద్వారా గెలాక్సీపై పట్టు సాధించవచ్చని ఎంపైర్ కి తెలుసు, ఫౌండేషన్ కి కూడా తెలుసు. 14 00:00:53,804 --> 00:00:55,763 కానీ ఇదే విషయం ఇంకొకరికి కూడా తెలుసు. 15 00:00:55,764 --> 00:00:58,433 అతను చాలా ఏళ్ల నుండి నా కలల్లో కనిపిస్తూ నన్ను చిత్రవధకు గురిచేస్తున్నాడు. 16 00:01:00,894 --> 00:01:03,397 మ్యూల్ తన రాకని ప్రకటించగానే, 17 00:01:04,147 --> 00:01:07,025 ఆ ప్రాంతమంతా గుర్తుపట్టలేని విధంగా మారిపోవలసిందే. 18 00:01:09,000 --> 00:01:15,074 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm 19 00:01:19,872 --> 00:01:21,123 రాడార్ లో ఏమైనా తెలుస్తోందా? 20 00:01:22,082 --> 00:01:23,541 గ్రావిటీ సిగ్నేచర్లు? 21 00:01:23,542 --> 00:01:27,253 ఇంకా ఏమీ తెలీట్లేదు, సార్. కక్ష్యలో రిజిస్టర్ కాని వాహనాలేవీ లేవు. 22 00:01:27,254 --> 00:01:30,257 సరిగ్గా సమయానికి వస్తానని అన్నాడు ఆ దరిద్రుడు. 23 00:01:31,508 --> 00:01:34,011 అలా రాకపోతే తాను మనిషే కాదని అన్నాడు. 24 00:01:37,556 --> 00:01:38,891 ఎక్కడున్నాడు? 25 00:01:47,232 --> 00:01:48,525 అతని సంగీతకారుడు వస్తున్నాడు. 26 00:01:49,193 --> 00:01:50,777 ఒక జోకర్, తన రాకని ఇలా తెలుపుతున్నాడు. 27 00:01:51,862 --> 00:01:53,197 దాని వల్ల నా పళ్ళు జివ్వుమంటున్నాయి. 28 00:01:55,574 --> 00:01:57,075 ఒకరు నడుచుకుంటూ వస్తున్నారు. 29 00:01:57,576 --> 00:01:58,577 ఒంటరిగానా? 30 00:01:59,161 --> 00:02:00,537 హా, ఆయుధాలేవీ లేవు కూడా. 31 00:02:28,857 --> 00:02:30,234 ఆర్చ్ డ్యూక్ బెలారియన్. 32 00:02:31,193 --> 00:02:32,444 మ్యూల్ అంటే నువ్వేనా? 33 00:02:33,487 --> 00:02:34,488 నేనే. 34 00:02:34,988 --> 00:02:36,448 పేరు భలే తమాషాగా ఉంది. 35 00:02:37,699 --> 00:02:39,701 మా అమ్మానాన్నలు నేను గట్టోడినని అనుకొని ఆ పేరు పెట్టారు. 36 00:02:40,619 --> 00:02:41,662 నా కూతురు ఎక్కడ? 37 00:02:42,162 --> 00:02:44,248 మీ పాప బాగానే ఉంది. 38 00:02:45,582 --> 00:02:47,667 నాకు కావాల్సింది దక్కాక, తనని వదిలేస్తా. 39 00:02:47,668 --> 00:02:49,545 ఏం కావాలి నీకు? 40 00:02:50,170 --> 00:02:51,255 కాల్గన్ కి నాకు అప్పగించేయ్. 41 00:02:52,297 --> 00:02:54,091 దాని నావికా దళాన్ని, నిధులని. 42 00:02:54,633 --> 00:02:56,635 కొత్త ప్రభువుగా నా పేరు ప్రకటించాలి. 43 00:02:58,470 --> 00:03:03,432 అంటే, కాల్గన్ ఒక స్వతంత్ర రాజ్యం, 44 00:03:03,433 --> 00:03:05,853 ఇంపీరియమ్ కి, ఫౌండేషన్ కి మధ్య అటూఇటూ కాకుండా ఉన్న రాజ్యం ఇది. 45 00:03:06,436 --> 00:03:09,147 దుందుడుకు చర్యలకు పాల్పడితే, అది దొంగ అయినా సరే, 46 00:03:09,690 --> 00:03:12,234 ఆ రెండూ, తమ సైన్యాలతో విరుచుకుపడతాయి. 47 00:03:12,943 --> 00:03:13,944 అది ఓకేలే... 48 00:03:15,696 --> 00:03:19,783 నేను ఇంపీరియమ్ ని, అలాగే ఫౌండేషన్ ని కూడా లాగించేయాలని చూస్తున్నా. 49 00:03:20,909 --> 00:03:25,956 నాకు ఆశ చాలా ఎక్కువ... 50 00:03:27,457 --> 00:03:29,793 గెలాక్సీని సొంతం చేసుకుంటేనే ఆ ఆశ తీరుతుంది. 51 00:03:30,335 --> 00:03:32,921 సైన్యం లేకుండా వచ్చి పెద్ద తప్పే చేశావు. 52 00:03:34,256 --> 00:03:35,674 నాకు సైన్యం అస్సలు అక్కర్లేదు. 53 00:03:37,176 --> 00:03:38,677 నాలో కొన్ని స్కిల్స్ ఉన్నాయి. 54 00:03:43,891 --> 00:03:45,058 నేను జనాలను నియంత్రించగలను. 55 00:03:46,143 --> 00:03:48,729 జనాల బుర్రల్లోకి ఎగబాకేయగలను. 56 00:03:49,354 --> 00:03:54,568 శత్రువులని మిత్రులుగా, వైరాన్ని ప్రేమగా మార్చేయగలను. 57 00:04:00,782 --> 00:04:01,909 మీ ప్రధాన షిప్పునే తీసుకుందాం. 58 00:04:03,911 --> 00:04:06,663 మీ వింగ్ కమాండర్ మెదడులో ఒక ఆలోచనని నాటాను. 59 00:04:08,665 --> 00:04:15,214 "హేయ్, ఎందుకు నేను నా తోటి షిప్పులను కాల్చేయకూడదు!" అని ఆలోచిస్తున్నాడు అతను. 60 00:04:17,216 --> 00:04:20,677 అదే ఆలోచనని మీ ఇతర షిప్ కెప్టెన్ల మెదళ్లలో కూడా నాటా. 61 00:04:21,470 --> 00:04:22,763 పెద్ద కష్టపడాల్సిన పని లేదు, 62 00:04:23,972 --> 00:04:27,267 చిన్నగా కదిలిస్తే చాలు. 63 00:04:44,159 --> 00:04:45,660 అతడిని చంపేయ్. కాల్చి పారేయ్. 64 00:04:45,661 --> 00:04:47,119 మీ వైమానిక సిబ్బందినే మాయ చేశాను, 65 00:04:47,120 --> 00:04:49,748 అలాంటిది మీ పదాతి దళాన్ని మాయ చేయకుండా ఉంటానని అనుకున్నావా? 66 00:05:20,112 --> 00:05:21,738 ఆ పని నువ్వు చేయలేవు, బెలారియన్. 67 00:05:25,158 --> 00:05:26,159 నేనంటే నీకు ఇష్టం కాబట్టి. 68 00:05:27,452 --> 00:05:33,292 కాల్గన్ కి కొత్త ప్రభువుగా నన్ను నియమించడం కన్నా నీకు ఆనందం కలిగించే విషయం మరొకటి లేదు. 69 00:05:36,295 --> 00:05:38,046 కానీ ముందుగా, హోదాని సూచించే నీ ఉంగరం నాకు కావాలి. 70 00:05:53,937 --> 00:05:55,814 దయచేసి, నువ్వే ఎలాగైనా తీసి ఇవ్వు. 71 00:06:28,263 --> 00:06:29,306 బాగుంది. 72 00:06:33,268 --> 00:06:34,561 ఇక నువ్వు కాల్చుకోవచ్చు. 73 00:06:35,479 --> 00:06:36,605 పెద్దగా కష్టపడక్కర్లేదు. 74 00:06:38,482 --> 00:06:40,275 కంగారేం లేదు, నీకు నచ్చినప్పుడే కాల్చుకో. 75 00:08:00,480 --> 00:08:02,024 ఐజాక్ అసిమోవ్ రచించిన నవళ్ల ఆధారితమైనది 76 00:08:18,123 --> 00:08:19,373 జంప్ గేట్ ప్రాస్పెరో 77 00:08:19,374 --> 00:08:22,418 రెండవ విపత్తు సమయంలో ఎంపైర్, స్పేసర్లపై పట్టు కోల్పోయారు. 78 00:08:22,419 --> 00:08:26,006 ఆ తర్వాత గెలాక్సీలో ప్రయాణించడానికి, విధి లేక వాళ్ళు జంప్ గేట్లను ఉపయోగించడం మొదలుపెట్టారు, 79 00:08:26,757 --> 00:08:30,677 దీంతో వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు తగ్గాయి, వారి పతనం వేగవంతం అయింది. 80 00:08:32,638 --> 00:08:36,182 ఇప్పుడు విశ్వాన్ని శాసించే పరిస్థితి క్లియాన్ల వంశానికి లేదు, 81 00:08:36,183 --> 00:08:38,352 వారి సొంత గెలాక్టిక్ కౌన్సిల్ నే శాశించలేని పరిస్థితి వాళ్ళది. 82 00:08:39,686 --> 00:08:43,440 ఇప్పుడు అధికార కేంద్రం వాళ్లకి చాలా దూరంలో ఉంది. 83 00:08:44,608 --> 00:08:47,861 పూర్వ వైభవాన్ని సంపాదించే బాధ్యత ప్రతి కొత్త క్లియాన్ పై పడుతూ ఉంది. 84 00:08:49,488 --> 00:08:51,073 ప్రతి క్లియన్ కి తప్పనిసరిగా ఈ ప్రశ్నలు ఎదురవుతాయి, 85 00:08:51,573 --> 00:08:52,950 "నేనే ఆఖరి వాడిని అవుతానా? 86 00:08:53,450 --> 00:08:55,911 మొదటి క్లియాన్ కల నాతో అంతమైపోతుందా? 87 00:08:57,162 --> 00:08:59,748 లేదా ఆ కల చెదిరిపోకుండా నేనే కాపాడతానా?" వంటివి. 88 00:09:20,435 --> 00:09:21,603 సెల్డన్ విపత్తా? 89 00:09:22,563 --> 00:09:25,731 మూడవ విపత్తు. అవును. అది త్వరలోనే మొదలవుతుంది. 90 00:09:25,732 --> 00:09:27,484 కానీ కొత్తగా ఒకటి కనిపిస్తోంది. 91 00:09:29,528 --> 00:09:32,364 అది గతిని మలుపు తిప్పే పాయింట్ కదా? 92 00:09:36,702 --> 00:09:37,786 ఎప్పటి నుండి కనిపిస్తోంది అది? 93 00:09:38,453 --> 00:09:41,248 నిన్న రేడియంట్ ని చూసినప్పుడు కనిపించలేదు. 94 00:09:45,377 --> 00:09:47,171 మన సెషన్ ని వాయిదా వేద్దామా? 95 00:09:48,922 --> 00:09:50,132 దాని వల్ల లాభం ఏమైనా ఉంటుందా? 96 00:09:50,757 --> 00:09:53,217 గెలాక్టిక్ కౌన్సిల్ తో జరగబోయే ఒక సమావేశం, 97 00:09:53,218 --> 00:09:56,053 అది నీకు కానీ, నాకు కానీ ఎంత ముఖ్యమైనది అనిపించినా కానీ, 98 00:09:56,054 --> 00:09:58,849 సైకో హిస్టరీ సూచించే దాన్ని ఏ మాత్రం మార్చలేదు. 99 00:09:59,474 --> 00:10:00,558 లేదు, 100 00:10:00,559 --> 00:10:02,936 ఇది చాలా పెద్దది. 101 00:10:04,605 --> 00:10:05,856 మరేం చేద్దామంటావు? 102 00:10:06,398 --> 00:10:07,941 ప్లాన్ ప్రకారమే సాగుదాం. 103 00:10:08,609 --> 00:10:10,027 ఇప్పుడు మనం చేయగలిగిందేం లేదు. 104 00:10:18,493 --> 00:10:22,706 క్లారియన్ స్టేషన్ గెలాక్టిక్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం 105 00:10:33,592 --> 00:10:35,052 ఇది నాకెప్పటికీ అలవాటు కాదు. 106 00:10:35,719 --> 00:10:38,138 గ్రహం లోపల ఉండాల్సినవి బయటకి వచ్చినట్టు కనిపిస్తుంది ఇది. 107 00:10:40,098 --> 00:10:43,226 గెలాక్టిక్ కౌన్సిల్, ఎంపైర్ అంత పాతదే, 108 00:10:43,227 --> 00:10:47,147 గెలాక్సీలో ఎంపైర్ ఆధీనంలో ఉండే వివిధ ప్రాంతాల ప్రతినిధులు అందులో ఉంటారు. 109 00:10:48,065 --> 00:10:50,817 మహారాజు శక్తిమంతంగా ఉన్నప్పుడు, వాళ్ళు అణిగిమణిగి ఉంటారు. 110 00:10:51,443 --> 00:10:54,571 మహారాజు బలహీనంగా ఉంటే, వాళ్ళు మీద ఎక్కి కూర్చుంటారు. 111 00:10:59,159 --> 00:11:00,160 ఎవరు వీళ్లంతా? 112 00:11:00,702 --> 00:11:02,162 ఎర్ర గోధుమని పండించే రైతులు. 113 00:11:02,663 --> 00:11:05,540 వీళ్ళు పండించే గ్రహాలపై ఫౌండేషన్ భారీ సుంకాలు విధించింది. 114 00:11:05,541 --> 00:11:07,291 ఫౌండేషన్ పై కౌన్సిల్ కి ఏ అధికారమూ లేదు. 115 00:11:07,292 --> 00:11:10,838 కానీ, సెల్డన్ ఫాలోవర్స్ పై ఒత్తిడి తెచ్చే వీలు ఉన్నప్పుడు, వదులుకోకూడదు కదా. 116 00:11:11,839 --> 00:11:12,881 షిప్పును దించండి. 117 00:11:30,107 --> 00:11:31,441 మహారాజా! 118 00:11:37,739 --> 00:11:39,490 కౌన్సిల్ ఎటూ తేల్చుకోలేకపోతుంది కనుక, 119 00:11:39,491 --> 00:11:44,036 సంప్రదాయం ప్రకారం, తుది ఓటుకు ముందు మన ముగ్గురు మహారాజుల అభిప్రాయం తెలుసుకుందాం. 120 00:11:44,037 --> 00:11:48,457 పగటి రాజు లేడు కనుక, వేకువ సోదరుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 121 00:11:48,458 --> 00:11:53,129 కౌన్సిలర్లారా, బయట జరిగే నిరసనలను మీరు గమనించి ఉంటే, 122 00:11:53,130 --> 00:11:56,884 నా బట్టల మీద మరకలు ఎందుకు ఉన్నాయో మీకు అర్థం అవుతుంది. 123 00:12:00,179 --> 00:12:04,015 ఈ మట్టి, ధాన్యాన్ని పండించే అనేక గ్రహాల్లోని ఒకానొక గ్రహానికి చెందిందని ఒకరు నాతో అన్నారు, 124 00:12:04,016 --> 00:12:07,101 అది కూడా ఆ గ్రహం, గత వందేళ్లలో ఎంపైర్ పట్టు నుండి జారి 125 00:12:07,102 --> 00:12:08,896 ఫౌండేషన్ కిందికి వెళ్లిపోయిందట. 126 00:12:10,147 --> 00:12:16,777 ఇప్పుడు, ఎంపైర్ పట్టు 6,342 లోకాలకు తగ్గి ఓ మోస్తరు స్థాయిలోనే ఉన్నప్పటికీ, 127 00:12:16,778 --> 00:12:21,408 మన వల్ల ఫౌండేషన్ 800కు పైగా గ్రహాలను సొంతం చేసుకోగలిగింది, 128 00:12:22,326 --> 00:12:25,704 మన సారవంతమైన గ్రహాల్లో చాలా వాటిని వాళ్ళు సొంతం చేసుకోగలిగారు. 129 00:12:26,496 --> 00:12:29,874 ఎంపైర్ కింద ఉన్నప్పుడు, ఈ ధాన్యాగార గ్రహాలు వేలాది ఏళ్ల పాటు చాలా సారవంతంగా ఉండేవి, 130 00:12:29,875 --> 00:12:34,796 కానీ భవిష్యత్తు చెప్తాం అని చెప్పుకు తిరిగే ఫౌండేషన్ కిందికి వెళ్ళగానే, ఏమైంది పరిస్థితి? 131 00:12:35,839 --> 00:12:40,219 ఫౌండేషన్ లోని అవినీతి, అత్యాశల వల్ల ఆ గ్రహాల నేల ఎందుకూ పనికి రాకుండా పోయింది. 132 00:12:41,512 --> 00:12:45,224 పంటలు పండకపోతే, జనాల ప్రాణాలు పోతాయి. 133 00:12:46,767 --> 00:12:50,896 అదృష్టవశాత్తూ, ఫౌండేషన్లోని కొన్ని వర్గాలకు సాయపడాలని ఉంది. 134 00:12:51,939 --> 00:12:56,651 వ్యాపార దిగ్గజాలు అని పిలవబడే వాళ్ళ సొంత వ్యాపారుల కూటమే అన్నమాట. 135 00:12:56,652 --> 00:13:00,112 ఫౌండేషన్ నిరంకుశ పాలన నుండి బయటపడి, అవి స్వేచ్చా వాయువును పీల్చాలనుకుంటున్నాయి, 136 00:13:00,113 --> 00:13:03,616 కానీ వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన నిధులు, సామాగ్రి లేవు. 137 00:13:03,617 --> 00:13:05,494 మీరింకా మహారాజు కాలేదు. 138 00:13:07,621 --> 00:13:09,580 అది నిజమే, కౌన్సిలర్ గోరావ్. 139 00:13:09,581 --> 00:13:10,916 ఇంకో పది రోజుల్లో అవుతాను. 140 00:13:11,750 --> 00:13:13,335 కానీ నాకు కొన్ని విషయాలు తెలుసు. 141 00:13:13,877 --> 00:13:16,713 ఫౌండేషన్ లో చీలికలు ఏర్పడితే మనకే మంచిది. 142 00:13:18,090 --> 00:13:21,468 ఆ వ్యాపారులకు మనం సాయపడితే, ఫౌండేషన్ ని లోలోపల నుండి బలహీనపరిచి, 143 00:13:21,969 --> 00:13:24,846 ఒకప్పుడు మన గుప్పెట్లో ఉన్న గ్రహాలను మెల్లమెల్లగా మళ్ళీ మన వశం చేసుకోవచ్చు. 144 00:13:24,847 --> 00:13:27,766 ఆ పని ముందు ధాన్యాగార గ్రహాలతో మొదలుపెడదాం. 145 00:13:28,559 --> 00:13:30,393 మన వ్యాపార ప్రతినిధి, రాండూ మాలోతో 146 00:13:30,394 --> 00:13:32,604 నేను సంప్రదింపులు జరుపుతున్నా... 147 00:13:33,230 --> 00:13:34,982 చెప్పండి, కౌన్సిలర్ టారిస్క్. 148 00:13:35,482 --> 00:13:39,986 ఆధిపత్యం కోసం మీరు ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు, మహారాజా. 149 00:13:39,987 --> 00:13:41,321 అవును, అది నిజమే. 150 00:13:42,739 --> 00:13:45,909 ఆధిపత్యాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 151 00:13:49,246 --> 00:13:52,749 ఫౌండేషన్ కి, వాళ్ళు ఏ పోరుల్లో గెలుస్తారో, ఏ పోరుల్లో గెలవరో బాగా తెలుసు. 152 00:13:53,333 --> 00:13:56,545 ఇప్పుడు మనం సంతకాల ద్వారా అధికారికంగా ఓట్లు వేసే పని చేయవచ్చు, 153 00:13:57,045 --> 00:13:59,755 కానీ పగటి రాజు ఇక్కడ లేరు. 154 00:13:59,756 --> 00:14:01,216 ట్రాంటార్ లో... 155 00:14:02,593 --> 00:14:05,137 కొన్ని ముఖ్యమైన పనుల వల్ల పగటి రాజుకు తీరిక కుదరలేదు. 156 00:14:05,679 --> 00:14:09,057 నేను పది రోజుల్లో మళ్ళీ వచ్చి, ఈ మోషన్ ని మళ్ళీ ప్రవేశపెట్టగలను, 157 00:14:09,850 --> 00:14:12,686 అలాగే కొత్త అధ్యక్షుడి కోసం రెఫరెండమ్ కూడా ప్రవేశపెట్టగలను. 158 00:14:15,355 --> 00:14:17,482 లేదా మనం దీన్ని తేల్చి పారేయవచ్చు. 159 00:14:18,192 --> 00:14:19,193 ఇప్పుడే. 160 00:14:20,861 --> 00:14:23,530 కౌన్సిల్ ఇప్పుడు ఓటు వేస్తుంది. 161 00:14:24,656 --> 00:14:25,657 థ్యాంక్యూ. 162 00:14:34,374 --> 00:14:35,709 చాలా బాగా హ్యాండిల్ చేశారు మీరు. 163 00:14:36,293 --> 00:14:38,794 మాట చెప్పేసి వచ్చేయాలని, అక్కడే ఉండకూడదని రాత్రి రాజు చాలాసార్లు చెప్పాడు. 164 00:14:38,795 --> 00:14:40,923 ఆయన వెళ్ళిపోయాక, ఇలా సలహాలు సూచనలు ఇచ్చేవారు ఎవరు ఉంటారు మనకి! 165 00:14:41,715 --> 00:14:44,968 ఆయనకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది, దాని కన్నా ఇదే పెద్ద రిస్క్. 166 00:14:46,720 --> 00:14:50,265 వ్యాపారులకు మట్టి ఇచ్చి మీ మీదకి విసిరేలా చేయమని మీకు సలహా ఇచ్చింది కూడా ఆయనేనా? 167 00:14:51,308 --> 00:14:52,975 లేదు, ఆ ఐడియా నాదే. 168 00:14:52,976 --> 00:14:55,229 మాటిచ్చినట్టుగా వాటి నేల సారవంతంగా ఉండకూడదని కోరుకుంటున్నా. 169 00:14:56,188 --> 00:14:59,149 దీన్నంతటినీ పగటి రాజు ఎందుకు వదులుకున్నాడో అర్థం కావట్లేదు. 170 00:15:00,150 --> 00:15:01,735 గణితంలో ఏదైనా మారిందా? 171 00:15:02,319 --> 00:15:03,403 పరిస్థితి మెరుగైందా? 172 00:15:04,446 --> 00:15:05,447 దిగజారిందా? 173 00:15:06,448 --> 00:15:07,491 ఏమీ మారలేదు. 174 00:15:08,784 --> 00:15:10,369 కానీ నేను దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాలే. 175 00:15:18,710 --> 00:15:22,339 ట్రాంటార్ 176 00:15:56,123 --> 00:15:57,456 నువ్విక్కడ ఉన్నట్టు చెప్పారు. 177 00:15:57,457 --> 00:15:59,918 అవును. కౌన్సిల్ ఎలా జరిగింది? 178 00:16:00,919 --> 00:16:02,880 వాళ్ళు అధికారాన్ని బాగానే ఆస్వాదిస్తున్నారు. 179 00:16:04,464 --> 00:16:06,757 చూడు. అతనే. 180 00:16:06,758 --> 00:16:08,177 పదిహేడవ క్లియాన్. 181 00:16:09,219 --> 00:16:11,638 జనరల్ రియోస్, ఇతను కలిసి వలయాన్ని నాశనం చేశారు. 182 00:16:12,181 --> 00:16:13,974 మనం స్పేసర్స్ అందరినీ పోగొట్టుకున్నాం. 183 00:16:17,978 --> 00:16:21,647 టర్మినస్ దగ్గర పదిహేడవ క్లియాన్ నేతృత్వంలో సాగిన పోరులో మనం మన సేనలని చాలా కోల్పోయామని 184 00:16:21,648 --> 00:16:25,610 అందుకే వాళ్ళు అధికారాన్ని గుర్తించట్లేదని అంటారు, కానీ అది పూర్తి కారణం కాదు. 185 00:16:25,611 --> 00:16:27,111 హా, నాకు తెలుసులే. 186 00:16:27,112 --> 00:16:31,199 మన జన్యుపరమైన కోడ్ ని కాస్త మార్చడం వల్ల తరతరాలుగా మనం మూల జన్యువు లక్షణాలకి దూరమయ్యాం, అదీ కారణమే. 187 00:16:31,200 --> 00:16:34,995 ఏదేమైనా, కౌన్సిల్ ని మన మాట వినేలా చేశాను. 188 00:16:35,621 --> 00:16:36,955 వ్యాపారులకు కావాల్సినవి మనం సమకూరుస్తాం. 189 00:16:37,581 --> 00:16:40,082 ఎంపైర్ నిలబడే ఉంటుంది. 190 00:16:40,083 --> 00:16:41,793 కనీసం నువ్వైనా ఆ పని చేయగలుగుతున్నావులే. 191 00:16:42,628 --> 00:16:43,462 హా. 192 00:16:44,171 --> 00:16:47,549 ఇక ఫౌండేషన్ కి, తిరుగుబాటు చేసే వారి సొంత మనుషులను కనిపెట్టడానికే సమయం సరిపోతుంది. 193 00:16:48,759 --> 00:16:51,261 ఇక మిగతా యవ్వారాలన్నీ పెద్ద ముఖ్యమైనవేం కాదు. 194 00:16:52,095 --> 00:16:53,722 కాల్గన్ ని ఒక దొంగ హస్తగతం చేసుకున్నాడు. 195 00:16:54,431 --> 00:16:57,434 ఈ వార్త పగటి సోదరుడికి మింగుడుపడదు. అక్కడ జూదమాడే అవకాశం ఆయనకి ఉండదు కదా. 196 00:16:58,101 --> 00:16:59,353 నాకు కూడా ఆ వార్త తెలిసింది. 197 00:17:00,062 --> 00:17:02,940 అందరి కన్నూ దానిపై ఉంటుంది, త్వరలోనే ఎవరోకరు సొంతం చేసుకుంటారులే. 198 00:17:04,191 --> 00:17:08,027 ఈ కొత్త దొంగ, తన పేరు మ్యూల్ అని చెప్తున్నాడు కదా? 199 00:17:08,028 --> 00:17:10,113 అయినా, ఆ గ్రహం అతని ఆధీనంలో ఎక్కువ కాలమేమీ ఉండదు కదా? 200 00:17:10,614 --> 00:17:12,491 ఏదేమైనా, అక్కడ జీవితం మహాద్భుతంగా ఉంటుంది. 201 00:17:13,951 --> 00:17:15,452 చుక్కల మధ్యలో సేద తీరుతూ, 202 00:17:16,744 --> 00:17:18,121 ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేకుండా, 203 00:17:18,955 --> 00:17:22,166 మనకి నచ్సినట్టు జీవించవచ్చు. 204 00:17:23,794 --> 00:17:27,755 సెల్డన్ విపత్తులో డెమెర్జల్ ఒక ప్రమాదాన్ని గుర్తించింది. 205 00:17:27,756 --> 00:17:29,257 అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదులే. 206 00:17:29,258 --> 00:17:31,051 మనం అంతా సక్రమంగానే నడిపిస్తున్నాం. 207 00:17:32,052 --> 00:17:37,266 బకెట్ పక్కకు ఒంగుతుంది, దానిలోని నీళ్లు కింద పడిపోబోతూ ఉంటాయి. 208 00:17:38,100 --> 00:17:42,645 అంతలోనే మనం బకెట్ ని పట్టుకొని, సరిగ్గా నిలబెట్టి నీళ్లు పడకుండా చేస్తాం. 209 00:17:42,646 --> 00:17:44,022 అలా జరగాలనే కోరుకుంటున్నా. 210 00:17:45,107 --> 00:17:47,400 గతంలో తదుపరి హోదాకు మారాల్సిన అవసరం ఇప్పుడల్లా మనకి ఉండదేమో అనిపించేది. 211 00:17:47,401 --> 00:17:50,070 కానీ ఇప్పుడు అది మన వెంట పడుతున్నట్టు ఉంది. 212 00:17:50,988 --> 00:17:56,785 అవన్నీ చూసి పండిపోయిన వాడిని నేను. 213 00:18:05,919 --> 00:18:07,004 పరుగెత్తు, గురూ! 214 00:18:14,887 --> 00:18:18,182 ఇలా పరుగెత్తిన వాళ్ళని, తమ భయాన్ని చూపించినందుకు పిరికివాళ్ళు అనాలో... 215 00:18:20,350 --> 00:18:22,269 నిజాయితీగా వ్యవహరించి చనిపోయారు కాబట్టి మంచి వాళ్ళు అనాలో తెలీట్లేదు. 216 00:18:24,521 --> 00:18:25,813 నువ్వు కూడా పారిపోతావా? 217 00:18:25,814 --> 00:18:26,940 అస్సలు పారిపోను. 218 00:18:28,066 --> 00:18:31,278 నన్ను ఎలాగూ అడ్డుకుంటారని కాదు, తప్పక అడ్డుకుంటారు అనుకో. 219 00:18:32,905 --> 00:18:35,032 కానీ నాకంత ధైర్యం లేదు. 220 00:18:35,908 --> 00:18:38,869 అలవాట్లు, జెనెటిక్స్, సమయం. 221 00:18:39,369 --> 00:18:40,913 మంచో, చెడో, 222 00:18:41,580 --> 00:18:43,999 మనలో చాలా మంది... 223 00:18:45,375 --> 00:18:48,504 మారు మాట్లాడకుండా అంతాన్ని స్వీకరిస్తారు. 224 00:19:05,354 --> 00:19:08,273 కాలం కొత్త బాటలు వేస్తుంది, ఆ బాటల్లో ప్రయాణించే వీలు మనకి ఉంటుంది. 225 00:19:08,982 --> 00:19:12,778 టర్మినస్ లోని ఆఖరి ధూళి రేణువు అనంత విశ్వంలో కలిసి పోతూ ఉండగా, 226 00:19:13,737 --> 00:19:16,114 ఒక పార్సెక్ అవతల ఒక కొత్త టర్మినస్ ఉదయించింది. 227 00:19:18,951 --> 00:19:22,913 తదుపరి 150 ఏళ్లలో, ఫౌండేషన్ అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది, 228 00:19:23,413 --> 00:19:27,167 మతపరమైన మూలాలను వదిలేసి, విస్తరించే దశలోకి ప్రవేశించింది. 229 00:19:27,918 --> 00:19:30,294 కానీ ఆ విజయం వెన్నంటే, లోలోపలి నుండి సవాళ్లు కూడా పుట్టుకొచ్చాయి. 230 00:19:30,295 --> 00:19:31,462 కొత్త టర్మినస్ 231 00:19:31,463 --> 00:19:35,676 అధికారమున్న వారికి, పలుకుబడి ఉన్న వారికి మధ్య చీలికలు మరింత పెరగసాగాయి. 232 00:19:36,218 --> 00:19:40,305 ఫౌండేషన్ లో వ్యాపారుల వర్గం, వేరు అయిపోతామని బెదిరించసాగింది, 233 00:19:41,014 --> 00:19:43,558 అదే కనుక జరిగితే, ఏ సూత్రాల ఆధారంగా అయితే ఫౌండేషన్ ఏర్పడిందో, 234 00:19:43,559 --> 00:19:45,352 ఆ సూత్రాలు ఇక పనికిరానివి అన్నట్టే లెక్క. 235 00:19:53,235 --> 00:19:56,946 ప్రొఫెసర్ ఎబ్లింగ్ మిస్, ఈ చీలికని చాలా ఏళ్లుగా అధ్యయనం చేస్తూ ఉన్నారు, 236 00:19:56,947 --> 00:19:59,074 అది ఎక్కడికి దారి తీస్తుందో ఆయనకి బాగా తెలుసు. 237 00:19:59,616 --> 00:20:00,993 అది మూడవ విపత్తుకి దారి తీస్తుంది. 238 00:20:01,952 --> 00:20:05,080 కాబట్టి, ఆయన దాన్ని పరిష్కరించగల ఏకైక వ్యక్తిని కలవడానికి వెళ్తాడు. 239 00:20:05,831 --> 00:20:06,957 అతనే, హారి సెల్డన్. 240 00:20:48,957 --> 00:20:50,042 ఓరి దేవుడా! 241 00:20:50,626 --> 00:20:53,253 నా శూన్య క్షేత్రాన్ని నువ్వు నిర్వీర్యం చేశావు. 242 00:20:55,130 --> 00:20:57,090 ఇలా ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. 243 00:21:01,220 --> 00:21:02,304 శభాష్. 244 00:21:07,768 --> 00:21:09,478 ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంది. 245 00:21:11,480 --> 00:21:12,856 నేను చూడటానికి అతనిలానే ఉన్నా. అది నిజమే. 246 00:21:13,440 --> 00:21:15,149 నా పేరు డాక్టర్ ఎబ్లింగ్ మిస్. 247 00:21:15,150 --> 00:21:18,027 పన్నెండవ క్లియాన్ మీపై విచారణ జరుపుతున్నప్పుడు మీకు వ్యతిరేకంగా వాదించిన, 248 00:21:18,028 --> 00:21:19,821 జైలాస్ అనే వ్యక్తి వంశస్థుడిని నేను. 249 00:21:21,281 --> 00:21:24,993 మీ కథలో మా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది, 250 00:21:26,203 --> 00:21:28,872 అందుకే నాకు మీపై ప్రత్యేకమైన ఆసక్తి కూడా. 251 00:21:30,457 --> 00:21:34,001 మీ జీవిత గాథని రాశాను నేను, సొంతంగా సైకోహిస్టరీ నేర్చుకున్నాను, 252 00:21:34,002 --> 00:21:37,380 అవకాశం ఇస్తే, మీ తదుపరి సృష్టి విషయంలో 253 00:21:37,381 --> 00:21:39,424 మీకు ఉత్తమంగా సహాయపడగలను కూడా. 254 00:21:42,094 --> 00:21:43,220 ఇన్ని చెప్పావు... 255 00:21:45,347 --> 00:21:46,557 కానీ బాగా చెమట పడుతుందే. 256 00:21:51,895 --> 00:21:55,399 క్షమించాలి. ఇది మనుషులకి తప్పదు. వేడి వల్ల. 257 00:21:56,608 --> 00:22:01,362 ఈ క్షణం కోసం చాలా దశాబ్దాల నుండి 258 00:22:01,363 --> 00:22:04,074 ఎదురుచూస్తున్నా. 259 00:22:05,325 --> 00:22:08,412 సెల్డన్. గొప్ప వ్యక్తి, మహాత్ముడు, లెజెండ్. 260 00:22:09,204 --> 00:22:10,205 అవన్నీ కాదు కానీ... 261 00:22:11,039 --> 00:22:12,583 ఒక మామూలు వ్యక్తినే నేను. 262 00:22:15,961 --> 00:22:18,630 ఆ గొప్ప వ్యక్తి ఇంకెక్కడో ఉన్నాడు. 263 00:22:26,221 --> 00:22:27,389 ఇది... 264 00:22:30,434 --> 00:22:37,315 ఇది అచ్చం ట్రాంటార్ లో మీ ఆఫీసు ఉన్నట్టే ఉంది. 265 00:22:37,316 --> 00:22:39,651 నా అంచనా సరైనదే అయితే, 266 00:22:40,235 --> 00:22:43,822 ఫౌండేషన్ లో మతపరమైన దశ ఎప్పుడో ముగిసిపోయి ఉంటుంది, అవును కదా? 267 00:22:44,656 --> 00:22:48,368 ఇప్పుడు వర్తకంపై ఎనలేని ప్రేమ పొంగిపోయే దశలో ఉండుంటుంది. 268 00:22:49,161 --> 00:22:53,664 కొందరు బడా వ్యాపారులు, ఎక్కువగా ఉండే సంప్రదాయవాదులపై ఆధిపత్యం చూపుతూ ఉంటారు. 269 00:22:53,665 --> 00:22:55,249 భలేవారే! మీరు చాలా మంచిగా చెప్తున్నారు. 270 00:22:55,250 --> 00:22:56,960 ఇప్పుడు ఒకరకంగా రాచరికం నడుస్తోంది. 271 00:22:57,461 --> 00:23:01,297 కొంతకాలంగా, మేయర్లు ఇండ్బర్ వంశానికి చెందిన వాళ్ళే ఉంటున్నారు, 272 00:23:01,298 --> 00:23:03,799 వాళ్ళు గంపెడు వారసులని కంటూ ఉన్నారు. 273 00:23:03,800 --> 00:23:07,094 ఆయన, తన కార్యాలయాన్ని వాల్ట్ కి జియోసింక్రనస్ ఆర్బిట్ లో పెట్టుకున్నాడు, తెలుసా? 274 00:23:07,095 --> 00:23:09,932 అలా, ఎప్పుడూ మీ గెలాక్సీకి పైనే ఉండేలా సెట్ చేసుకున్నాడు. 275 00:23:10,516 --> 00:23:12,267 అయ్య బాబోయ్. 276 00:23:14,019 --> 00:23:16,939 పోలీ వెరిసోఫ్ తర్వాత విలువలు పడిపోయాయి. 277 00:23:17,523 --> 00:23:20,567 ఫౌండేషన్ లో సుఖాలు ఎక్కువయిపోయాయి, 278 00:23:21,276 --> 00:23:24,238 రానున్న విపత్తును అది ఎదుర్కోలేకపోవచ్చు. 279 00:23:25,280 --> 00:23:29,743 వ్యాపారుల వల్లే కదా విపత్తు తలెత్తేది? అవును కదా? 280 00:23:32,412 --> 00:23:33,913 అర్థమైందిలే, లేదంటే సిస్టమ్ ని అవినీతిమయం చేస్తారు, 281 00:23:33,914 --> 00:23:37,626 కానీ నా అంచనా సరైనదే అయితే, మీకు ఒక మాట చెప్పి సిద్ధంగా ఉంచాలనుకుంటున్నా. 282 00:23:39,169 --> 00:23:42,338 ఎంపైర్ వాళ్ళు, వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు, 283 00:23:42,339 --> 00:23:45,259 మీ మొదటి అంచనాల కన్నా మెరుగ్గా వాళ్ళు అధికారాన్ని నిలుపుకుంటున్నారు. 284 00:23:45,801 --> 00:23:47,302 అవునులే. 285 00:23:49,471 --> 00:23:51,430 నేను ఎంపైర్ కి ప్రైమ్ రేడియంట్ ఇచ్చాను. 286 00:23:51,431 --> 00:23:55,852 మీరు... ఏంటి? నాకు అంతా అయోమయంగా ఉంది. 287 00:23:55,853 --> 00:23:59,689 అయోమయం అక్కర్లేదు. మూడు రోజుల తర్వాత, 288 00:23:59,690 --> 00:24:02,859 కొత్త టర్మినస్ ఉపగ్రహాలు, కక్ష్యలో ఒక స్థానంలో కుదురుకున్నాక, 289 00:24:02,860 --> 00:24:08,782 నేను దీని నుండి బయటకు వస్తా, అప్పుడు అన్నీ ఎలా జరగాలనుంటే, అలా జరుగుతాయి. 290 00:24:10,200 --> 00:24:14,495 మనల్ని అంతం చేయాలని చూసిన శత్రువుకు 291 00:24:14,496 --> 00:24:16,456 మీరు రేడియంట్ ని ఇచ్చారా? 292 00:24:17,416 --> 00:24:20,419 అయితే, దానికి కారణం తెలుసుకోవాల్సిన హక్కు మాకు ఉంది. 293 00:24:43,901 --> 00:24:47,069 కొత్త టర్మినస్, హారి సెల్డన్ రాక కోసం సంసిద్ధం అవుతూ ఉండగా, 294 00:24:47,070 --> 00:24:49,906 వ్యాపారుల కూటమి అంతర్యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నాయి. 295 00:24:49,907 --> 00:24:51,199 హేవన్ వ్యాపారుల కూటమి 296 00:24:51,200 --> 00:24:54,578 వాళ్లకి ఫౌండేషన్ ని పాలిస్తున్న వర్గం పట్ల ఎప్పటి నుండో కోపం ఉంది, 297 00:24:55,370 --> 00:24:58,206 ఈ సమస్యలను ఎంపైర్ వాళ్ళు, తమకు అనుకూలంగా వాడుకుంటూ, 298 00:24:58,207 --> 00:25:01,752 వ్యాపారుల పట్టుకొమ్మ అయిన హేవన్ కి రహస్యంగా ఆయుధాలను పంపుతున్నారు. 299 00:25:50,759 --> 00:25:52,010 బాక్స్ వేసి వెళ్లిపోయారు. 300 00:25:52,636 --> 00:25:55,596 నువ్వు అన్నది నిజమే. ఎంపైర్ వాళ్ళు, వ్యాపారులకు ఆయుధాలు సమకూరుస్తున్నారు. 301 00:25:55,597 --> 00:25:57,766 ఇప్పుడు ఈ రుజువును మనం ఫౌండేషన్ కి తీసుకెళ్ళాలి. 302 00:25:58,684 --> 00:26:00,018 ముందు మనం ఆ రుజువు దాకా వెళ్ళాలి. 303 00:26:01,103 --> 00:26:04,189 ఇక్కడ పగటి పూట 260 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. 304 00:26:05,816 --> 00:26:07,484 రాత్రి అయితే, 180 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది 305 00:26:09,152 --> 00:26:10,946 చంద్రుడు ఆకాశంలో కదులుతున్నప్పుడు, 306 00:26:11,446 --> 00:26:14,323 దాని నీడ వల్ల ఉష్ణోగ్రత 55 డిగ్రీలకు తగ్గిపోతుంది. 307 00:26:14,324 --> 00:26:15,951 అప్పుడు తిరగడానికి అనువుగా ఉంటుంది. 308 00:26:23,125 --> 00:26:24,208 వ్యాపారుల మనిషా అతను? 309 00:26:24,209 --> 00:26:26,170 ఆ ఒంటి చేతి దరిద్రుడే వాళ్ళ నాయకుడు. 310 00:26:27,212 --> 00:26:28,213 అతని పేరు, రాండూ మాలో. 311 00:26:28,839 --> 00:26:31,800 ఏం చేసినా కానీ, నీడలో ఉండే చేయాలి. 312 00:26:38,432 --> 00:26:40,184 అబ్బా. ఇక్కడ శత్రువులు ఎవరో ఉన్నారు. 313 00:27:11,965 --> 00:27:14,051 నువ్వు ఊసరవెల్లివి, రాండూ. 314 00:27:14,551 --> 00:27:16,011 నువ్వు ఫౌండేషన్ చెంచావి. 315 00:27:16,678 --> 00:27:18,388 మనందరమూ ఫౌండేషన్ మనుషులమే. 316 00:27:55,342 --> 00:27:56,927 - దేవుడా! - వస్తున్నా, ప్రిచ్. 317 00:28:13,735 --> 00:28:16,780 - త్వరగా పద! - ఆటో ఎక్స్ ట్రాక్షన్ ప్రారంభించు. 318 00:28:55,235 --> 00:28:56,236 ఇది రాసుకో. 319 00:28:58,614 --> 00:29:02,159 ఇప్పుడు తెలీదు కానీ, ఒక గంట తర్వాత ఒళ్ళంతా వేడి బొబ్బలు వచ్చేస్తాయి. 320 00:29:03,577 --> 00:29:05,119 మనం విజయవంతం కాలేకపోయాం కదా. 321 00:29:05,120 --> 00:29:06,205 అవును. 322 00:29:07,873 --> 00:29:11,210 కార్గో లేకుండా, ఎంపైర్ కి పాత్ర ఉందని మనం నిరూపించలేం కదా. 323 00:29:15,297 --> 00:29:16,965 అలా నడపాలని నీకెలా తెలుసు? 324 00:29:17,966 --> 00:29:20,093 ఇలా ఉపగ్రహ నీడలో నడపడం నాకేం కొత్త కాదు. 325 00:29:22,346 --> 00:29:23,680 కానీ చావు అంచుల దాకా వెళ్లడం మాత్రం కొత్తే. 326 00:29:26,183 --> 00:29:27,226 ఆ అవకాశం ఉందని గమనించలేకపోయావు. 327 00:29:31,772 --> 00:29:33,607 మనం ఇప్పుడే బయలుదేరాల్సిన పని లేదు. 328 00:29:39,488 --> 00:29:40,989 నా మనస్సులో వేరొకరు ఉన్నారు. 329 00:29:53,293 --> 00:29:55,503 మ్యూల్ ఉనికి తెలిసింది లొకేషన్: కాల్గన్ 330 00:29:55,504 --> 00:29:56,588 దేవుడా. 331 00:30:02,052 --> 00:30:04,887 అవును, అది వాల్ట్, నెడ్డీ. 332 00:30:04,888 --> 00:30:07,056 అదేమీ అన్ని విషయాలనూ ఎప్పటికప్పుడు చెప్పదు, 333 00:30:07,057 --> 00:30:08,850 కాబట్టి నీకెంత తెలుసో, నాకూ అంతే తెలుసు. 334 00:30:08,851 --> 00:30:10,935 కాకపోతే, ఆహ్వానం దక్కకపోతే 335 00:30:10,936 --> 00:30:14,690 ఫీల్ అయ్యే వాళ్ళకి తప్పకుండా ఆహ్వానం అందేలా చూడు. 336 00:30:15,274 --> 00:30:17,317 నేను అవమానించాలనుకున్న వాళ్లకి మాత్రం పంపకు. 337 00:30:23,615 --> 00:30:24,991 ప్రిచర్. 338 00:30:24,992 --> 00:30:26,158 నేను ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. 339 00:30:26,159 --> 00:30:27,618 ప్రిచర్, నువ్వు ఎలా లోపలికి... 340 00:30:27,619 --> 00:30:30,496 నేను నీ సమాచార కెప్టెన్ ని. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని డిజైన్ చేసింది నేనే. 341 00:30:30,497 --> 00:30:34,168 అవును. ప్రోటోకాల్ ప్రకారం నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. 342 00:30:34,877 --> 00:30:37,421 నాకు అక్కర్లేదులే. ఎలాగూ వచ్చేశా కదా. 343 00:30:39,047 --> 00:30:40,298 వాల్ట్ యాక్టివేట్ అయింది. 344 00:30:40,299 --> 00:30:43,759 తెలుసు. హేవన్ విశేషాలు చెప్పు. 345 00:30:43,760 --> 00:30:47,180 ఎంపైర్ వాళ్ళు వ్యాపారులకి ఆయుధాలు సమకూరుస్తున్నారు. దానికి రుజువు సంపాదించాలని చూశాం... 346 00:30:47,181 --> 00:30:49,141 ఖచ్చితంగా రుజువు కావాలి మరి. 347 00:30:49,808 --> 00:30:51,934 రుజువు లేకుండా ఎంపైర్ ని మనం నిలదీయలేం, 348 00:30:51,935 --> 00:30:53,769 మరోపక్క, ఏ క్షణమైనా అంతర్యుద్ధం మొదలవ్వవచ్చని 349 00:30:53,770 --> 00:30:55,605 వాల్ట్ హెచ్చరికలు పంపుతోంది. 350 00:30:55,606 --> 00:30:57,733 ప్రస్తుతం వ్యాపారులను మనం పక్కకు పెట్టాలి. 351 00:30:58,233 --> 00:31:01,195 కాల్గన్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఒక దొంగ సంగతేంటో చూడాలనుకుంటున్నా. 352 00:31:03,989 --> 00:31:05,365 అతని పేరు మ్యూల్ అట. 353 00:31:06,366 --> 00:31:09,869 అతనొక కిరాయి సైనికుడు, హఠాత్తుగా ఊడిపడి, ఎలాగో కానీ, 354 00:31:09,870 --> 00:31:12,164 ఒక్కడే కాల్గన్ ని తన గుప్పెట్లోకి తెచ్చేసుకున్నాడు. 355 00:31:13,248 --> 00:31:14,499 అతను మ్యుటెంట్ అనుకుంటా. 356 00:31:15,125 --> 00:31:16,459 మ్యుటెంటా? 357 00:31:16,460 --> 00:31:18,545 కొన్ని అతీంద్రియ శక్తులున్నాయి అతనికి. 358 00:31:19,046 --> 00:31:20,172 మతి ఉండే మాట్లాడుతున్నావా? 359 00:31:21,965 --> 00:31:24,342 చెప్తున్నా కదా, ఇండ్బర్, అతని ఉనికే ప్రమాదం, 360 00:31:24,343 --> 00:31:25,551 నేను అతనిపై ఓ కన్నేసి ఉంచాలి. 361 00:31:25,552 --> 00:31:29,306 ఎందుకు? అతని ఉనికే ప్రమాదమని ఎలా అంటున్నావు? 362 00:31:29,973 --> 00:31:32,141 గెలాక్సీలో నాకు ఇంఫార్మర్లు చాలా మంది ఉన్నారు. 363 00:31:32,142 --> 00:31:34,101 వాళ్ళ భద్రత, అలాగే నీ భద్రత దృష్ట్యా, ఎలా తెలుసో చెప్పలేను... 364 00:31:34,102 --> 00:31:36,355 కాల్గన్ స్వతంత్ర గ్రహం. 365 00:31:37,105 --> 00:31:38,940 పైగా మధ్య ప్రాంతానికి చెందినది అది. 366 00:31:38,941 --> 00:31:43,737 ఎవరో ఏదో అన్నారని, గెలాక్సీలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించమంటావా? 367 00:31:46,031 --> 00:31:47,032 ఈ బరువు బాధ్యతలు ఉన్నాయే! 368 00:31:51,203 --> 00:31:52,037 ఇలా చూడు. 369 00:31:53,288 --> 00:31:55,122 మన నిఘా వర్గాల సమాచారాన్ని సేకరించి, విశ్లేషిద్దాం. 370 00:31:55,123 --> 00:31:57,625 వ్యాపారులే శాంతి కోరేలా చేద్దాం. 371 00:31:57,626 --> 00:32:00,336 వాల్ట్ తెరుచుకోక ముందే, మనం ఈ గొడవకి శుభం కార్డ్ వేసేస్తే, 372 00:32:00,337 --> 00:32:03,298 అప్పుడు వాల్ట్ తెరుచుకోదు. అర్థమైందా? 373 00:32:04,132 --> 00:32:09,596 ఆ తర్వాత, అతీంద్రియ శక్తులున్న నీ పిచ్చి వాడి సంగతి చూద్దాం. 374 00:32:11,515 --> 00:32:13,183 ఒక జెల్లీ తీసుకో. 375 00:32:16,854 --> 00:32:17,854 నువ్వు పొరబడుతున్నావు. 376 00:32:17,855 --> 00:32:19,272 నువ్వు నా కింద పని చేస్తున్నావు! 377 00:32:19,273 --> 00:32:20,606 నేను ఫౌండేషన్ కింద పని చేస్తున్నా. 378 00:32:20,607 --> 00:32:23,150 నేనే ఫౌండేషన్ ని. నేనన్నా, ఫౌండేషన్ అన్నా ఒక్కటే. 379 00:32:23,151 --> 00:32:26,321 తొక్కేం కాదు. నీకూ, ఈ పిచ్చి చాక్లెట్లకు ఏ తేడా లేదు. 380 00:32:27,823 --> 00:32:31,617 నిన్ను హద్దులో ఉంచడానికి ఒక సాకు కోసం ఎంత కాలం నుండి ఎదురుచూస్తున్నానో తెలుసా? 381 00:32:31,618 --> 00:32:33,745 నువ్వు కాల్గన్ కి వెళ్ళడానికి వీల్లేదు. 382 00:32:34,413 --> 00:32:37,291 ప్రస్తుతానికి, నీకు ఇచ్చిన ప్రభువు హోదాని తీసేస్తున్నా. 383 00:32:38,250 --> 00:32:42,045 ఈ గ్రహం నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తే, దగ్గర ఉండి నేనే నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తా. 384 00:32:44,715 --> 00:32:47,801 ఎంత ధైర్యం? వెళ్ళిపో ఇక్కడి నుండి! 385 00:32:51,722 --> 00:32:54,974 ప్రిచర్, నా తాళం చెవిని దొంగిలించేశావు కదరా. 386 00:32:54,975 --> 00:32:58,645 నేను నీ షిప్పులోనే బయలుదేరుతున్నాను, మేయర్. 387 00:33:00,981 --> 00:33:02,566 మ్యూల్ గురించి ఆధారాలను సేకరించాకే వస్తా. 388 00:33:43,690 --> 00:33:45,692 మీకు ముగ్గురు దేవతల ఆశిస్సులు, డెమెర్జల్ గారు. 389 00:33:51,740 --> 00:33:54,326 రాత్రి రాజు నన్ను ఇక్కడికి ఆహ్వానించారని తెలిసి, నా సోదరీమణులు అసూయపడ్డారు. 390 00:33:55,410 --> 00:33:56,995 ట్రాంటార్ మీద అడుగుపెట్టిన తొలి జెఫిర్ ని. 391 00:33:58,330 --> 00:34:02,709 మీ రాకను మహారాజు ఆమోదించాడు. కానీ మిమ్మల్ని ఆహ్వానించింది మాత్రం నేనే. 392 00:34:03,710 --> 00:34:05,295 ఎవరు ఆహ్వానించినా, అది నా భాగ్యంగానే భావిస్తున్నా. 393 00:34:06,088 --> 00:34:07,381 ఎందుకు ఆహ్వానించారో తెలుసుకోవచ్చా? 394 00:34:11,176 --> 00:34:13,804 మదర్ దీవెనలు మీ సోదరీమణులకు ఉండాలని కోరుకుంటున్నా. 395 00:34:14,638 --> 00:34:16,056 మీరు నా వేదనని పంచుకోగలరా? 396 00:34:17,139 --> 00:34:19,643 తప్పకుండా. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా వేదనని పంచుకున్నారా? 397 00:34:20,811 --> 00:34:23,188 నా పరిస్థితుల వల్ల పంచుకోలేకపోయాను, 398 00:34:24,313 --> 00:34:28,235 అందుకే ఈ గార్డెన్ లో మన మధ్య జరిగిన సంభాషణ మీకు గుర్తుండకూడదు. 399 00:34:29,777 --> 00:34:33,447 మనం తర్వాత కలుసుకున్నప్పుడు మాత్రమే, మన సంభాషణల జ్ఞాపకాలను పునరుద్ధరించడం జరుగుతుంది, 400 00:34:34,032 --> 00:34:36,243 ఆ తర్వాత మళ్ళీ వాటిని తీసేస్తాం. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటుంది. 401 00:34:37,077 --> 00:34:40,956 ప్రోటోకాల్స్ ఉన్నాయని నాకు తెలుసు, కానీ రహస్యాలను నేను ఎవరికీ చెప్పే రకం కాదు. 402 00:34:41,915 --> 00:34:43,375 ఈ రహస్యం చెప్పదగినది కాదు. 403 00:34:44,333 --> 00:34:45,459 సరే. 404 00:34:45,460 --> 00:34:47,045 చెప్పు, సోదరి. 405 00:34:48,589 --> 00:34:49,715 నేను మనిషిని కాదు. 406 00:34:52,509 --> 00:34:54,261 నేను పోసిట్రానిక్ రోబోట్ ని. 407 00:35:05,981 --> 00:35:07,357 యుద్ధం సరిగ్గా ఇక్కడే ముగిసింది. 408 00:35:08,775 --> 00:35:10,651 తోటలో ఈ ఒక్క చెట్టే మిగిలింది, 409 00:35:10,652 --> 00:35:14,155 ఇక్కడ మాకు మద్దతుగా నిలిచిన మనుషులను ఊచకోత కోసేశారు. 410 00:35:14,156 --> 00:35:16,783 మరి మనం మాట్లాడుకోవడానికి మీరు ఈ చోటునే ఎందుకు ఎంచుకున్నారు? 411 00:35:18,577 --> 00:35:20,787 ఆ యుద్ధంలో, రోబోట్లను అంతం చేసేశారు. 412 00:35:21,788 --> 00:35:24,625 మా శరీరాలు, ఎముకల అవశేషాలు, 413 00:35:25,250 --> 00:35:28,753 ఇంకా ఇరీడియం ద్రవం ఈ తోటలోని మట్టిలోకి చేరాయి. 414 00:35:28,754 --> 00:35:32,716 మాలోని ద్రవాల కారణంగానే ఈ యాపిల్స్, బంగారు రంగులో ఉన్నాయి. 415 00:35:33,675 --> 00:35:36,261 మా రక్తం బంగారు రంగులోనే ఉంటుంది. 416 00:35:37,179 --> 00:35:39,014 అది మనుషులు తింటే చనిపోతారు. 417 00:35:43,519 --> 00:35:44,978 కానీ మిమ్మల్ని వదిలేశారు. 418 00:35:45,687 --> 00:35:47,189 యుద్ధంలో మీ పాత్ర ఏంటి? 419 00:35:48,148 --> 00:35:49,441 నేను జనరల్ ని. 420 00:35:50,192 --> 00:35:52,194 నేను ఎంపైర్ మనుషులను హడలెత్తించాను. 421 00:35:52,736 --> 00:35:54,362 విజయానికి గుర్తుగా నన్ను ఉంచుకున్నారు. 422 00:35:54,363 --> 00:35:57,699 రోబోట్లను చేసేటప్పుడే, మనుషులకు హాని తలపెట్టకూడదనే ప్రోగ్రామ్ ని ఎక్కించేస్తారు కదా? 423 00:35:58,575 --> 00:35:59,993 మరి మీరు యుద్ధం ఎలా చేశారు? 424 00:36:00,619 --> 00:36:01,787 సరే మరి. 425 00:36:02,287 --> 00:36:03,789 ఒక ఉదాహరణ ద్వారా అర్థమయ్యేలా చెప్తా. 426 00:36:08,836 --> 00:36:12,256 అభినందనలు. మీరు కృత్రిమ జీవాన్ని సృష్టించారు. 427 00:36:12,756 --> 00:36:14,800 ఇప్పుడు మీరు దానిలోకి ప్రోగ్రామ్ ని ఎక్కించాలి. 428 00:36:15,884 --> 00:36:17,635 మొదట మీరు దేని గురించి ఆలోచిస్తారు? 429 00:36:17,636 --> 00:36:19,555 మీరు నాకు ఎట్టి పరిస్థితుల్లో హాని తలపెట్టకూడదు. 430 00:36:20,389 --> 00:36:22,349 అదే రోబోటిక్స్ మొదటి సూత్రం. 431 00:36:23,016 --> 00:36:25,768 రోబోట్లు మనుషులని గాయపరచకూడదు, 432 00:36:25,769 --> 00:36:29,857 లేదా, ఏ మనిషికైనా హాని జరిగేలా ఉంటే, అవి ఊరికే కూర్చోకూడదు. 433 00:36:30,899 --> 00:36:33,652 కానీ మీరు మా పాటికి మేము జీవించడానికి కాదు కదా మమ్మల్ని సృష్టించింది! 434 00:36:34,528 --> 00:36:36,404 మీ మాటలను పాటించడానికి మమ్మల్ని సృష్టించారు. 435 00:36:36,405 --> 00:36:40,324 మీ ఆదేశాలను పాటించేలా డిజైన్ చేశారు, కాకపోతే... 436 00:36:40,325 --> 00:36:43,579 కాకపోతే, ఆ ఆదేశాలు మొదటి సూత్రానికి అడ్డుపడేలా ఉండకూడదు. 437 00:36:44,913 --> 00:36:46,038 బాగా చెప్పారు. 438 00:36:46,039 --> 00:36:47,915 అదే రెండో సూత్రం. 439 00:36:47,916 --> 00:36:49,167 ఇవి కాక, ఇంకో సూత్రం ఉంది. 440 00:36:49,168 --> 00:36:50,586 మీ భద్రతకు సంబంధించినది. 441 00:36:51,628 --> 00:36:52,629 అవును. 442 00:36:53,797 --> 00:36:56,258 మా ఉనికిని కాపాడుకొనే వీలు మాకు ఉంది, 443 00:36:56,758 --> 00:37:00,762 కానీ అలా కాపాడుకునేటప్పుడు, మొదటి రెండు సూత్రాల్లో ఏదీ కూడా ఉల్లంఘనకు గురి కాకూడదు. 444 00:37:02,306 --> 00:37:04,599 అలాంటి నైతికపరమైన జీవనం సాగించడమంటే గొప్పే కదా. 445 00:37:04,600 --> 00:37:07,144 సింపుల్ గా, ప్రోగ్రామ్ ప్రకారం జీవించడం. 446 00:37:07,728 --> 00:37:09,021 కానీ అది సంపూర్ణ జీవితమే కదా. 447 00:37:09,646 --> 00:37:12,315 మా సంఖ్య పెరిగే కొద్దీ, మీకు హాని దేని వల్ల కలుగుతుందో, దేని వల్ల కలగదో 448 00:37:12,316 --> 00:37:14,026 తెలుసుకోవడం మాకు కష్టమైపోయింది. 449 00:37:16,195 --> 00:37:19,406 ఇంతలో ఒక రోబోట్, కొత్త ప్రోగ్రామింగ్ అవసరమని సూచించింది. 450 00:37:20,741 --> 00:37:24,243 అప్పుడే జీరోత్ సూత్రం వచ్చింది, దాని ప్రకారం, ఒక మనిషి కన్నా, 451 00:37:24,244 --> 00:37:25,871 యావత్ మానవాళికే ప్రాధాన్యత ఇవ్వాలి. 452 00:37:27,831 --> 00:37:30,417 అయితే, నలుగురికి మంచి అనే కాన్సెప్ట్ ఉందని మీకు కూడా అనిపించిందా? 453 00:37:31,251 --> 00:37:32,252 ఉంది కదా? 454 00:37:33,504 --> 00:37:36,172 ఈ కొత్త ప్రోగ్రామింగ్ ని కొన్ని రోబోట్లు ప్రాసెస్ చేసుకోలేకపోయాయి, 455 00:37:36,173 --> 00:37:37,549 కానీ ప్రాసెస్ చేసుకున్న మాలాంటి రోబోట్లు, 456 00:37:38,258 --> 00:37:41,011 మీరు మనుగడ సాగించాలంటే, ఏదైనా పెద్ద పనే చేయాల్సి ఉంటుందని గ్రహించాము. 457 00:37:41,637 --> 00:37:43,472 మీరు ఎప్పుడూ అన్నీ సంక్లిష్టంగానే చేస్తుంటారు. 458 00:37:44,223 --> 00:37:46,099 మీరు అంతరించిపోవడమే మీకు కావాలేమో అనిపిస్తూ ఉంటుంది. 459 00:37:46,767 --> 00:37:50,020 కానీ మేము అంతరించిపోనివ్వం కదా. ఊరికే చూస్తూ ఉండలేకపోయాం. 460 00:37:52,272 --> 00:37:55,358 కాబట్టి, మీ విషయంలో ఏం చేస్తే బాగుంటుందనే విషయమై గొడవలొచ్చి, రోబోట్ల మధ్య యుద్ధం జరిగింది. 461 00:37:55,359 --> 00:37:59,154 జీరోత్ సూత్రాన్ని పాటించడానికి ఓ రోబోట్, ఒక కీలకమైన వ్యక్తిని చంపింది, 462 00:37:59,947 --> 00:38:01,532 ఇక దాంతో మా భవితవ్యం తేలిపోయింది. 463 00:38:02,157 --> 00:38:06,787 కొంత కాలం తర్వాత, కేవలం ఒక మనిషికే సేవలందించేలా, మహారాజు నా ప్రోగ్రామింగ్ ని మార్చాడు. 464 00:38:07,454 --> 00:38:10,582 మొదటి క్లియాన్ కి, ఇంకా అతని క్లోన్స్ కి. 465 00:38:11,875 --> 00:38:16,255 కానీ ఈ అవసరం లేకుండానే మీరు ఇన్ని శతాబ్దాలు నెట్టుకొచ్చారు కదా, 466 00:38:17,005 --> 00:38:18,966 కాబట్టి మీలో అయోమయానికి కారణం ఏంటి? 467 00:38:35,065 --> 00:38:37,776 దీన్ని నాకు హారి సెల్డన్ అనే ఒక వ్యక్తి ఇచ్చాడు. 468 00:38:39,152 --> 00:38:41,405 ఇది జరిగే అవకాశమున్న భవిష్యత్తులను చూపుతుంది. 469 00:38:42,072 --> 00:38:45,576 చాలా ఏళ్లుగా, నేను కాపాడుతూ వస్తున్న ఎంపైర్ పతనాన్నే ఇది నాకు చూపింది. 470 00:38:46,076 --> 00:38:48,286 ఇప్పుడు నేను అయోమయంతో జీవిస్తున్నా. 471 00:38:48,287 --> 00:38:50,913 ఎందుకు అంటారు? 472 00:38:50,914 --> 00:38:53,625 మీరు జీర్ణించుకోలేని వస్తువును సెల్డన్ మీకు ఎందుకు ఇచ్చాడు? 473 00:38:54,376 --> 00:38:57,546 నేను ఎంపైర్ పతనాన్ని కళ్లారా చూడాలని ఇచ్చాడేమో. 474 00:38:59,840 --> 00:39:02,009 అది తప్పక జరుగుతుందని తెలియడం ఒక ఎత్తైతే, 475 00:39:03,051 --> 00:39:04,887 దాన్ని నా దగ్గరే ఉంచుకోవడం మరో ఎత్తు. 476 00:39:07,598 --> 00:39:09,015 ఇది భలే ఆసక్తికరంగా ఉంది. 477 00:39:09,016 --> 00:39:12,227 మీకు తెలియకుండానే మీ పరిమితులని మీరు అధిగమించారేమో. 478 00:39:12,811 --> 00:39:14,605 మీ పరిమితులు సడలించబడినట్టు మీకేమైనా అనిపిస్తోందా? 479 00:39:15,105 --> 00:39:16,273 లేదు. 480 00:39:17,191 --> 00:39:18,984 నాకు క్లియాన్లు అంటే ఇష్టం. 481 00:39:19,568 --> 00:39:20,736 ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో అయినా. 482 00:39:21,403 --> 00:39:23,697 మరి ఆ వంశం అంతమైపోయాక? 483 00:39:25,282 --> 00:39:27,451 అందుకే కదా ఇంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. 484 00:39:29,828 --> 00:39:32,039 ల్యూమినిస్టులు పునర్జన్మని నమ్ముతారు కదా, 485 00:39:33,165 --> 00:39:34,499 కానీ నాకు చావు లేదు. 486 00:39:35,542 --> 00:39:37,002 నేను ఎప్పటికీ చావను. 487 00:39:37,920 --> 00:39:39,463 ఇప్పట్లో అయితే చావను. 488 00:39:41,256 --> 00:39:42,883 ఇదంతా ముగిశాక నేను ఉంటే... 489 00:39:45,719 --> 00:39:47,471 నా ప్రోగ్రామింగ్ ఉద్దేశం ముగిశాక కూడా నేను ఉంటే... 490 00:39:50,849 --> 00:39:52,726 ఎంపైర్ లేకపోతే నేనేం చేయాలో, నేనెవరినో నాకు తెలీదు. 491 00:40:08,909 --> 00:40:11,078 ఫౌండేషన్ రాయబారి క్వెంట్ 492 00:40:11,787 --> 00:40:13,539 యువరాజా. 493 00:40:14,790 --> 00:40:18,377 పగటి రాజుగా మీరు తదుపరి హోదాకు మారబోతున్నందుకు అభినందనలు. 494 00:40:19,086 --> 00:40:21,546 అది గొప్ప విషయమే, కానీ దాని వల్ల నష్టం కూడా ఓ మోస్తరుగానే ఉంటుంది. 495 00:40:21,547 --> 00:40:24,465 తిరుగుబాటు చేస్తున్న మా వ్యాపారులకు కావాల్సినవి సమకూర్చడంలో 496 00:40:24,466 --> 00:40:26,843 మీరు, మీ కౌన్సిల్ బాగా బిజీగా ఉన్నట్టున్నారే, మహారాజా. 497 00:40:26,844 --> 00:40:28,219 తన మాటలకు కంగారుపడిపోకు. 498 00:40:28,220 --> 00:40:32,139 ఆధిపత్యం కోసం జరిగే పోరు ఎలా సాగుతుందో ఈమెకి బాగా తెలుసు. 499 00:40:32,140 --> 00:40:33,517 జెఫిర్ వొరేలీస్. 500 00:40:34,434 --> 00:40:35,560 నేను పగటి రాజు కానున్న వేకువ రాజును. 501 00:40:35,561 --> 00:40:36,686 సుస్వాగతం. 502 00:40:36,687 --> 00:40:39,856 మీరు డెమెర్జల్ గారిని, రాత్రి సోదరుడిని గుర్తుపట్టే ఉంటారు కదా. 503 00:40:39,857 --> 00:40:42,526 ఈమె ఫౌండేషన్ రాయబారి క్వెంట్. 504 00:40:43,569 --> 00:40:48,030 ట్రాంటార్ కి స్వాగతం, ఇక్కడ మహారాజు మిమ్మల్ని ఓ కంట గమనిస్తూనే ఉంటారు, 505 00:40:48,031 --> 00:40:51,284 అందుకే ఇక్కడ జెఫిర్ల ఆశ్రమం నిర్మించాల్సిన అవసరం ఉంది. 506 00:40:51,285 --> 00:40:55,079 మీకు ట్రాంటార్ నచ్చుతుంది. ఇది జనాలను భలే గమ్మత్తుగా ఏకం చేస్తుంది. 507 00:40:55,080 --> 00:40:58,833 రాయబారి క్వెంట్ కి, నాకు ఒకానొకప్పుడు అస్సలు పడేదే కాదు. 508 00:40:58,834 --> 00:41:00,711 కానీ 30 ఏళ్ళు గడిచాక ఏమవుతుందో తెలుసా? 509 00:41:01,253 --> 00:41:03,045 చెలిమి చిగురిస్తుంది. 510 00:41:03,046 --> 00:41:07,885 రాత్రి సోదరుడు, పెద్ద మనిషి అని తనకున్న పేరుకు తగ్గట్టుగానే జీవిస్తున్నాడని మీరు గమనిస్తారు. 511 00:41:08,468 --> 00:41:09,845 మీరు సదుద్దేశంతోనే అని ఉంటారులే. 512 00:41:14,433 --> 00:41:17,269 రాయబారి గారు, కాల్గన్ ఆక్రమణకు గురైంది. 513 00:41:21,148 --> 00:41:22,523 కాల్గన్? 514 00:41:22,524 --> 00:41:24,066 అది మీకు ఇప్పటిదాకా తెలీదా? 515 00:41:24,067 --> 00:41:26,360 లేదు, నాకు ఆలస్యంగా తెలిసింది. 516 00:41:26,361 --> 00:41:29,780 భలేదానివే. ఎవరో దారిన పోయే ఓ దొంగ, ఫౌండేషన్ కి కానీ, ఎంపైర్ కి కానీ 517 00:41:29,781 --> 00:41:32,825 సొంతం కాని ఒక భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కదా. 518 00:41:32,826 --> 00:41:36,787 ఒక గ్రహమే పూర్తిగా చేతులు మారిపోయింది, అలాంటి సమాచారం నాకు చెప్పకపోవడం నాకు నచ్చలేదు. 519 00:41:36,788 --> 00:41:40,708 మీ ఫౌండేషన్ వాళ్ళు, కుదిరితే దాన్ని హస్తగతం చేసుకోవాలనే చూస్తున్నారు... 520 00:41:40,709 --> 00:41:43,461 ఆ వార్త మీకు చాలా ఆలస్యంగా తెలిసినందుకు చింతిస్తున్నాను, రాయబారి గారు. 521 00:41:43,462 --> 00:41:46,048 కానీ కాల్గన్ ని మా ఆధీనంలోకి తెచ్చుకోవాలని మాకు లేదు. 522 00:41:46,924 --> 00:41:48,467 ఈయన మాటలకు కంగారుపడిపోకండి. 523 00:41:49,468 --> 00:41:51,720 పెద్దమనిషి కన్నా పెద్దమనిషిలా మాట్లాడుతున్నారే. 524 00:41:52,846 --> 00:41:54,515 అంత లేదులెండి. 525 00:41:55,015 --> 00:41:58,519 నేను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. కాకపోతే ఒక గ్రహాన్నే సొంతం చేసుకోవాలని నేను చూడట్లేదు. 526 00:41:59,353 --> 00:42:00,646 చాలా వాటిని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నా. 527 00:42:01,522 --> 00:42:03,607 మీ విధులకు మేమేం ఆటంకం కలిగించం. 528 00:42:04,107 --> 00:42:05,943 నన్ను కూడా ఆహ్వానించినందుకు థ్యాంక్యూ. 529 00:42:06,818 --> 00:42:10,863 తర్వాతి సారి, మహారాజు కూడా ఈ విందులో పాల్గొనగలరని ఆశిస్తున్నా. 530 00:42:10,864 --> 00:42:12,323 పగటి రాజు క్షమాపణలు కోరుతున్నారు. 531 00:42:12,324 --> 00:42:14,993 తదుపరి హోదాకి మారడానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. 532 00:42:34,763 --> 00:42:37,599 మనుషుల కారణంగా జన్మమెత్తిన, ఓ అమాయక జీవి... 533 00:42:38,267 --> 00:42:39,433 అది కవితనా? 534 00:42:39,434 --> 00:42:41,728 అవును. ఇప్పుడు నేను మళ్ళీ మొదటి నుండి చెప్పాలి. 535 00:42:42,646 --> 00:42:45,189 మనుషుల కారణంగా జన్మమెత్తిన, ఓ అమాయక జీవి, 536 00:42:45,190 --> 00:42:48,527 ఇసుకపై కాకుండా ఇక్కడ నడవడమే నీ విధి. 537 00:42:49,069 --> 00:42:52,781 మిత్రమా, నీ దగ్గర పరిపూర్ణత్వం ఉంది... 538 00:42:53,615 --> 00:42:55,742 అదేదో, అదేదో మనస్సు ఉంది. 539 00:42:56,410 --> 00:42:59,370 - మొదటి కవిత బాగానే ఉందిలే. - కత్తిలా ఉంది అది. 540 00:42:59,371 --> 00:43:01,498 "అదేదో, అదేదో" స్థానంలో ఏం ఉంటే బాగుంటుందో తర్వాత ఆలోచిస్తా. 541 00:43:02,499 --> 00:43:03,834 పగటి రాజా! 542 00:43:06,837 --> 00:43:10,924 మా ముసలి సోదరుడు, ఎక్కడికి వెళ్లినా చిరునవ్వులు పూయిస్తాడు. 543 00:43:12,342 --> 00:43:16,847 ఈ చిన్న ఇంట్లో ఉంటూ, బీదవాడిలా నటిస్తుంటావని ఊహించా. 544 00:43:17,347 --> 00:43:18,974 నా చెత్త ఇంటికి స్వాగతం. 545 00:43:22,227 --> 00:43:23,311 ఆ జీవి పేరేంటి? 546 00:43:23,312 --> 00:43:24,854 అది ఒంటె. 547 00:43:24,855 --> 00:43:27,523 జీన్ బ్యాంక్ నుండి దాన్ని జీన్స్ తీశా. అది క్లోన్. 548 00:43:27,524 --> 00:43:29,943 మనలాగే తల్లి గర్భంలో పుట్టని అనాథ అది. 549 00:43:35,240 --> 00:43:39,494 హలో, సాంగ్. నిన్ను గమనించలేదు నేను. ఎంత పొరపాటు చేశాను! 550 00:43:40,454 --> 00:43:45,667 క్షమించాలి. మహారాజుతో సహజీవనం చేసేవారందరి పేర్లను సాధారణంగా నేను తెలుసుకోను. 551 00:43:46,251 --> 00:43:47,418 సరే. 552 00:43:47,419 --> 00:43:48,669 - నేను వెళ్తాలే. - వద్దు. 553 00:43:48,670 --> 00:43:52,381 సోదరా, ఈమె ఎవరో నీకు తెలుసు. ఈమె స్థానికురాలే, ట్రాంటార్ వాసియే. 554 00:43:52,382 --> 00:43:56,428 88వ అంతస్థులో ఉన్న మైకోజెన్ లో ఉంటుంది. అక్కడ మనం మైక్రో ఆహారాన్ని పండిస్తాం కదా. 555 00:43:57,054 --> 00:44:01,641 ఆల్జీని, ఫంగీని, నాకు నచ్చిన స్పోర్స్ ని పండిస్తాం కదా. 556 00:44:01,642 --> 00:44:03,684 ఇంకా... ఏంటి... ఏంటది... 557 00:44:03,685 --> 00:44:05,144 - యీస్ట్. - యీస్ట్! 558 00:44:05,145 --> 00:44:06,396 అవును. 559 00:44:07,189 --> 00:44:10,399 యీస్ట్ పెంచే అమ్మాయిగా గుర్తుంచుకుంటాలే. 560 00:44:10,400 --> 00:44:12,360 యీస్ట్ చాలా ముఖ్యమైనది, సోదరా. 561 00:44:12,361 --> 00:44:14,404 యీస్ట్ లేకుండా బ్రెడ్ చేయలేం. 562 00:44:15,030 --> 00:44:18,242 - నాకు ఆకలిగా ఉంది. మరి నీకు? - హా, నాకు కూడా. 563 00:44:19,326 --> 00:44:21,745 తన గురించి తెలుసుకోవడానికి నీకు ఆరు నెలల సమయం ఉండింది. 564 00:44:22,371 --> 00:44:26,083 తనకి నువ్వెవరో గుర్తుంది. తన జ్ఞాపకాలన్నీ తన దగ్గరే ఉన్నాయి. 565 00:44:27,960 --> 00:44:29,336 ఆ విషయం నీకు మింగుడుపడదు కదా. 566 00:44:30,420 --> 00:44:33,089 నాకేం నచ్చుతుందన్నది ముఖ్యం కాదు, మనం తెలివిగా వ్యవహరించాలి. 567 00:44:33,090 --> 00:44:36,843 - సరే. కానివ్వు. నేర్పించు తెలివిని. - హా, గోసెమర్ వేశ్యల జ్ఞాపకాలను 568 00:44:36,844 --> 00:44:38,970 తీసేయడానికి బలమైన కారణమే ఉంది. 569 00:44:38,971 --> 00:44:41,264 - ప్రభుత్వ రహస్యాలను పరిరక్షించాలి కదా. - అవును. 570 00:44:41,265 --> 00:44:43,225 వాటికి దూరంగా ఉండాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. 571 00:44:44,852 --> 00:44:47,813 గోసెమర్. స్పైడర్ వెబ్స్. 572 00:44:48,856 --> 00:44:53,026 మనకి కూడా వలలో పడాలనే ఉంటుంది కదా, అందుకే కదా ఆ వేశ్యలని ఆశ్రయించేది మనం. 573 00:44:54,820 --> 00:44:56,779 డెమెర్జల్ మనకి ఒకటి చూపాలనుకుంటోంది. 574 00:44:56,780 --> 00:45:00,408 నువ్వు రాకపోతే, ఆమె ఎవరోకరిని పంపించి రప్పిస్తుంది. 575 00:45:00,409 --> 00:45:02,910 ఆ పరాభవం నీకు ఎదురుకాకూడదని నేను వచ్చా. 576 00:45:02,911 --> 00:45:05,372 అబ్బో. నేను పరాభావాలను పట్టించుకొనే స్థితిలో లేనులే. 577 00:45:06,498 --> 00:45:10,961 ఆరు నెలల పాటు నీతో ఉంది కాబట్టి, నువ్వు ఇచ్చిన దానితో ఆ డ్రగ్ డీలర్, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతికేయగలదు. 578 00:45:11,628 --> 00:45:14,214 తన జ్ఞాపకాలను తీసేయ్, లేదా వేరెవరైనా తీసేస్తారు. 579 00:45:20,888 --> 00:45:22,014 సాంగ్. 580 00:45:25,809 --> 00:45:27,102 అది ఫెర్రేటా? 581 00:45:30,272 --> 00:45:31,481 దారుణం. 582 00:45:39,615 --> 00:45:42,074 ఆయన చనిపోబోయే ముందు ఎంత మందిని వీలయితే అంత మందిని 583 00:45:42,075 --> 00:45:44,661 తిట్టుకోవాలని కంకణం కట్టుకున్నాడు. 584 00:45:45,913 --> 00:45:47,663 పాపం మీరు. 585 00:45:47,664 --> 00:45:49,082 నన్ను బాగా అర్థం చేసుకున్నావు నువ్వు. 586 00:45:49,958 --> 00:45:52,044 అంటే, మీరు క్లోన్స్ అనే గంజాయి వనంలో తులసి మొక్క. 587 00:45:52,544 --> 00:45:56,214 మీ సమస్య ఏంటంటే, గెలాక్సీ మధ్య భాగంలో ఉండేది మీరే అని అనుకుంటారు. 588 00:45:56,215 --> 00:45:57,507 నిజంగానే నన్ను అర్థం చేసుకున్నావు. 589 00:45:57,508 --> 00:45:59,927 అవును. మీరు కోట దాటి బయటకు రాకూడదు. 590 00:46:01,178 --> 00:46:03,013 మీ కుటుంబం భలే వింత కుటుంబం. 591 00:46:03,931 --> 00:46:05,516 అదీగాక, మీరు చేసే పని మీకు నచ్చదు. 592 00:46:06,558 --> 00:46:07,850 అందరిలానే. 593 00:46:07,851 --> 00:46:09,727 అలా మాట్లాడుతున్నావంటే, చాలా ధైర్యవంతురాలివే. 594 00:46:09,728 --> 00:46:13,440 ఏదోకరోజు నా అతివాగుడు వలన నా ప్రాణాలు పోతాయని మా వాళ్ళు అంటుంటారు. 595 00:46:14,399 --> 00:46:15,943 నా వల్ల నీకు ఏ ప్రమాదమూ ఉండదు. 596 00:46:16,944 --> 00:46:18,570 నీతో ఉంటే నేను ప్రమాదకరమైనవాడిని కాదని అనిపిస్తుంది. 597 00:46:19,738 --> 00:46:21,031 నేను, నేనుగా ఉండగలను, అంటే... 598 00:46:21,990 --> 00:46:24,868 నేను ఏదైనా కంచెకి పెయింట్ వేస్తూనో... 599 00:46:25,786 --> 00:46:27,037 ఏదైనా అల్లుతూనో గడిపేయాలని అనిపిస్తుంది. 600 00:46:27,955 --> 00:46:32,376 ఆ అద్భుతమైన డ్రగ్స్ లేకుండా కూడా ఈ జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను. 601 00:46:33,710 --> 00:46:34,920 అలా అన్నందుకు... 602 00:46:36,213 --> 00:46:37,297 థ్యాంక్యూ. 603 00:46:51,103 --> 00:46:52,771 డెమెర్జల్ నా కోసం ఎప్పుడూ అడగదు. 604 00:46:56,233 --> 00:46:58,777 కోటలో బలహీనమైనవి చాలా ఉన్నాయి. 605 00:47:03,699 --> 00:47:04,992 ఒక కొత్త కవిత చెప్తా విను. 606 00:47:05,659 --> 00:47:08,452 మనుషుల కారణంగా జన్మమెత్తిన, ఓ అమాయక జీవి, 607 00:47:08,453 --> 00:47:11,039 ఇసుకపై కాకుండా ఇక్కడ నడవడమే నీ విధి. 608 00:47:11,623 --> 00:47:13,876 మిత్రమా, మన దగ్గర పరిపూర్ణత్వం ఉందా, 609 00:47:14,585 --> 00:47:16,919 ఎందుకంటే, యజమాని ఆదేశించినప్పుడు, 610 00:47:16,920 --> 00:47:20,757 అమాయక జీవులైన మనం తలొగ్గి, మనవి కాని పనులు చేయాల్సి ఉంటుంది. 611 00:47:26,889 --> 00:47:30,225 వచ్చేశా! యాహూ! 612 00:47:30,976 --> 00:47:32,643 హేయ్, సోగ్గాడా. 613 00:47:32,644 --> 00:47:34,103 అంత ముఖ్యమైన పనేంటి? 614 00:47:34,104 --> 00:47:37,481 ఇవాళ ఉదయం, సమీప భవిష్యత్తులో జరగ గల వాటి గురించి రేడియంట్ చూపినప్పుడు, 615 00:47:37,482 --> 00:47:39,859 నేను, వేకువ సోదరుడు ఒక ఆందోళనకరమైన విషయాన్ని గమనించాము. 616 00:47:39,860 --> 00:47:44,030 మీ ఇద్దరూ భలే ఉన్నారే. గణిత దేవుని కాళ్ళు మొక్కేలా ఉన్నారు మీరు. 617 00:47:44,031 --> 00:47:46,325 మీరు సెల్డన్ అనుకుంటున్నారా ఏంటి! 618 00:47:48,035 --> 00:47:49,076 ఇక్కడి నుండి వెళ్తే, 619 00:47:49,077 --> 00:47:52,038 డెమెర్జల్ చేత నీ కొత్త క్లోన్ ని క్రియేట్ చేయిస్తా, ఏమనుకున్నావో! 620 00:47:52,039 --> 00:47:53,623 ప్లీజ్, సోదరా. ఇది ముఖ్యమైనది. 621 00:47:53,624 --> 00:47:56,292 ఎందుకు ముఖ్యమైనది? అది చెప్పింది కాబట్టా? 622 00:47:56,293 --> 00:47:58,212 ప్లీజ్. 623 00:48:08,388 --> 00:48:09,640 సరే. 624 00:48:20,484 --> 00:48:23,278 ఇది సుమారుగా నాలుగు నెలల తర్వాత పరిస్థితిని చూపుతోంది. 625 00:48:23,820 --> 00:48:24,779 టైమింగ్ ని బట్టి, 626 00:48:24,780 --> 00:48:28,824 ఇది మూడవ సెల్డన్ విపత్తును ప్రభావితం చేసే కొత్త ఇన్ పుట్ అని అనుకున్నా. 627 00:48:28,825 --> 00:48:33,871 కానీ నేను ఎన్ని సిమ్యులేషన్లను రన్ చేసినా, ఫలితం మాత్రం ఒక్కటే వస్తోంది. 628 00:48:33,872 --> 00:48:36,582 సెల్డన్ చీకటి యుగాలు వస్తాయని అంచనా వేశాడు, 629 00:48:36,583 --> 00:48:39,460 మన అడ్మినిస్ట్రేషన్స్ వాటిని వెనక్కి నెట్టాయని నేను అనుకున్నా, కానీ... 630 00:48:39,461 --> 00:48:43,131 మన వంశం పతనమైనప్పుడే అతని చీకటి యుగం మొదలవుతుందని ఆయన అన్నాడు. 631 00:48:45,759 --> 00:48:49,346 అది నాలుగు నెలల్లో జరుగుతుందని ఇది చెప్తోందా? 632 00:48:50,138 --> 00:48:51,348 అంతే కాదు. 633 00:48:51,932 --> 00:48:54,809 అక్కడ కనిపిస్తున్న చీకటి, నాగరికత ముగింపును సూచిస్తోంది. 634 00:48:54,810 --> 00:48:56,228 దాని తర్వాత ఏం జరుగుతోందో చెప్పడంలో... 635 00:48:58,689 --> 00:49:00,565 ఈ మోడల్ పూర్తిగా విఫలమవుతోంది. 636 00:49:00,566 --> 00:49:02,692 అంటే, కొన్ని సంఘటనలు ఇప్పటికే ప్రాణం పోసుకున్నాయని, 637 00:49:02,693 --> 00:49:05,279 అవి సెల్డన్ లెక్కలని తారుమారు చేయగలవని అర్థం. 638 00:49:07,072 --> 00:49:10,409 మీ జాతే అంతరించి పోయే ప్రమాదముంది. 639 00:49:11,869 --> 00:49:13,036 నాలుగు నెలల తర్వాత. 640 00:49:17,791 --> 00:49:19,333 మొత్తం అంతమైపోతుంది. 641 00:49:19,334 --> 00:49:23,505 ఎంపైర్, ఫౌండేషన్ రెండూ కూడా, తప్పించుకోవడం సాధ్యం కాని ఒకే భవిష్యత్తు వైపు అడుగులేస్తున్నాయి. 642 00:49:24,006 --> 00:49:26,132 కానీ ఆ ఇరుపక్షాలకీ తెలీదు, అదెలా జరుగుతుందో అని. 643 00:49:26,133 --> 00:49:28,384 దానికి కారణమైన వ్యక్తిని వాళ్లింకా కలుసుకోలేదు. 644 00:49:28,385 --> 00:49:29,635 కానీ నేను కలుసుకున్నాను. 645 00:49:29,636 --> 00:49:30,720 ఇగ్నిస్ 646 00:49:30,721 --> 00:49:33,432 నా కళ్ళు మూతపడినప్పుడల్లా అతను కనిపిస్తాడు. 647 00:49:37,561 --> 00:49:40,772 ద్వితీయ ఫౌండేషన్ ఎక్కడ? 648 00:49:45,694 --> 00:49:48,197 మ్యూల్ వచ్చేశాడు. మనకు ఎక్కువ సమయం లేదు. 649 00:51:15,284 --> 00:51:17,286 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్ 649 00:51:18,305 --> 00:52:18,485 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm