"Murderbot" The Perimeter
ID | 13183331 |
---|---|
Movie Name | "Murderbot" The Perimeter |
Release Name | Murderbot.S01E10.The.Perimeter.2160p.ATVp.WEB-DL.DDP5.1.Atmos.DV.HDR.H.265-RAWR.te.#79 |
Year | 2025 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 34767992 |
Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-
2
00:00:12,095 --> 00:00:13,554
సిస్టమ్ రీబూట్
3
00:00:13,555 --> 00:00:14,639
[బీప్ మంటున్న శబ్దం]
4
00:00:14,640 --> 00:00:16,475
[మర్డర్ బాట్] ఏదో జరిగింది.
5
00:00:19,561 --> 00:00:20,561
సమస్య విశ్లేషణ ప్రారంభించండి
6
00:00:20,562 --> 00:00:21,813
ఏదో.
7
00:00:24,650 --> 00:00:25,817
ఏదో జరిగింది.
8
00:00:30,239 --> 00:00:31,239
సమస్య విశ్లేషణ ప్రక్రియ జరుగుతోంది
9
00:00:31,240 --> 00:00:32,491
ఎక్కడ ఉన్నాను నేను?
10
00:00:33,408 --> 00:00:34,408
ఎక్కడ ఉన్నాను నేను?
11
00:00:34,409 --> 00:00:36,453
[టెక్నీషియన్] వావ్. కుంభకర్ణుడు లేచాడ్రోయ్.
12
00:00:37,454 --> 00:00:38,579
[మర్డర్ బాట్] ఎక్కడ ఉన్నాను నేను?
13
00:00:38,580 --> 00:00:42,084
ఇది స్వర్గం. అభినందనలు.
నువ్వు స్వర్గానికే వచ్చావు.
14
00:00:44,586 --> 00:00:47,130
డాక్టర్ మెన్సా? మీరు ఇక్కడ ఉన్నారా?
15
00:00:48,215 --> 00:00:49,215
ముఖ గుర్తింపు స్కాన్
16
00:00:49,216 --> 00:00:51,217
డాక్టర్ మెన్సా ఎక్కడ ఉన్నారు? పిన్-లీ? అరాడా?
17
00:00:51,218 --> 00:00:54,679
- ఎవరు వాళ్ళు?
- నా క్లయింట్లు. నా క్లయింట్లు ఎక్కడ ఉన్నారు?
18
00:00:54,680 --> 00:00:55,764
అవన్నీ ఆలోచించకు.
19
00:00:58,183 --> 00:00:59,475
మీరెవరు ఇంతకీ?
20
00:00:59,476 --> 00:01:01,353
హా. నీ అబ్బని నేను.
21
00:01:01,937 --> 00:01:04,397
డస్ట్ బిన్ ని పెళ్లి చేసుకుంటే, నువ్వు పుట్టావు.
22
00:01:05,399 --> 00:01:08,609
ఓకే. జ్ఞాపకాలను పూర్తిగా తీసేయ్.
23
00:01:08,610 --> 00:01:10,696
- ఏంటి?
- [ఇంజినీర్] కానివ్వు.
24
00:01:11,822 --> 00:01:12,865
ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు...
25
00:01:20,455 --> 00:01:23,332
సెక్ సిస్టమ్ చర్య
జ్ఞాపకాలు తీసివేయబడుతున్నాయి
26
00:01:23,333 --> 00:01:26,795
[మర్డర్ బాట్] ఒక్క నిమిషం. నాకు... నాకు గుర్తొస్తోంది.
27
00:01:30,090 --> 00:01:33,844
నా క్లయింట్లు. మనుషులు.
28
00:01:35,512 --> 00:01:38,640
వాళ్ళు ఎవరు... వాళ్ళు ఎవరు అసలు?
29
00:01:39,433 --> 00:01:42,310
[మొదటి బోర్డ్ మెంబర్] పునఃస్వాగతం.
ఓపిగ్గా వేచి ఉన్నందుకు థ్యాంక్యూ.
30
00:01:42,311 --> 00:01:43,395
ఏది అది?
31
00:01:43,896 --> 00:01:44,897
సెక్ యూనిట్ ఎక్కడ?
32
00:01:45,856 --> 00:01:46,981
[తడబడుతూ] క్షమించాలి. మీరు...
33
00:01:46,982 --> 00:01:50,234
మీరు ఒక వస్తువు ఆచూకీ అడుగుతున్నారా?
34
00:01:50,235 --> 00:01:53,738
మా మిషన్ కి కేటాయించిన
సెక్ యూనిట్ గురించి మాట్లాడుతున్నాం మేము.
35
00:01:53,739 --> 00:01:56,324
ఆ, మా ప్రాణాలు కాపాడింది అది.
36
00:01:56,325 --> 00:02:00,329
అవును. ఎందుకంటే
అదేం వస్తువు కాదు. అదేం టెంట్ కాదు.
37
00:02:00,996 --> 00:02:04,291
కానీ, టెంట్ ప్రోటోకాల్స్, దాని ప్రోటోకాల్స్ ఒకటే.
38
00:02:05,042 --> 00:02:06,667
- చాలా దారుణం ఇది!
- [గురాతిన్] అవును.
39
00:02:06,668 --> 00:02:11,173
నిజం చెప్పాలంటే, అదెక్కడ
ఉందనేది మీకు అక్కర్లేని విషయం.
40
00:02:12,424 --> 00:02:14,551
మాకు అక్కర్లేని విషయమని
మీరన్నంత మాత్రాన అక్కర్లేనిది అయిపోదు అది.
41
00:02:15,135 --> 00:02:19,096
డెల్ట్ ఫాల్ జట్టును ఊచకోత కోసి,
మమ్మల్ని చంపాలని చూసిన ఒక బృందానికి
42
00:02:19,097 --> 00:02:25,938
మీరు సామాగ్రిని, రవాణాని
అందించారనే విషయం, రహస్యంగా ఉండింది.
43
00:02:27,147 --> 00:02:28,398
ఇప్పటి దాకా.
44
00:02:29,399 --> 00:02:34,362
మీ జవాబుదారితన ఒప్పందంతో పాటు ప్రతి ఒక్కరి
ఒప్పందంలో కూడా రహస్యమని ఒక నిబంధన ఉంటుంది.
45
00:02:34,363 --> 00:02:37,073
ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది చెల్లదు.
46
00:02:37,074 --> 00:02:40,661
మీరు ఎదుర్కొన్న రిస్కులు, ఒప్పందంలో
భాగంగా మీరు అంగీకరించినవే, కాబట్టి...
47
00:02:43,372 --> 00:02:45,623
898/8712 గ్రహంలో జరిగిన సంఘటనకి,
48
00:02:45,624 --> 00:02:50,711
కంపెనీకి ఏ సంబంధమూ లేదు,
49
00:02:50,712 --> 00:02:53,381
అంతేకాకుండా, ఆ గ్రహంపై కంపెనీ నుండి
అనుమతి తీసుకొని వెళ్లిన వారి గురించి తప్ప,
50
00:02:53,382 --> 00:02:56,385
మిగతా వారి గురించి కంపెనీకి ఏ మాత్రం తెలీదు.
51
00:02:57,886 --> 00:03:03,475
ఓకే. మంచిది. మేము తాడోపేడో
తేల్చుకోవాల్సిన వెధవ్వి నువ్వే అన్నమాట.
52
00:03:04,309 --> 00:03:06,186
అవును. ఆ వెధవని నేనే.
53
00:03:07,855 --> 00:03:09,314
[టెక్నీషియన్] ఓకే. అయిపోయింది.
54
00:03:11,191 --> 00:03:13,067
ఇది నిజంగానే దాని క్లయింట్ల చావుకు కారణమైందా?
55
00:03:13,068 --> 00:03:16,362
అదంతా నాకు తెలీదు. కార్పొరేట్ వాళ్ళు
ఆదేశించిన దాని ప్రకారం నేను చేస్తున్నా.
56
00:03:16,363 --> 00:03:17,781
ఏదో గడబిడే చేసినట్టుంది.
57
00:03:19,074 --> 00:03:21,994
ఏదైతే ఏంటి? ఇప్పుడు జ్ఞాపకాలన్నీ తీసేశాంగా.
58
00:03:22,578 --> 00:03:25,622
ఓకే, ఒక కొత్త గవర్నర్ మాడ్యూల్ ని ఇన్ స్టాల్ చేయి.
59
00:03:27,207 --> 00:03:29,000
- ఏంటి?
- ఏంటి?
60
00:03:29,001 --> 00:03:31,753
[విసుగ్గా] దీనిలో, పని చేసే గవర్నర్ మాడ్యూల్ లేదా?
61
00:03:33,005 --> 00:03:34,463
లేదు. ఇక్కడ లేదనే ఉంది.
62
00:03:34,464 --> 00:03:36,340
ఏంటి? ముందే ఎందుకు చెప్పలేదు నాకు?
63
00:03:36,341 --> 00:03:40,929
ఆవేశపడకు. ఇది స్పృహలో లేదు.
ఇది ఇప్పుడు ఏమీ చేసే స్థితిలో లేదు.
64
00:03:42,556 --> 00:03:43,557
నిజమే కదా?
65
00:03:44,308 --> 00:03:46,935
[ఉమ్మివేస్తాడు]
66
00:03:49,730 --> 00:03:51,315
కానివ్వు. గవర్నర్ మాడ్యూల్ ని ఇన్ స్టాల్ చేయి.
67
00:04:04,870 --> 00:04:08,081
సెక్ సిస్టమ్ అలర్ట్:
గవర్నర్ మాడ్యూల్ అప్ లోడ్ అవుతోంది
68
00:04:08,582 --> 00:04:09,790
[టెక్నీషియన్]
కొత్త గవర్నర్ మాడ్యూల్ ఎక్కించా.
69
00:04:09,791 --> 00:04:10,876
గవర్నర్ మాడ్యూల్
పూర్తయింది
70
00:04:13,754 --> 00:04:14,796
బూట్ అవుతోంది.
71
00:04:16,423 --> 00:04:17,797
[ఇంజినీర్] సెక్ యూనిట్, రిపోర్ట్ చేయి.
72
00:04:17,798 --> 00:04:20,343
సెక్ సిస్టమ్ అప్ డేట్
ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ అయింది
73
00:04:20,344 --> 00:04:21,552
ఆదేశం అందింది
74
00:04:21,553 --> 00:04:26,266
హలో. ఈ సెక్యూరిటీ యూనిట్
ఇప్పుడు ఆన్ లైన్లోకి వచ్చింది.
75
00:04:27,017 --> 00:04:28,310
ఆదేశం కోసం ఎదురు చూస్తున్నా.
76
00:04:29,228 --> 00:04:30,562
[ఇంజినీర్] టేబుల్ దిగు.
77
00:04:33,941 --> 00:04:35,692
నీ కడుపును తడుముకుంటూ, తలని తడుతూ ఉండు.
78
00:04:39,821 --> 00:04:40,822
ఇక ఆపు.
79
00:04:41,615 --> 00:04:45,451
చూశావా? అంతా ఓకే.
దీని వల్ల ఇప్పుడు ఏ ప్రమాదమూ లేదు.
80
00:04:45,452 --> 00:04:48,288
కానీ చేతులకు తుపాకులు ఉన్న
శక్తివంతమైన చంటి బిడ్డ ఇది.
81
00:04:50,082 --> 00:04:54,211
చంటి బిడ్డలా ప్రవర్తించు.
ఉదాహరణకు... [బిడ్డ ఏడుస్తున్నట్టు చేస్తాడు]
82
00:04:55,671 --> 00:04:56,672
చేయి.
83
00:04:57,673 --> 00:05:01,718
[బిడ్డ ఏడుపును అనుకరిస్తున్నాడు]
84
00:05:03,220 --> 00:05:05,388
ఏం జరుగుతోంది ఇక్కడ?
85
00:05:05,389 --> 00:05:07,349
ఆపు. ఆపు. ఆపేయ్.
86
00:05:08,433 --> 00:05:10,059
ఇది నా సెక్యూరిటీ యూనిట్ యేనా?
87
00:05:10,060 --> 00:05:12,603
అవును. ఇది, ఆ, సిద్ధంగా ఉంది.
88
00:05:12,604 --> 00:05:14,188
[కంపెనీ ప్రతినిధి] అయితే, హెల్మెట్ వేసేయండి.
89
00:05:14,189 --> 00:05:15,899
[టెక్నీషియన్] దీనికి ఏ పని అప్పగిస్తున్నారు?
90
00:05:17,651 --> 00:05:18,652
సెక్యూరిటీ.
91
00:05:19,862 --> 00:05:22,322
[థీమ్ సంగీతం ప్లే అవుతోంది]
92
00:06:19,630 --> 00:06:21,381
మార్తా వెల్స్ రచించిన "ఆల్ సిస్టమ్స్ రెడ్" ఆధారితమైనది
93
00:06:35,145 --> 00:06:36,562
మా సెక్ యూనిట్ ఎక్కడ ఉంది?
94
00:06:36,563 --> 00:06:41,401
అది మీది కాదు. మాది.
95
00:06:41,902 --> 00:06:46,657
మేడమ్ ప్రెసిడెంట్. నన్ను మేడమ్ ప్రెసిడెంట్ అని పిలవండి.
96
00:06:47,699 --> 00:06:52,245
ఒక విధంగా చెప్పాలంటే, ఆ సెక్ యూనిట్ కీలక సాక్షి.
97
00:06:52,246 --> 00:06:58,376
మేడమ్ ప్రెసిడెంట్, అది సాక్షి కాదు.
మహా అయితే, దాన్ని రికార్డింగ్ పరికరంగా భావించవచ్చు, అంతే.
98
00:06:58,377 --> 00:07:00,962
అలా అయినా, దాని గురించి మీరు సమాచారం ఇవ్వాలి కదా.
99
00:07:00,963 --> 00:07:05,175
అది రికార్డింగ్ పరికరం అంటున్నారు కదా.
సరే. మాకు ఆధారానికి యాక్సెస్ కావాలి.
100
00:07:14,560 --> 00:07:15,561
దాన్ని మేము కొంటాం.
101
00:07:16,895 --> 00:07:18,145
మేము సెక్ యూనిట్ ని కొంటాం.
102
00:07:18,146 --> 00:07:19,522
మన ఉద్దేశం మన వద్దే అట్టిపెట్టుకోవడం కాదు.
103
00:07:19,523 --> 00:07:20,815
అది ఇక్కడ ఉంది.
104
00:07:20,816 --> 00:07:21,899
చాలా ఖర్చు అవుతోంది.
105
00:07:21,900 --> 00:07:26,738
మీ కంపెనీపై మేము వేయబోయే కేసుతో
మీరు చెల్లించాల్సి వచ్చే పరిహారం కూడా భారీగానే ఉంటుంది.
106
00:07:27,281 --> 00:07:32,118
సరే. అయితే, సెక్ యూనిట్ ని మీకు అప్పగిస్తే,
107
00:07:32,119 --> 00:07:33,494
మాపై మీరు కేసు వేయరా?
108
00:07:33,495 --> 00:07:37,915
లేదు. మా సెక్ యూనిట్ తో పాటు
మీ కంపెనీలో సగాన్ని భూస్థాపితం చేస్తామని అంటున్నా.
109
00:07:37,916 --> 00:07:39,834
[నవ్వుతుంది]
110
00:07:39,835 --> 00:07:45,047
మీకు ఆ యూనిట్ ఇవ్వలేం.
ఇంకా మెరుగైన యూనిట్ ఇవ్వగలం.
111
00:07:45,048 --> 00:07:48,009
మాకు మెరుగైనదేం అక్కర్లేదు, అదే కావాలి.
112
00:07:48,010 --> 00:07:49,844
అది ఎలాగూ సరిగ్గా పని చేయట్లేదు కదా.
113
00:07:49,845 --> 00:07:53,015
బాగానే పని చేస్తుంది. కాకపోతే అధునాతన మోడల్ కాదు.
114
00:07:54,433 --> 00:07:57,185
మేడమ్ ప్రెసిడెంట్,
ఆ యూనిట్ కి చెందిన గవర్నర్ మాడ్యూల్
115
00:07:57,186 --> 00:07:58,812
సరిగ్గా పని చేయట్లేదని తెలిసింది.
116
00:07:59,479 --> 00:08:02,107
అది అసాధారణంగా ప్రవర్తించడం ఏమైనా గమనించారా?
117
00:08:05,194 --> 00:08:07,737
మీరు అలా ప్రవర్తించినా, అది మాకు తెలియజేకుంటే,
118
00:08:07,738 --> 00:08:10,698
కంపెనీతో మీరు కుదుర్చుకున్న
ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది.
119
00:08:10,699 --> 00:08:16,580
సరే. చూడండి. మీకు ఇబ్బంది కలిగించే అంశం దానికేమైనా
తెలుసేమో అని మీకు భయంగా ఉంటే, భయపడాల్సిన పనే లేదు.
120
00:08:17,456 --> 00:08:21,585
ఎందుకంటే, దాని గవర్నర్ మాడ్యూల్ ని మార్చేశాం,
దాని జ్ఞాపకాలను కూడా తుడిచేశాం.
121
00:08:23,587 --> 00:08:24,587
ఏంటి?
122
00:08:24,588 --> 00:08:27,216
అవును. ఇప్పుడు అది కొత్తది అన్నట్టే లెక్క.
123
00:08:29,927 --> 00:08:33,179
అయితే, మన... మన పాత యూనిట్ పోయినట్టేనా?
124
00:08:36,433 --> 00:08:40,437
[ఉద్రిక్తమైన సంగీతం ప్లే అవుతుంది]
125
00:08:56,453 --> 00:08:57,787
సెక్ యూనిట్!
126
00:08:57,788 --> 00:09:00,249
సెక్ యూనిట్. హేయ్. సెక్కీ.
127
00:09:00,916 --> 00:09:02,918
నాకు ముందే తెలుసు.
మేము నిన్ను కనుగొంటామని ముందే తెలుసు.
128
00:09:04,294 --> 00:09:05,920
- హాయ్. సెక్కీ.
- [ఆఫీసర్] ఆగండి. ఓయ్.
129
00:09:05,921 --> 00:09:08,714
జైలు పాలవ్వాలని
అనుకుంటున్నారా ఏంటి? ఏంటి మీ సమస్య?
130
00:09:08,715 --> 00:09:11,551
అంటే... ఇది నా సెక్ యూనిట్. గతంలో.
131
00:09:11,552 --> 00:09:15,055
లేదు. ఇప్పుడు ఇది నాది, మీరు ఇప్పుడు
పోలీసుల విధికి ఆటంకం కలిగిస్తున్నారు.
132
00:09:16,390 --> 00:09:17,390
ఇక రండి.
133
00:09:17,391 --> 00:09:20,269
హేయ్, హేయ్. ఏమైంది? నేనే. అతనికి చెప్పు నేనెవరినో.
134
00:09:22,771 --> 00:09:23,980
ముఖ గుర్తింపు స్కాన్
135
00:09:23,981 --> 00:09:25,439
నేనెవరో అతనికి చెప్పు.
136
00:09:25,440 --> 00:09:26,524
క్లయింట్ ఐడీ: తెలీదు
137
00:09:26,525 --> 00:09:28,735
[ఆఫీసర్] ఆ పిచ్చోడి భరతం పట్టు, సెక్ యూనిట్.
138
00:09:29,486 --> 00:09:32,739
వద్దు. అబ్బా. అతడిని చంపవద్దు.
ఆ పని తర్వాత చేద్దువులే.
139
00:09:33,991 --> 00:09:35,325
సరే మరి. రండి ఇక.
140
00:09:40,080 --> 00:09:45,294
[ఉద్రిక్తమైన సంగీతం ప్లే అవుతుంది]
141
00:09:45,878 --> 00:09:48,881
చెప్తున్నా కదా, అది అస్సలు నన్ను గుర్తుపట్టనే లేదు.
142
00:09:54,261 --> 00:09:56,179
ఓకే. అది స్టేషన్లోనే ఉంది కదా. మంచిదే అది.
143
00:09:56,180 --> 00:09:58,347
నేను కేసు వేస్తా.
144
00:09:58,348 --> 00:10:01,642
వేసి లాభమేంటి? అది... అది ఇప్పుడు
మనది కాదు. దాని... దాని జ్ఞాపకాలు తీసేశారు.
145
00:10:01,643 --> 00:10:03,520
[మెన్సా] దాన్ని నేను నమ్మట్లేదు.
146
00:10:04,021 --> 00:10:07,523
మనం కలిసి గడిపిన మధురమైన క్షణాలన్నీ
తుడిచేస్తే తుడిచిపెట్టుకుపోతాయంటే,
147
00:10:07,524 --> 00:10:10,277
- నమ్మడం నా వల్ల కాదు.
- కానీ, అది నిజమే.
148
00:10:11,028 --> 00:10:12,070
అది నిజమే.
149
00:10:12,821 --> 00:10:15,406
అయితే, అది... [నిట్టూరుస్తుంది]
అది ఇంకా బానిసగానే ఉంది అన్నమాట.
150
00:10:15,407 --> 00:10:16,908
ఇప్పుడది మనకి తెలిసిన యూనిట్ కాదు, అరాడా.
151
00:10:16,909 --> 00:10:18,911
మనం ఇక్కడికి రావడం
మంచిది కాదని ముందే చెప్పా కదా, ఐడా.
152
00:10:19,953 --> 00:10:24,207
కార్పొరేషన్ రిమ్ లో, బాధ తప్ప మరోటి దక్కదు.
153
00:10:24,208 --> 00:10:25,374
[జనాల కేరింతలు]
154
00:10:25,375 --> 00:10:28,211
అయినా కానీ, పార్టీలు జరుగుతూనే ఉంటాయి.
155
00:10:28,212 --> 00:10:31,340
నోర్మూసుకోండి! నోర్మూసుకోండి, అంతే!
156
00:10:32,424 --> 00:10:36,135
సెక్ యూనిట్ డేటా అంతా తుడిచేయడం అసాధ్యం.
157
00:10:36,136 --> 00:10:39,640
దాని నుండి తీసేయవచ్చు, కానీ
మొత్తానికే తుడిచేయలేరు. అలా జరగదు.
158
00:10:40,140 --> 00:10:45,186
తను అన్నది నిజమే. ఆ యూనిట్ లోని
డేటాపై వాళ్లకి హక్కులు ఉంటాయి.
159
00:10:45,187 --> 00:10:47,438
వాళ్ళు ఆ డేటా అంతటినీ పరిశీలిస్తారు,
160
00:10:47,439 --> 00:10:53,403
వాళ్ళకి ఆర్థికపరంగా లాభం కలిగించేది
రవ్వంత కనబడినా, దాన్ని అట్టిపెట్టుకొని ఉంటారు.
161
00:10:54,071 --> 00:10:55,530
అయితే, మనం దాన్ని సంపాదించుకోవాలి.
162
00:10:55,531 --> 00:10:59,992
రాటీ, వాళ్ళ దృష్టిలో వ్యక్తిత్వం
ఆర్థికపరంగా పనికి వచ్చేది కాదు.
163
00:10:59,993 --> 00:11:02,287
వాళ్ళు దాని నుండి ఏ డేటాను తీసుకున్నారో ఏమో కానీ,
164
00:11:03,288 --> 00:11:06,041
నా అంచనా ప్రకరాం, ఇప్పుడు సెక్ యూనిట్...
165
00:11:08,627 --> 00:11:09,628
వేరేది అయిపోయి ఉంటుంది.
166
00:11:13,674 --> 00:11:17,510
గురా, మనం ప్రయత్నమైతే చేయాలి కదా.
167
00:11:17,511 --> 00:11:19,513
పిన్-లీ కేసు విషయంలో ముందుకు పోవాలి.
168
00:11:22,432 --> 00:11:26,103
గురా, నీకు తెలిసిన చోటే ఇది.
169
00:11:27,479 --> 00:11:28,689
ఇప్పుడు మనమేం చేయవచ్చు?
170
00:11:30,691 --> 00:11:31,692
ఏం చేయగలం?
171
00:11:34,736 --> 00:11:36,864
ఇది కార్పొరేషన్ రిమ్.
172
00:11:39,449 --> 00:11:40,576
వీళ్ళు న్యాయంగా నడుచుకోరు.
173
00:11:42,327 --> 00:11:43,995
[నిరసనకారుల నిరసనలు]
174
00:11:43,996 --> 00:11:49,792
నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాటలు
జరుగుతున్నాయి. పరిస్థితి ముదిరినట్టుగానే అనిపిస్తోంది.
175
00:11:49,793 --> 00:11:53,129
ఇప్పుడు, ఇంకా కాంట్రాక్టులోనే ఉన్న వీళ్ళు...
176
00:11:53,130 --> 00:11:56,507
వారి కాంట్రాక్టులు ప్రారంభమైనందున,
సర్వీస్ నియమాలు ముగిసినట్టే.
177
00:11:56,508 --> 00:11:59,844
చట్టపరమైన సంస్థ కాదు కాబట్టి,
ఏది సరైన చర్యో నిర్ణయించే అధికారం దానికి లేదు.
178
00:11:59,845 --> 00:12:01,888
[రిపోర్టర్] ...అధికారులు
స్పష్టంగా తేల్చి చెప్పేస్తున్నారు.
179
00:12:01,889 --> 00:12:04,265
- పని చేస్తేనే ఆహారం ఉంటుంది.
- నా బిడ్డకి ఆహారం ఎలా!
180
00:12:04,266 --> 00:12:06,018
[నిరసనకారుడు] ఇది సరైన పని కాదు!
181
00:12:06,560 --> 00:12:08,477
[ఆఫీసర్] జైలుకెళ్లాలని ఉందా? అదే జరుగుతుంది మరి.
182
00:12:08,478 --> 00:12:09,563
వెళ్తావా జైలుకు?
183
00:12:11,565 --> 00:12:16,195
[నిరసనకారులు] మేము బానిసలం కాదు!
మేము బానిసలం కాదు! మేము బానిసలం కాదు!
184
00:12:26,163 --> 00:12:28,332
[నిరసనలు ఆగుతాయి]
185
00:12:32,127 --> 00:12:35,796
మీ కాంట్రాక్టులను మీరు ఉల్లంఘించారు.
ఇక ఇక్కడి నుండి వెళ్లిపోండి!
186
00:12:35,797 --> 00:12:37,216
[రెండో నిరసనకారుడు] లేదు, ఇది సరైంది కాదు!
187
00:12:38,467 --> 00:12:39,843
మేము ఎందుకు వెళ్ళాలి?
188
00:12:41,512 --> 00:12:43,388
కానివ్వండి. వీళ్ళ ఎముకలు విరిచిపారేయండి.
189
00:12:44,097 --> 00:12:46,350
[నిరసనకారుల గోల]
190
00:12:48,352 --> 00:12:49,686
[అరుస్తాడు]
191
00:12:51,605 --> 00:12:53,649
[అరుస్తాడు]
192
00:12:56,193 --> 00:12:58,278
[ముక్కుతాడు]
193
00:13:00,822 --> 00:13:02,783
డేటాకు అంతరాయం
కోడ్ సరిగ్గా పని చేయట్లేదు
194
00:13:06,286 --> 00:13:07,495
సెక్ సిస్టమ్ అలర్ట్
తక్షణ ప్రమాదం గుర్తించబడింది
195
00:13:07,496 --> 00:13:08,913
[మూడో నిరసనకారుడు అరుస్తాడు, ఎగశ్వాస]
196
00:13:08,914 --> 00:13:09,998
లక్ష్యం
197
00:13:10,666 --> 00:13:12,042
కాల్చవద్దు. కాల్చవద్దు.
198
00:13:19,091 --> 00:13:21,468
- [నాల్గవ నిరసనకారుడు] ఇది చెత్తది.
- [మొదటి నిరసనకారురాలు] గ్లిచ్ అవుతోంది.
199
00:13:23,262 --> 00:13:24,596
[అయిదవ నిరసనకారుడు] ఏమైంది దీనికి?
200
00:13:26,640 --> 00:13:29,851
[నిరసనకారులు ముక్కుతున్నారు, గోల చేస్తున్నారు]
201
00:13:29,852 --> 00:13:31,478
[ఆరవ నిరసనకారుడు] దాన్ని నేల మీద పడేసి, చంపేద్దాం!
202
00:13:42,155 --> 00:13:45,575
[ఎలక్ట్రానిక్ వాయిస్] మీరు ఆరవ రకానికి చెందిన
జీవనశైలి ఉండే నివాస ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు.
203
00:13:45,576 --> 00:13:48,953
ఆమోదించబడిన పనులకే
అనుమతి ఉంటుంది. ఊరికే తిరగరాదు.
204
00:13:48,954 --> 00:13:50,831
నిఘా నీడలో ఉన్నారని మర్చిపోవద్దు.
205
00:13:51,582 --> 00:13:53,584
[సస్పెన్స్ సంగీతం ప్లే అవుతుంది]
206
00:14:12,019 --> 00:14:14,021
హలో. చాలా కాలమైంది మనం కలిసి.
207
00:14:14,521 --> 00:14:18,524
ఇంటికి రావద్దని చెప్పా కదా.
రేపు ఆఫీసులో కలుసుకుందాం.
208
00:14:18,525 --> 00:14:20,526
అంత దాకా ఆగలేను. నాకు ఇప్పుడే కావాలి.
209
00:14:20,527 --> 00:14:24,531
[తడబడుతూ] నేను... [బలంగా శ్వాస తీసుకుంటాడు]
నేను ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేయట్లేదు.
210
00:14:25,032 --> 00:14:29,620
నాకు తెలుసు. నీ గురించి చెక్ చేశా. ఇప్పుడు
డేటా సెక్యూరిటీలో మూడవ లెవెల్ యాక్సెస్ తో పని చేస్తున్నావు.
211
00:14:30,204 --> 00:14:32,580
డ్రగ్స్ సప్లై చేసేటప్పుడే డబ్బులు ఎక్కువ వచ్చేవి కదా?
212
00:14:32,581 --> 00:14:33,956
[అబ్బాయి] నాన్నా, వస్తున్నావా?
213
00:14:33,957 --> 00:14:36,417
ఇప్పుడే వచ్చేస్తా. ఆ, ఒక్క నిమిషం ఆగు, సరేనా?
214
00:14:36,418 --> 00:14:37,919
నువ్వు ఇక్కడికి రాకూడదు, సరేనా?
215
00:14:37,920 --> 00:14:40,755
అసలు ఎందుకు వచ్చావు నువ్వు?
చూడు, నేను అనుకున్నాను నువ్వు...
216
00:14:40,756 --> 00:14:43,758
చచ్చాను అనా? చచ్చి ఉండే వాడినే. అంతా తమరి దయ.
217
00:14:43,759 --> 00:14:45,051
అవును. చావలేదని తెలుసు.
218
00:14:45,052 --> 00:14:49,223
కార్పొరేషన్ రిమ్ పరిధిలోకి రాని
ఏదో పిచ్చి గ్రహంలో ఉన్నావని అనుకున్నా.
219
00:14:53,352 --> 00:14:55,019
నువ్వు డ్రగ్స్ కి బానిస అయి, అది నా వల్లే అనకు.
220
00:14:55,020 --> 00:14:57,313
నీ వ్యసనానికి, నాకు ఎటువంటి సంబంధమూ లేదు...
221
00:14:57,314 --> 00:14:58,774
[తలుపు తెరుచుకుంటుంది]
222
00:14:59,566 --> 00:15:00,566
నాన్నా, ఎవరు ఈయన?
223
00:15:00,567 --> 00:15:05,196
ఈయన నా స్నేహితుడు, డాక్టర్ గురాతిన్.
ఒకప్పుడు మేము సహోద్యోగులం.
224
00:15:05,197 --> 00:15:09,201
అవును. [తడబడుతూ] కానీ,
ఆ తర్వాత నేను కస్టమర్ అయిపోయా.
225
00:15:10,827 --> 00:15:12,286
సరే, నువ్వు పాడాల్సిన సమయం వచ్చింది, నాన్నా.
226
00:15:12,287 --> 00:15:15,790
ఒకటి చెప్పనా? ఇప్పుడు పాట పాడమని నాన్నకి చెప్పు,
227
00:15:15,791 --> 00:15:17,709
- నేను త్వరగా వచ్చేస్తాను, సరేనా?
- సరే.
228
00:15:23,966 --> 00:15:24,967
పద.
229
00:15:30,639 --> 00:15:33,308
నాకు బాధగా అనిపించింది. జరిగిన దాని గురించి.
230
00:15:34,142 --> 00:15:35,143
టచ్ చేశావులే.
231
00:15:36,311 --> 00:15:37,813
నువ్వు హ్యాండిల్ చేయగలవేమో అనుకున్నా.
232
00:15:39,398 --> 00:15:43,068
కట్టు బానిసగా మార్చడం కోసం
జాగ్రత్తగా డిజైన్ చేయబడిన డ్రగ్స్ నా?
233
00:15:43,986 --> 00:15:45,361
బాగానే హ్యాండిల్ చేశాలే.
234
00:15:45,362 --> 00:15:46,780
నువ్వు అంతా తెలిసే చేశావు.
235
00:15:48,532 --> 00:15:50,534
వాటి వల్ల నా బతుకు నాశనమైపోతుంది తెలిసి కూడా చేశావు.
236
00:16:09,219 --> 00:16:10,762
[నిట్టూరుస్తాడు]
237
00:16:13,307 --> 00:16:14,433
[నిట్టూరుస్తాడు]
238
00:16:16,393 --> 00:16:17,394
[బీప్ మంటుంది]
239
00:16:27,571 --> 00:16:29,280
సెక్ యూనిట్ నుండి ఇటీవల తీసివేసిన జ్ఞాపకాలు
240
00:16:29,281 --> 00:16:30,365
ఏవీ లభించలేదు
241
00:16:37,331 --> 00:16:38,332
[బీప్ మంటుంది]
242
00:16:40,083 --> 00:16:42,544
నీకవి కనిపించవు. అంతా ఎన్ క్రిప్ట్ అయి ఉంటుంది.
243
00:16:49,635 --> 00:16:52,095
ఒక్క నిమిషం. ఎక్కడ వెతకాలో నాకు తెలుసు.
244
00:16:52,679 --> 00:16:55,598
"రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ శాంక్చువరీ మూన్" కోసం వెతుకు.
245
00:16:55,599 --> 00:16:57,434
"రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ శాంక్చువరీ మూన్"
246
00:16:59,520 --> 00:17:01,187
[బీప్ శబ్దాలు]
247
00:17:01,188 --> 00:17:02,272
[గురాతిన్ నిట్టూరుస్తాడు]
248
00:17:08,403 --> 00:17:09,819
ఈ ఫైల్ తాలూకు సోర్స్ ని ట్రేస్ చేయి.
249
00:17:09,820 --> 00:17:10,905
ఫైల్ తాలూకు సోర్స్ ని ట్రేస్ చేయి
250
00:17:10,906 --> 00:17:11,989
సోర్స్ లభించింది
251
00:17:11,990 --> 00:17:13,075
దొరికావు.
252
00:17:15,702 --> 00:17:17,370
- జ్ఞాపకాలన్నింటినీ డౌన్ లోడ్ చేయి.
- [మిత్రుడు] ఏంటి?
253
00:17:17,371 --> 00:17:18,454
డౌన్ లోడ్ మొదలుపెట్టు
254
00:17:24,211 --> 00:17:28,257
[డ్రమాటిక్ సంగీతం ప్లే అవుతుంది]
255
00:17:28,841 --> 00:17:31,677
[మిత్రుడు] గురాతిన్, ఏం చేస్తున్నావు? జాగ్రత్త.
256
00:17:32,427 --> 00:17:33,554
[ముక్కుతున్నాడు]
257
00:17:36,306 --> 00:17:39,101
ఎంత డేటాని డౌన్ లోడ్ చేస్తున్నావు? [ప్రతిధ్వని]
258
00:17:40,394 --> 00:17:42,895
- [మూలుగుతాడు]
- [మిత్రుడు] మరీ ఆవేశపడిపోకు.
259
00:17:42,896 --> 00:17:45,773
నోర్మూసుకో.
260
00:17:45,774 --> 00:17:47,860
[డ్రమాటిక్ సంగీతం కొనసాగుతుంది]
261
00:17:54,032 --> 00:17:56,492
[మెన్సా] మేము పిలవగానే
వెంటనే వచ్చేసినందుకు థ్యాంక్యూ.
262
00:17:56,493 --> 00:17:58,202
ఆ పుకార్లు నిజమేనా?
263
00:17:58,203 --> 00:18:02,373
ఒక సర్వే టీమ్ మొత్తాన్ని చంపేశారా?
మీపై కూడా దాడి జరిగిందా?
264
00:18:02,374 --> 00:18:05,334
డెల్ట్ ఫాల్ ఇండస్ట్రియల్ కన్సర్న్
నుండి ఒక టీమ్ వచ్చింది,
265
00:18:05,335 --> 00:18:07,254
వాళ్ళని ఆ సెక్ యూనిట్లు చంపేశాయి.
266
00:18:07,754 --> 00:18:11,924
అంటే, రౌడీ సెక్ యూనిట్లు, క్లయింట్లను
క్రూరంగా చంపేశాయా? ఇంకా...
267
00:18:11,925 --> 00:18:15,761
లేదు, వాటిలోకి ఫైటింగ్ ఓవర్ రైడ్ మాడ్యూల్స్ ని పెట్టారు,
268
00:18:15,762 --> 00:18:19,933
అవన్నీ గ్రేక్రిస్ అనే ఒక దుర్మార్గపు కార్పొరేట్ ఎంటిటీ
గుప్పెట్లోకి వెళ్లిపోయాయి.
269
00:18:20,601 --> 00:18:21,934
మమ్మల్ని కూడా చంపేసి ఉండే వాళ్ళే,
270
00:18:21,935 --> 00:18:26,147
కానీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సెక్ యూనిట్
మమ్మల్ని తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ కాపాడింది,
271
00:18:26,148 --> 00:18:28,399
కాబట్టి, జరిగిన సంఘటనలపై
272
00:18:28,400 --> 00:18:31,111
జరిగే విచారణలో అది కూడా
భాగంగా ఉండాలని మేము భావిస్తున్నాం.
273
00:18:31,612 --> 00:18:36,325
మీ గ్రహంలో, శృంగార రోబోట్లు మనుషులను
పెళ్ళాడవచ్చని విన్నాం, అది నిజమేనా?
274
00:18:38,202 --> 00:18:40,536
లేదు. మనం అసలు విషయం గురించి మాట్లాడుకుందామా?
275
00:18:40,537 --> 00:18:43,706
మేము వ్యక్తిగతంగా తనిఖీ చేయడం కోసమని
ఆ సెక్ యూనిట్ ని విచారణలో భాగం చేయడానికి
276
00:18:43,707 --> 00:18:46,293
మా న్యాయవాది వాజ్యం వేయనున్నారు.
277
00:18:46,960 --> 00:18:47,961
దాని ఆచూకీ తెలిసింది.
278
00:18:51,131 --> 00:18:54,133
[భయానకమైన సంగీతం ప్లే అవుతోంది]
279
00:18:54,134 --> 00:18:57,888
[ఎలక్ట్రానిక్ వాయిస్] జాగ్రత్త. యాసిడ్ కరిగించే
ప్రక్రియ జరుగుతోంది. తగిన దూరం పాటించండి.
280
00:19:03,352 --> 00:19:04,685
డ్రమ్ములో తదుపరి యూనిట్ ని ముంచవచ్చు.
281
00:19:04,686 --> 00:19:06,647
స్థానిక నెట్వర్క్ ని యాక్సెస్ చేస్తున్నా...
స్థానిక సెక్ యూనిట్లను పింగ్ చేస్తున్నా
282
00:19:14,530 --> 00:19:15,822
సరే, పద.
283
00:19:21,537 --> 00:19:23,872
[ఆఫీసర్] సెక్ యూనిట్, వేదికపైకి ఎక్కు.
284
00:19:38,428 --> 00:19:41,682
[లాక్స్ ఖంగుమంటున్నాయి]
285
00:19:47,187 --> 00:19:51,859
[మెషిన్ పటపటమంటోంది]
286
00:19:53,277 --> 00:19:54,736
[కంపెనీ ప్రతినిధి] సరే. దాన్ని కరిగించేయండి.
287
00:19:56,613 --> 00:19:58,949
[ఎలక్ట్రానిక్ వాయిస్]
సిబ్బంది అంతా తగిన దూరం పాటించండి.
288
00:20:01,201 --> 00:20:02,202
ఆగండి!
289
00:20:04,913 --> 00:20:06,414
[కంపెనీ ప్రతినిథి] ఎక్కడికి వెళ్తున్నారు?
290
00:20:06,415 --> 00:20:07,790
- [ముక్కాడు]
- [పిన్-లీ] మీ ఫీడ్ చూసుకోండి.
291
00:20:07,791 --> 00:20:10,418
సెక్ యూనిట్ ని ధ్వంసం చేయకూడదని
న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు తెచ్చాను.
292
00:20:10,419 --> 00:20:14,214
దేవుడా! దాన్ని అక్కడి నుండి
దించేయండి. త్వరగా దించేయండి!
293
00:20:19,303 --> 00:20:20,304
సెక్ యూనిట్.
294
00:20:24,224 --> 00:20:26,184
క్లయింట్ ఐడీ: తెలీదు
295
00:20:26,185 --> 00:20:28,478
[తడబడుతూ] నీకు నిజంగానే మేమెవరో గుర్తు లేమా?
296
00:20:35,611 --> 00:20:37,029
నేనేం అనుకున్నానంటే... [నిట్టూరుస్తుంది]
297
00:20:37,696 --> 00:20:38,821
[నిట్టూరుస్తుంది]
298
00:20:38,822 --> 00:20:42,659
నీలో ఉన్న ఆర్గానిక్ ఎలిమెంట్స్,
మమ్మల్ని గుర్తుపట్టగలవని అనుకున్నా.
299
00:20:43,327 --> 00:20:45,329
మనం కలిసి చాలా అనుభవించాం.
300
00:20:49,750 --> 00:20:53,712
ఏం... [తడబడుతూ] ఏం జరిగిందో సెక్ యూనిట్ కి
చెప్దాం. అప్పుడు దానికి ఒక ఐడియా వస్తుంది కదా.
301
00:20:58,091 --> 00:21:01,303
బాబోయ్. అది నా కళ్ళల్లోకి చూస్తోంది.
302
00:21:02,596 --> 00:21:05,182
అది మన సెక్ యూనిట్ లానే అనిపించవచ్చు, కానీ కాదు.
303
00:21:13,148 --> 00:21:15,442
[తలుపు బీప్ మని తెరుచుకుంటుంది]
304
00:21:19,321 --> 00:21:20,322
గురా...
305
00:21:23,325 --> 00:21:25,409
నాకు వాంతి వస్తోంది.
306
00:21:25,410 --> 00:21:26,744
[మెన్సా] గురా...
307
00:21:26,745 --> 00:21:27,828
[వాంతి చేసుకొని, మూలుగుతాడు]
308
00:21:27,829 --> 00:21:31,749
నువ్వు... నువ్వు కొంపదీసి డ్రగ్స్ తీసుకున్నావా?
మేము అసలు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఉండకూడదు.
309
00:21:31,750 --> 00:21:33,335
హా, హా, హా.
310
00:21:34,711 --> 00:21:39,508
లేదు. అది కాదు. ఆ... [బలంగా శ్వాస తీసుకుంటాడు]
నేను... [తడబడుతూ] నేనేమీ మళ్ళీ డ్రగ్స్ తీసుకోలేదు.
311
00:21:42,094 --> 00:21:43,095
నా దగ్గర ఉన్నాయి.
312
00:21:44,429 --> 00:21:45,430
ఏమున్నాయి?
313
00:21:49,309 --> 00:21:51,353
[నిట్టూరుస్తూ] వద్దు.
314
00:21:57,943 --> 00:21:58,944
[బీప్ శబ్దం]
315
00:22:05,075 --> 00:22:06,158
[బీప్ శబ్దం]
316
00:22:06,159 --> 00:22:10,497
[ఎలక్ట్రానిక్ శబ్దం]
317
00:22:11,123 --> 00:22:13,250
[ఫ్లాష్ బ్యాక్ సంగీతం ప్లే అవుతుంది]
318
00:22:33,020 --> 00:22:35,606
[గురాతిన్] అయిపోయింది. మా కనెక్షన్ తీసేయ్.
319
00:22:39,109 --> 00:22:40,110
[మెన్సా] సెక్ యూనిట్...
320
00:22:42,029 --> 00:22:43,613
సెక్ యూనిట్, నువ్వు బాగానే ఉన్నావా?
321
00:22:43,614 --> 00:22:45,489
[రాటీ] అది పని చేసిందా? మేమెవరమో గుర్తొచ్చామా?
322
00:22:45,490 --> 00:22:47,451
[భరద్వాజ్] గుర్తున్నామా? గుర్తున్నామా?
323
00:22:51,914 --> 00:22:52,915
[నిట్టూరుస్తాడు]
324
00:22:55,959 --> 00:22:59,420
"శాంక్చువరీ మూన్" లో 420 నుండి 568 వరకు
ఎపిసోడ్లు మిస్ అవుతున్నాయి.
325
00:22:59,421 --> 00:23:01,547
- [మెన్సా నిట్టూర్చి, నవ్వుతుంది]
- [అందరి నవ్వులు, కేరింతలు]
326
00:23:01,548 --> 00:23:03,049
ఇదే మన సెక్ యూనిట్!
327
00:23:03,050 --> 00:23:05,009
- థ్యాంక్స్ లాంటివి చెప్పక్కర్లేదు.
- ఓహ్!
328
00:23:05,010 --> 00:23:10,348
ఓహ్, గురా...
[బలంగా శ్వాస తీసుకుంటూ] గురా... థ్యాంక్యూ.
329
00:23:10,349 --> 00:23:12,433
నేను కంపెనీకి గుణపాఠం నేర్పించాలని ఇలా చేశా.
330
00:23:12,434 --> 00:23:13,935
[మర్డర్ బాట్] ఏదో జరిగింది.
331
00:23:13,936 --> 00:23:15,645
- అరాడా, రా!
- మన సెక్ యూనిట్ మనకి దక్కింది.
332
00:23:15,646 --> 00:23:17,522
- పని చేసిందా? సూపర్.
- హా.
333
00:23:17,523 --> 00:23:19,982
- [మర్డర్ బాట్] ఏదో...
- [నవ్వుతూ] హాయ్. ఇదుగో...
334
00:23:19,983 --> 00:23:23,194
- ఏదో జరిగింది.
- ఇప్పుడే ప్రింటర్లో ప్రింట్ చేసి పట్టుకొచ్చా.
335
00:23:23,195 --> 00:23:24,321
ఇది సరిపోతుందనే అనుకుంటున్నా.
336
00:23:27,199 --> 00:23:28,992
ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు.
337
00:23:29,493 --> 00:23:32,246
[ఎగబీలుస్తుంది] నీ కాంట్రాక్ట్ ని మేము కొనేశాం.
338
00:23:33,121 --> 00:23:35,623
కంపెనీ, తన పేరుకు నష్టం రాకుండా చూసుకుంది.
339
00:23:35,624 --> 00:23:37,835
నిన్ను మాతో పాటు ప్రిజర్వేషన్ కి తీసుకెళ్తున్నాం.
340
00:23:38,710 --> 00:23:40,462
అక్కడ నువ్వు స్వతంత్రంగా తిరగవచ్చు.
341
00:23:41,129 --> 00:23:42,130
మీ ఉద్దేశం...
342
00:23:43,632 --> 00:23:45,091
ఇప్పుడు నేను యూనిట్ ని కాదా?
343
00:23:45,092 --> 00:23:46,176
కాదు.
344
00:23:50,639 --> 00:23:51,973
అయినా కానీ, నేను నా కవచాన్ని ఉంచుకోవచ్చా?
345
00:23:51,974 --> 00:23:54,642
- నీకు ఆ అవసరం ఉండదు.
- జనాలు నీపైకి కాల్పులేం జరపరు.
346
00:23:54,643 --> 00:23:57,813
జనాలు నన్ను కాల్చడం-గీల్చడం
చేయకపోతే, ఇక నేనేం చేయాలి?
347
00:23:58,856 --> 00:24:02,025
- నేను... నేను మీ బాడీగార్డ్ గా ఉంటానా?
- లేదు. ఆ...
348
00:24:03,652 --> 00:24:06,154
నేనే నీకు గార్డియన్ గా ఉంటా.
349
00:24:07,614 --> 00:24:10,701
[బలంగా శ్వాస తీసుకుంటూ]
నీకు అక్కడ చాలా అవకాశాలు ఉంటాయి.
350
00:24:11,618 --> 00:24:14,496
నీకేం కావాలంటే అది నువ్వు నేర్చుకోవచ్చు.
351
00:24:17,082 --> 00:24:19,750
నువ్వు ఏ సమయంలోనైనా నాతో గడపడానికి
రావచ్చు. నా ల్యాబ్ లోకి వచ్చి పని చేయవచ్చు.
352
00:24:19,751 --> 00:24:20,836
- [నవ్వుతాడు]
- [మెన్సా] మ్.
353
00:24:21,753 --> 00:24:24,339
ముందు నిన్ను మా గ్రహానికి తీసుకెళ్తాం,
అక్కడ దీని గురించి దీర్ఘంగా మాట్లాడుకోవచ్చు.
354
00:24:29,970 --> 00:24:31,262
మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు.
355
00:24:31,263 --> 00:24:32,346
[మెన్సా] అవును. [నవ్వు]
356
00:24:32,347 --> 00:24:34,223
- [నవ్వు] మనోడు కూడా ఆ మాట అనేశాడు.
- హా, మాట్లాడుకుందాం.
357
00:24:34,224 --> 00:24:35,851
సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా?
358
00:24:36,727 --> 00:24:38,187
ఎలా ఉందో చూడండి.
359
00:24:39,479 --> 00:24:40,480
రా.
360
00:24:41,023 --> 00:24:43,858
[మర్డర్ బాట్] నా కవచం చూస్తే కానీ
నేను సెక్ యూనిట్ ని అని జనాలకు తెలీదు.
361
00:24:43,859 --> 00:24:45,610
- ఆ, లుక్ అదిరింది, గురూ.
- ఓహ్, వావ్.
362
00:24:45,611 --> 00:24:46,694
[నవ్వుతుంది]
363
00:24:46,695 --> 00:24:48,321
[మర్డర్ బాట్] కానీ ఇప్పుడు నా పేరులో సెక్ పోయి...
364
00:24:48,322 --> 00:24:49,572
బాగుంది, సెక్ యూనిట్.
365
00:24:49,573 --> 00:24:50,657
[మర్డర్ బాట్] ...యూనిట్ మిగిలింది.
366
00:24:51,742 --> 00:24:53,243
నువ్వు మాతో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది.
367
00:24:53,827 --> 00:24:55,953
[భరద్వాజ్] డెల్ట్ ఫాల్ ప్రతినిధులు వచ్చారు.
368
00:24:55,954 --> 00:24:58,664
- సరే, వాళ్ళని ఇప్పుడు కలుద్దాం.
- సరే.
369
00:24:58,665 --> 00:25:01,209
సెక్ యూనిట్, ఆ, నువ్వు ఫ్రీగా ఉండు.
370
00:25:01,210 --> 00:25:03,754
ఆ, నీకేమైనా కావాలంటే, మాకు చెప్పు.
371
00:25:08,592 --> 00:25:10,092
[మర్డర్ బాట్] నేను వెనుక పక్క అంచున నిలబడి,
372
00:25:10,093 --> 00:25:13,055
మాట్లాడటానికి వస్తూ పోతున్న
అనేక మంది వ్యక్తులని చూస్తూ ఉన్నా.
373
00:25:13,722 --> 00:25:18,684
ఎక్కువగా న్యాయవాదులే.
కంపెనీకి చెందినవాళ్లు, డెల్ట్ ఫాల్ కి చెందినవాళ్లు,
374
00:25:18,685 --> 00:25:21,313
ఇంకా ఇతర కార్పొరేట్ సంస్థలకు చెందిన వాళ్ళు...
375
00:25:22,814 --> 00:25:24,983
గ్రేక్రిస్ మాతృ సంస్థకి చెందిన వాళ్ళు కూడా వచ్చారు.
376
00:25:25,609 --> 00:25:27,360
[టీమ్ నవ్వులు]
377
00:25:27,361 --> 00:25:30,030
[మర్డర్ బాట్] ఆ తర్వాత మేము పార్టీ చేసుకున్నాం.
378
00:25:31,114 --> 00:25:33,908
ఓహ్, అవునవును, అది నిజమే.
మేము ఎప్పుడూ పెరట్లోనే ఉంటాం.
379
00:25:33,909 --> 00:25:36,452
- నువ్వు అక్కడే పది గంటలు ఉన్నావు.
- అక్కడే కదా...
380
00:25:36,453 --> 00:25:37,537
- ఓహ్!
- అవును. ఇంకా...
381
00:25:37,538 --> 00:25:40,122
[మర్డర్ బాట్] వీళ్ళు,
తమ గ్రహానికి నన్ను ఆహ్వానిస్తున్నారు.
382
00:25:40,123 --> 00:25:42,167
నన్ను వీళ్ళ సొంత మనిషిగా చూస్తున్నారు.
383
00:25:42,668 --> 00:25:46,295
- ఇప్పుడు అందరం టోస్ట్ చేద్దామా?
- హా.
384
00:25:46,296 --> 00:25:49,382
[బలంగా శ్వాస తీసుకుంటూ] మన జట్టుకు జయహో.
385
00:25:49,383 --> 00:25:53,344
నీకు కూడా, సెక్ యూనిట్. స్వాగతం.
386
00:25:53,345 --> 00:25:55,346
- మన జట్టుకు... మన జట్టుకు జయహో.
- జట్టుకు.
387
00:25:55,347 --> 00:25:57,807
- ఇంకా సెక్ యూనిట్ కి కూడా!
- సెక్ యూనిట్! [నవ్వుతుంది]
388
00:25:57,808 --> 00:25:58,975
- [రాటీ] స్పీచ్!
- [అరాడా] ఇవ్వాలి.
389
00:25:58,976 --> 00:26:00,101
- [మెన్సా] లేదులే.
- [రాటీ] జోక్ లే.
390
00:26:00,102 --> 00:26:02,395
నేను జోక్ చేస్తున్నాలే. నువ్వేం చెప్పక్కర్లేదు.
391
00:26:02,396 --> 00:26:04,147
[మెన్సా] నువ్వేం చేయాలనుకుంటే అది చేయవచ్చు.
392
00:26:15,617 --> 00:26:17,619
[ఆలోచనలను రేకెత్తించే సంగీతం ప్లే అవుతోంది]
393
00:27:07,669 --> 00:27:08,670
ఎక్కడికి వెళ్తున్నావు?
394
00:27:11,423 --> 00:27:13,509
నేను... నేను...
395
00:27:15,594 --> 00:27:16,845
పరిసరాలను చెక్ చేయడానికి వెళ్తున్నా.
396
00:27:21,600 --> 00:27:26,855
[నిట్టూరుస్తూ] చూడు,
నీకు ఇదంతా అలవాటు అవుతుందిలే.
397
00:27:28,982 --> 00:27:30,108
వీళ్ళు మంచివాళ్ళు.
398
00:27:30,609 --> 00:27:34,488
ఈ ప్రిజర్వేషన్ అలయన్స్ వాళ్ళ కన్నా మంచివాళ్ళని
నేను కలుసుకోనే లేదు. [బలంగా శ్వాస తీసుకుంటాడు]
399
00:27:35,280 --> 00:27:36,364
[నిట్టూరుస్తాడు]
400
00:27:36,365 --> 00:27:37,449
అంటే...
401
00:27:39,660 --> 00:27:40,661
వీళ్ళు వింతగానే ఉంటారు.
402
00:27:43,539 --> 00:27:46,834
[నవ్వుతూ] వీళ్ళకి అలవాటు పడటానికి
నాకు చాలా ఏళ్ళు పట్టింది, ఒకసారి అలవాటయ్యాక...
403
00:27:51,839 --> 00:27:53,590
నీ స్థానం ఏంటో నీకే అర్థమవుతుంది.
404
00:27:57,219 --> 00:27:59,054
నీకు అన్నీ చూపిస్తాను, అన్నీ నేర్పిస్తాను.
405
00:28:01,765 --> 00:28:05,685
నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను,
నాకు అర్థమైందనే అనుకుంటున్నా,
406
00:28:05,686 --> 00:28:07,353
కొంత వరకు, ఏం...
407
00:28:07,354 --> 00:28:08,480
డాక్టర్ గురాతిన్...
408
00:28:12,985 --> 00:28:14,570
నేను పరిసరాలను చెక్ చేయాలి.
409
00:28:37,134 --> 00:28:38,844
నువ్వు పరిసరాలను చెక్ చేయాలి.
410
00:28:43,682 --> 00:28:44,683
థ్యాంక్యూ.
411
00:28:51,148 --> 00:28:52,858
[బలంగా శ్వాస తీసుకుంటాడు]
412
00:28:59,198 --> 00:29:00,199
[తలుపు మూసుకున్న శబ్దం]
413
00:29:01,241 --> 00:29:03,619
[శ్వాస వణుకుతుంది] థ్యాంక్యూ.
414
00:29:08,749 --> 00:29:10,751
[ఆలోచనలను రేకెత్తించే సంగీతం కొనసాగుతుంది]
415
00:29:48,413 --> 00:29:50,039
[మర్డర్ బాట్] నాకు చిత్రంగా అనిపించింది.
416
00:29:50,040 --> 00:29:53,502
ఈ దుస్తుల్లో, మెరుగుపరచబడిన మనిషిలా ఉన్నా నేను.
417
00:30:01,009 --> 00:30:04,972
నేను సెక్ యూనిట్ అని ఎవరూ గమనించలేదు... ఇంకా.
418
00:30:06,640 --> 00:30:08,349
నేను మ్యాప్ సిస్టమ్స్ ని యాక్సెస్ చేసి,
419
00:30:08,350 --> 00:30:11,061
అండర్ గ్రౌండ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ దగ్గరికి వెళ్లాను.
420
00:30:18,110 --> 00:30:19,987
షెడ్యూల్ ఫీడ్స్ చెక్ చేశాను.
421
00:30:23,198 --> 00:30:25,616
షెడ్యూల్ లో, తర్వాత ఒక రోబోట్ నడిపే రవాణా షిప్ ఉంది,
422
00:30:25,617 --> 00:30:27,578
అది దూరాన ఉన్న ఒక మైనింగ్ కేంద్రానికి వెళ్తోంది.
423
00:30:28,328 --> 00:30:29,787
పింగ్ చేసి దాన్ని పలకరించా.
424
00:30:29,788 --> 00:30:33,542
నేను మంచి సర్వెంట్ రోబోట్ అని,
నాకు లిఫ్ట్ కావాలని దానికి చెప్పా.
425
00:30:42,259 --> 00:30:46,096
నా దగ్గర చాలా షోలు, ఇంకా
చాలా మీడియా ఉందని, దానికి షేర్ చేస్తా అని చెప్పా.
426
00:30:47,347 --> 00:30:52,519
సరుకు రవాణా బాట్స్ కి కూడా
మంచి షోలు, మీడియా నచ్చుతాయని అర్థమైంది.
427
00:30:53,979 --> 00:30:55,981
[ఆశాజనకమైన సంగీతం ప్లే అవుతోంది]
428
00:31:01,278 --> 00:31:02,738
[ఎలక్ట్రానిక్ వాయిస్] తలుపులు మూసుకుంటున్నాయి.
429
00:31:30,307 --> 00:31:32,350
[ఆశాజనకమైన సంగీతం కొనసాగుతుంది]
430
00:31:32,351 --> 00:31:33,435
[మెన్సా నిట్టూరుస్తుంది]
431
00:31:48,367 --> 00:31:49,368
[నిట్టూరుస్తుంది]
432
00:32:08,428 --> 00:32:10,472
[మర్డర్ బాట్] నాకేం కావాలో నాకు తెలీదు.
433
00:32:14,810 --> 00:32:18,188
కానీ, నాకేం కావాలి అన్నది
ఇతరులు చెప్పడం నాకు ఇష్టం లేదు...
434
00:32:22,442 --> 00:32:24,111
నా తరఫున వారు నిర్ణయాలు తీసుకోవడమూ ఇష్టం లేదు.
435
00:32:24,653 --> 00:32:26,238
[మెన్సా శ్వాస వణుకుతుంది]
436
00:32:27,573 --> 00:32:30,951
- వారు నాకు ప్రాణాతి ప్రాణమైన మనిషి అయినా సరే.
- [ఏడుస్తుంది]
437
00:32:33,120 --> 00:32:35,122
[ఆశాజనకమైన సంగీతం కొనసాగుతుంది]
438
00:33:02,357 --> 00:33:04,651
[మర్డర్ బాట్] ఇదే ఈ మర్డర్ బాట్ ఆఖరి సందేశం.
439
00:33:58,413 --> 00:34:00,415
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్
439
00:34:01,305 --> 00:35:01,789