"Foundation" Shadows in the Math

ID13192178
Movie Name"Foundation" Shadows in the Math
Release Name Foundation.S03E02.1080p.WEB.h264-ETHEL[tel]
Year2025
Kindtv
LanguageTelugu
IMDB ID32429238
Formatsrt
Download ZIP
1 00:00:06,000 --> 00:00:12,074 Do you want subtitles for any video? -=[ ai.OpenSubtitles.com ]=- 2 00:01:07,693 --> 00:01:09,570 ఐజాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది 3 00:02:40,786 --> 00:02:44,081 మేలుకోండి, స్లీపర్. మొదటి స్పీకర్ అయిన నేను, మీకు స్వాగతం పలుకుతున్నాను. 4 00:02:44,831 --> 00:02:46,083 థాలిస్. 5 00:02:46,166 --> 00:02:49,711 మీరు ఒక ఏడాది నిద్రావస్థలో ఉన్నారు. అంతా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. 6 00:02:57,219 --> 00:02:58,804 మేలుకోండి, హారి సెల్డన్. 7 00:03:07,813 --> 00:03:10,482 ద్వితీయ ఫౌండేషన్ మీకు స్వాగతం పలుకుతోంది. 8 00:03:19,199 --> 00:03:20,242 151 ఏళ్ల క్రితం 9 00:03:20,325 --> 00:03:22,870 హారి, నేను కలిసి ఎట్టకేలకు ఇగ్నిస్ లో ద్వితీయ ఫౌండేషన్ ని నెలకొల్పాం. 10 00:03:22,953 --> 00:03:24,830 కానీ నిద్రావస్థలో ఉంటున్నాం కాబట్టి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 11 00:03:26,456 --> 00:03:31,003 ప్లాన్ అప్పటికీ గతి తప్పే ఉంది. దాన్ని గాడిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 12 00:03:32,004 --> 00:03:34,673 ప్రతి ఏడాది, కొన్ని వారాలు తప్ప మిగతా సమయమంతా నిద్రావస్థలోనే ఉంటాం. 13 00:03:35,257 --> 00:03:37,259 మేలుకోండి, స్లీపర్. మరొక ఏడాది గడిచిపోయింది. 14 00:03:37,342 --> 00:03:41,597 మేము మేల్కొన్నప్పుడు, హారి మెంటాలిక్స్ కి సైకో హిస్టరీ గురించి నేర్పేవాడు. 15 00:03:41,680 --> 00:03:44,308 మూకుమ్మడి చర్యల ద్వారా సంఘటనలను ప్రభావితం చేయడం. 16 00:03:44,391 --> 00:03:49,563 చరిత్ర రూపురేఖలను మార్చడం అనేది సైకో హిస్టరీ అసలైన శక్తి అని చెప్పవచ్చు. 17 00:03:49,646 --> 00:03:53,066 నేనేమో, మ్యూల్ ని ఎదుర్కోవడానికి వాళ్ళు తమ శక్తులను ఎలా ఉపయోగించాలో నేర్పేదాన్ని. 18 00:03:56,361 --> 00:03:59,406 ఏళ్ళు గడిచే కొద్దీ మేము టెల్లెం ముద్దుబిడ్డల స్థాయి నుండి 19 00:03:59,489 --> 00:04:01,742 కాలక్రమేణా అరివీర భయంకర యోధుల స్థాయికి ఎదిగిపోయాం. 20 00:04:01,825 --> 00:04:03,744 వద్దు. తల వంచి నమస్కారాలు గట్రా చేయనక్కర్లేదు. 21 00:04:03,827 --> 00:04:06,288 మనం మతపరమైన దశను దాటేశాం. 22 00:04:06,371 --> 00:04:07,873 మా పరిధిని విస్తరించుకున్నాం, 23 00:04:07,956 --> 00:04:11,376 మా లాంటి మెంటాలిక్స్ ని మరింత మందిని వెతికి, మాలో భాగం చేసుకున్నాం. 24 00:04:12,586 --> 00:04:16,173 త్వరలోనే, గెలాక్సీలోని ప్రతీ భాగానికి మా పరిధిని విస్తరింపజేసుకున్నాం. 25 00:04:16,255 --> 00:04:19,718 రహస్య కార్యకలాపాలు చేస్తూ, తొలి ఫౌండేషన్ ని బలోపేతం చేయడానికి కృషి చేశాం, 26 00:04:19,801 --> 00:04:23,722 అదే సమయంలో, ప్లాన్ ప్రారంభంలో జరగాల్సిన విధంగానే ఎంపైర్ బలహీనమయ్యేలా పని చేశాము. 27 00:04:25,057 --> 00:04:27,726 కానీ కాలం గడిచే కొద్దీ, 28 00:04:27,809 --> 00:04:31,063 మా చేతిలో లేని ఒక అంశం మాకు ఒక సవాలుగా మారింది. 29 00:04:33,023 --> 00:04:34,107 ఆ అంశమే, కాలం. 30 00:04:52,668 --> 00:04:54,378 అయినా కానీ, మనం సమయానికి సిద్ధంగా ఉండలేం. 31 00:04:56,088 --> 00:04:58,090 మ్యూల్ ఇంకో 50 ఏళ్లకు కానీ రాడు. 32 00:04:58,173 --> 00:04:59,842 నేను భయపడేది అతని గురించి కాదు. 33 00:05:01,677 --> 00:05:04,388 మొదట్నుంచీ మూడవ విపత్తే అత్యంత కీలకమైంది. 34 00:05:04,471 --> 00:05:09,059 సరైన సమయానికి, అన్నీ సరైన విధంగా ఉండాలి, 35 00:05:09,142 --> 00:05:12,479 లేదంటే, మనం మ్యూల్ ని ఓడించినా, దాని తర్వాత వచ్చే దాన్ని ఎదుర్కోలేం. 36 00:05:12,563 --> 00:05:13,647 అయితే, స్పెషలైజేషన్ ని అనుసరిద్దాం. 37 00:05:13,730 --> 00:05:16,275 మెంటాలిక్స్ అందరికీ సైకో హిస్టరీ అంతటినీ నేర్పించకుండా, 38 00:05:16,358 --> 00:05:18,151 ఒక్కొక్కొరికీ ఒక్కో భాగాన్ని నేర్పిద్దాం. 39 00:05:18,235 --> 00:05:19,236 అది మంచి ఆలోచనే. 40 00:05:20,112 --> 00:05:23,407 అయినా కానీ, మన రిగ్రెషన్ మోడళ్లను మనం నిత్యం అప్ డేట్ చేసుకుంటూనే ఉండాలి. 41 00:05:24,116 --> 00:05:25,659 అలాగే మన సామాజిక విధానాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి, 42 00:05:25,742 --> 00:05:28,245 అప్పుడే మనం సరైన వర్గాలపై ప్రభావం చూపుతున్నామా లేదా అనేది మనకి తెలుస్తుంది. 43 00:05:28,912 --> 00:05:30,414 మనం కావాల్సినంత వేగంగా సమాచారాన్ని తెలుసుకోలేకపోతున్నాం. 44 00:05:35,002 --> 00:05:36,253 మనం మేల్కొనే ఉండాలి. 45 00:05:38,255 --> 00:05:40,716 మనలో ఒకరు మేల్కొనే ఉండాలి. 46 00:05:41,425 --> 00:05:42,426 హారి. 47 00:05:44,887 --> 00:05:46,680 మ్యూల్ తో పోరాడాల్సింది నువ్వే. 48 00:05:46,763 --> 00:05:49,099 దానికి మనం సిద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. 49 00:05:49,766 --> 00:05:51,476 హారి. అబ్బా. 50 00:05:53,312 --> 00:05:55,147 అలా జరగాలంటే ఒకే ఒక్క దారి ఉంది. 51 00:06:08,785 --> 00:06:10,412 మళ్ళీ ఒక ఏడాది తర్వాత కలుద్దాం. 52 00:06:44,696 --> 00:06:46,782 నాలుగేళ్ల క్రితం 53 00:06:56,875 --> 00:06:58,293 సుస్వాగతం, గాల్. 54 00:06:59,044 --> 00:07:00,087 థాలిస్ ఎక్కడ? 55 00:07:01,630 --> 00:07:06,844 థాలిస్ చనిపోయి చాలా కాలమే అయింది. ఇప్పుడు ఇతనే మొదటి స్పీకర్. 56 00:07:06,927 --> 00:07:08,720 ఇతని పేరు ప్రీమ్ పాల్వర్. 57 00:07:14,101 --> 00:07:16,186 హారి ఎక్కడ? ఎన్నేళ్లయింది? 58 00:07:21,066 --> 00:07:23,318 మీరు చివరిసారి మేల్కొన్నాక… 59 00:07:25,404 --> 00:07:27,531 148 ఏళ్లయింది. 60 00:07:42,629 --> 00:07:43,881 హారి? 61 00:07:48,051 --> 00:07:49,052 గాల్. 62 00:07:50,762 --> 00:07:53,515 అంతేలే. 63 00:07:53,599 --> 00:07:54,600 అంతేలే. 64 00:07:54,683 --> 00:07:56,143 నన్ను ముందే ఎందుకు లేపలేదు? 65 00:07:58,228 --> 00:08:02,065 మాకు ఎక్కువ సమయం కావాల్సి వచ్చింది. నా సమయం కన్నా, నీ సమయం చాలా విలువైనది కదా. 66 00:08:02,149 --> 00:08:03,859 నేను సాయపడి ఉండే దాన్ని. 67 00:08:04,359 --> 00:08:07,196 కొంత కాలం పాటు, మనిద్దరం వంతులవారీగా నిద్రావస్థలోకి వెళ్ళేవాళ్ళం కదా. 68 00:08:07,279 --> 00:08:08,655 ఏదోక దారిని కనుగొనేవాళ్ళం కదా… 69 00:08:10,824 --> 00:08:12,409 నువ్వెప్పుడూ నాపై కోప్పడుతూనే ఉంటావు. 70 00:08:13,827 --> 00:08:16,580 నువ్వు చేసే పనులు అలా ఉంటాయి మరి. 71 00:08:21,001 --> 00:08:22,002 మ్యూల్ సంగతేంటి? 72 00:08:22,586 --> 00:08:24,421 అప్పుడే రాడులే. కానీ ఎంతో సమయం లేదు. 73 00:08:25,047 --> 00:08:26,131 కానీ… 74 00:08:27,257 --> 00:08:30,677 మూడవ విపత్తు ముంచుకొచ్చేస్తోంది. 75 00:08:31,345 --> 00:08:32,346 ఇలా రా. 76 00:08:35,390 --> 00:08:36,390 ఇవన్నీ ఏంటి? 77 00:08:38,143 --> 00:08:39,311 వాటిని నేనే చెక్కా. 78 00:08:42,523 --> 00:08:46,652 శాల్వార్, యానా, రేయిచ్. 79 00:08:46,735 --> 00:08:49,571 ఇప్పుడు, నాకు ఇలాంటివి చూస్తుంటేనే గతం గుర్తొస్తోంది. 80 00:08:50,739 --> 00:08:53,700 నా జ్ఞాపక శక్తి మందగించింది. 81 00:08:54,243 --> 00:08:55,911 కానీ వీళ్లపై నాకు ఉన్న మమకారం కారణంగా మర్చిపోలేను. 82 00:08:58,664 --> 00:09:00,040 వెళదాం రా. 83 00:09:00,666 --> 00:09:02,292 నీకొకటి చూపించాలి. 84 00:09:09,883 --> 00:09:13,887 నా ప్లాన్ ని సరిగ్గా అమలు చేస్తే, చీకటి యుగాన్ని తగ్గించవచ్చని 85 00:09:13,971 --> 00:09:16,849 చాలా కాలం నమ్మాను. 86 00:09:19,685 --> 00:09:22,521 నా ప్లాన్ ప్రకారం ద్వితీయ ఫౌండేషన్ లో నువ్వు ఉండకూడదు. 87 00:09:22,604 --> 00:09:26,066 నువ్వు ఎన్నో శతాబ్దాల క్రితమే చనిపోయి ఉండాలి. అయినా కానీ ఇప్పుడు ప్రాణాలతోనే ఉన్నావు. 88 00:09:28,443 --> 00:09:30,988 ప్లాన్ గతి తప్పేలా చేశావు, 89 00:09:31,071 --> 00:09:33,699 అయినా, ఎలాగోలా మళ్ళీ అంతా గాడిలోకి వచ్చేలా చేశావు. 90 00:09:35,367 --> 00:09:38,412 ఇదంతా కాకతాళీయంగా జరిగింది కాదు. 91 00:09:39,079 --> 00:09:42,708 ఇక్కడేదో జరుగుతోంది. అది… అదేంటో నేను చెప్పలేకపోతున్నా. 92 00:09:45,127 --> 00:09:47,337 కానీ దానికి కేంద్ర భాగం నువ్వే అని మాత్రం నాకు తెలుసు. 93 00:09:51,383 --> 00:09:55,804 భవిష్యత్తులో నా అవసరం నీకు ఉండదు, నువ్వు ఒక్క దానివే చూసుకోగలవు. 94 00:09:57,264 --> 00:09:59,016 నువ్వు చనిపోతానంటే నేను ఒప్పుకోను. 95 00:10:00,726 --> 00:10:02,394 అయితే, సంస్మరణ సభని పెట్టమని ప్రీమ్ కి చెప్తాలే. 96 00:10:02,477 --> 00:10:03,854 హారి. 97 00:10:04,438 --> 00:10:07,107 అతను నీకు నచ్చుతాడులే. ఇప్పుడు విషయానికి వద్దాం… 98 00:10:30,047 --> 00:10:33,717 అష్ట విపత్తుల గురించి నాకు తెలిసిందంతా ఇదే. 99 00:10:34,593 --> 00:10:39,556 ముడి డేటా, నా ఆలోచనలు, రహస్యాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. 100 00:10:39,640 --> 00:10:43,644 కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది ఇది. 101 00:10:44,645 --> 00:10:45,896 ఇన్విక్టస్. 102 00:10:46,730 --> 00:10:49,233 మ్యూల్ ని ఓడిస్తే, 103 00:10:49,816 --> 00:10:52,319 ఈ పరిస్థితి ఎదురవుతుంది. 104 00:11:01,078 --> 00:11:02,204 రేపు కలుద్దాం. 105 00:11:05,874 --> 00:11:07,292 అలసిపోయా. 106 00:11:08,752 --> 00:11:09,920 - రేపు కలుద్దాం. - హా. 107 00:11:10,003 --> 00:11:11,046 - సరే. - హా. 108 00:11:14,341 --> 00:11:15,551 జాగ్రత్త. 109 00:11:40,242 --> 00:11:41,577 తనకి అబద్ధం చెప్పావు. 110 00:11:47,749 --> 00:11:50,294 తన కళ్ళలోకి చూసి, నేను చనిపోతున్నానని చెప్పలేకపోయా. 111 00:11:53,297 --> 00:11:54,590 ఇదే మంచిది. 112 00:11:54,673 --> 00:11:56,425 నేనే గాల్ స్థానంలో ఉండుంటే, ఇది సరైనది కాదని చెప్పి ఉండేదాన్ని. 113 00:12:06,977 --> 00:12:08,478 ఈ పని పక్కాగా చేయాలనుకుంటున్నావా? 114 00:12:09,730 --> 00:12:11,648 ఇక్కడే కను మూస్తే, అన్నీ లాంఛనాలు ఘనంగా చేస్తారు. 115 00:12:15,110 --> 00:12:16,945 నన్ను ఊనాస్ వరల్డ్ కి తీసుకుపో. 116 00:12:18,947 --> 00:12:20,949 నాకు మరో వరం ప్రసాదించు. 117 00:12:22,159 --> 00:12:23,911 ఈ దేహం అందించి, నీకు వరం ఇచ్చా. 118 00:12:25,245 --> 00:12:27,414 దీన్ని నువ్వు పూర్తిగా వినియోగించుకున్నావు. 119 00:12:34,922 --> 00:12:36,173 అయితే, పక్కాగానే చేయాలనుకుంటున్నా. 120 00:12:48,602 --> 00:12:53,440 స్పేసర్స్ ఎవరూ లేరు. విస్పర్ డ్రైవ్ లేదు. 121 00:12:53,524 --> 00:12:54,858 జంప్ గేట్ లేదు. 122 00:12:55,526 --> 00:12:56,527 మరెలా? 123 00:12:58,445 --> 00:13:00,739 నాతో రా. చూపిస్తా. 124 00:13:05,035 --> 00:13:09,623 నేను… నేను నేరుగా పాల్గొనాలని ఎవరో గట్టిగా అనుకున్నారని శాల్వార్ అంది. ఎందుకు? 125 00:13:10,374 --> 00:13:12,125 ఎందుకంటే, అది మన వల్ల కాదు కదా. 126 00:13:34,439 --> 00:13:35,440 హారి? 127 00:14:10,934 --> 00:14:11,935 అతను లేడు. 128 00:14:14,396 --> 00:14:15,689 తుది వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. 129 00:14:15,772 --> 00:14:17,649 కానీ అతను వెళ్లిపోవడం నాకు తెలిసింది. 130 00:14:24,072 --> 00:14:27,534 నాకు మూగ భాష రాదు, కానీ మీ వేదనని అర్థం చేసుకోగలను. 131 00:14:34,541 --> 00:14:38,337 హారి లేడు, అతనికి ఒక విగ్రహం చేయాలనుకుంటున్నా. 132 00:14:39,087 --> 00:14:41,965 అతను కొన్ని విగ్రహాలు చేశాడు కదా, అలాంటిదే. 133 00:14:54,895 --> 00:14:57,981 అతను తన విగ్రహాన్ని చెక్కేసుకున్నాడు, కదా? 134 00:15:06,114 --> 00:15:07,699 చెక్కుకోకుండా ఎలా ఉంటాడులే! 135 00:15:09,868 --> 00:15:12,162 హారి, తన విగ్రహాన్ని చెక్కుకొని చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నాడు. 136 00:15:12,246 --> 00:15:14,748 మాకు ఒక బాట పరిచాడు. 137 00:15:14,831 --> 00:15:17,209 ఆ బాటలో మేమందరం కలిసి ప్రయాణించసాగాం. 138 00:15:17,292 --> 00:15:20,420 నేను ప్రీమ్ మూగ భాషను నేర్చుకున్నా, ప్లాన్ మళ్ళీ గాడిలో పడింది, 139 00:15:21,129 --> 00:15:23,131 కానీ పోరు అనేది కేవలం ఆరంభం మాత్రమే. 140 00:15:27,678 --> 00:15:30,889 ద్వితీయ ఫౌండేషన్ ఎక్కడ? 141 00:15:35,561 --> 00:15:38,438 మ్యూల్ వచ్చేశాడు. మనకు ఎక్కువ సమయం లేదు. 142 00:15:38,522 --> 00:15:40,899 ప్రస్తుతం 143 00:15:44,945 --> 00:15:47,489 నూట యాభై రెండేళ్ల క్రితం, 144 00:15:47,573 --> 00:15:51,243 ద్వితీయ ఫౌండేషన్ లేకపోతే, 145 00:15:51,326 --> 00:15:54,538 సెల్డన్ ప్లాన్ ప్రకారం ఏదీ జరగదని మీరు గమనించారు. 146 00:15:54,621 --> 00:15:58,500 మనం మళ్ళీ ప్లాన్ ని గాడిలోకి తెచ్చాం. 147 00:16:00,002 --> 00:16:05,632 మూడవ విపత్తు సరిగ్గా అనుకున్న సమయానికే వస్తోంది. 148 00:16:07,759 --> 00:16:11,513 కానీ కాల్గన్ లో ఏదో జరుగుతోంది. 149 00:16:11,597 --> 00:16:15,309 మ్యూల్ దాన్ని హస్తగతం చేసుకోగానే, 150 00:16:15,392 --> 00:16:18,270 రేడియంట్ ఇది చూపించడం మొదలుపెట్టింది… 151 00:16:34,494 --> 00:16:37,247 ట్రాంటార్ 152 00:16:57,559 --> 00:17:01,647 మరీ దారుణంగా అయ్యే అవకాశం ఉన్నప్పుడు, మెరుగుపరిచే అవకాశం కూడా ఉంటుంది కదా. 153 00:17:05,317 --> 00:17:06,318 దాన్ని సరి చేసేయండి. 154 00:17:07,069 --> 00:17:08,569 సరి చేయడం సాధ్యం కాదు. 155 00:17:09,863 --> 00:17:11,740 సైకో హిస్టరీ వల్ల అయితే సాధ్యం కాదు మరి. 156 00:17:12,950 --> 00:17:14,409 ఇది తప్పు అయ్యి ఉండే అవకాశం లేదా? 157 00:17:15,618 --> 00:17:18,539 ఈమధ్య ఇది ఊహించిన దాని ప్రకారం పెద్దగా జరగడం లేదని అన్నావు కదా. 158 00:17:19,164 --> 00:17:21,666 అది తెలియని ఇతర కారణాల వల్ల అయి ఉంటుంది. 159 00:17:21,750 --> 00:17:24,877 కొన్నేళ్ల నుండి ఈ లెక్కలపై ఏదో గట్టి ప్రభావమే చూపుతోంది. 160 00:17:25,420 --> 00:17:27,881 కాల్గన్ అయి ఉంటుంది. అది ఇప్పుడు వేరేవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కదా. 161 00:17:28,674 --> 00:17:30,884 దాని వల్లనే ఇది ఇలా చూపుతుందేమో? 162 00:17:30,968 --> 00:17:33,929 మనం శూన్యం వైపు అడుగులేస్తున్నామని నాకు మొదట్నుంచీ అనిపించేది. 163 00:17:34,012 --> 00:17:36,390 శూన్యంలోకి స్వాగతం, మిత్రులారా. 164 00:17:46,900 --> 00:17:52,072 ఒక శతాబ్దం నుండి ఈ బొమ్మ, ఆ బొమ్మ చెప్పినట్టు ఆడుతోంది. 165 00:17:52,906 --> 00:17:55,075 అది చెప్పినదాని ప్రకారం మనం తైతక్కలాడుతున్నాం, 166 00:17:55,158 --> 00:17:58,412 ఏమన్నా అంటే, మన భవిష్యత్తు కోసమే ఇదంతా అంటోంది. 167 00:18:00,163 --> 00:18:02,207 మన కష్టం ఫలించిందబ్బా, 168 00:18:05,210 --> 00:18:07,212 మన బతుకు బస్టాండే. 169 00:18:09,965 --> 00:18:13,135 నా అవసరమేమైనా ఉంటే, నా అవసరం లేకుండా కానిచ్చేలా చూసుకోండి. 170 00:18:23,687 --> 00:18:25,731 అది నేననుకున్న దాని కన్నా ఖాళీగా ఉందే. 171 00:18:30,319 --> 00:18:31,653 మళ్ళీ చర్చించుకుందాం. 172 00:18:31,737 --> 00:18:34,239 ప్రస్తుతానికి, ఈ విషయం మూడో కంటికి తెలియనివ్వకుండా ఉంచుదాం. 173 00:18:34,323 --> 00:18:35,699 ఎవరికీ తెలీకూడదు. 174 00:18:38,869 --> 00:18:42,873 డెమెర్జల్. ఈ క్షణంలో… 175 00:18:44,208 --> 00:18:46,793 నీలా ఉండటం ఎలా ఉంటుందో నాకు అర్థమవుతోంది. 176 00:18:48,045 --> 00:18:49,046 మహారాజా? 177 00:18:49,129 --> 00:18:55,219 నేను కష్టపడ్డాను, రాజీపడ్డాను, మధ్యేమార్గంలో పయనించడం మంచిదని అనుకున్నా. 178 00:18:55,302 --> 00:18:56,845 ఇన్ని చేసి కూడా, ఇప్పుడు లాభం ఏంటి! 179 00:18:59,723 --> 00:19:04,144 కాబట్టి, నా రవ్వంత అర్థం పర్థం లేని జీవితంలోనే నేను ఇంత నిరాశను మూటగట్టుకుంటున్నానంటే, 180 00:19:04,228 --> 00:19:09,233 సుదీర్ఘంగా సాగే నీ అర్థం పర్థం లేని జీవితంలో నువ్వు ఎంత నిరాశను మూటగట్టుకుని ఉంటావో. 181 00:19:10,817 --> 00:19:13,028 బహుశా మా ముగింపే నీకు కావాలేమో. 182 00:19:13,111 --> 00:19:16,990 నువ్వు చూసుకోవడానికి ఈ జన్యు ఆధారిత వంశం లేకపోతే, 183 00:19:17,074 --> 00:19:20,619 అప్పుడు నువ్వు మామూలు అమ్మాయివే కదా, 184 00:19:21,245 --> 00:19:23,497 నీకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. 185 00:19:29,545 --> 00:19:32,756 నాకు చాలా పనులున్నాయి, మహారాజా. 186 00:19:34,925 --> 00:19:38,595 ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను దూరం చేసుకోవడం మంచి పని కాదు, డెమెర్జల్. 187 00:19:39,179 --> 00:19:40,848 ముంచుకొచ్చేది ఎంత విధ్వంసమైనా కానీ, 188 00:19:41,723 --> 00:19:47,020 దాన్ని ఎదుర్కొనేటప్పుడు నేను కూడా మీ అందరితో ఉంటే, అందరికీ మంచిదే. 189 00:19:49,314 --> 00:19:52,568 ఈ పరిస్థితుల్లో, పది రోజుల్లో నిజంగానే నాకు శుభం కార్డ్ వేస్తావా? 190 00:19:56,947 --> 00:19:57,948 దయచేసి ఆ పని చేయవద్దు. 191 00:20:02,411 --> 00:20:05,122 ఇందులో నాకేదో ప్రమేయం ఉన్నట్టు మీరు నన్ను అడుగుతున్నారు. 192 00:20:06,790 --> 00:20:10,085 కానీ నాకు ఎన్ని విధులున్నా, నేను ఒక గడియారంలా పని చేయాల్సిందే. 193 00:20:11,545 --> 00:20:16,800 క్లియాన్ జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో తెలిపే గడియారాన్ని నేను. అన్నీ ఆ గడియారం ప్రకారమే జరగాలి. 194 00:20:23,015 --> 00:20:26,101 కాల్గన్ 195 00:20:56,757 --> 00:20:59,051 నా పేరు మ్యూల్. 196 00:21:01,011 --> 00:21:03,805 బయట ఉన్న నా షిప్ పేరు, బ్లాక్ టంగ్. 197 00:21:05,307 --> 00:21:06,391 నాకు తెలుసు. 198 00:21:08,393 --> 00:21:09,728 మేము విలన్లలా కనిపిస్తామని. 199 00:21:11,980 --> 00:21:13,315 కానీ చెప్తున్నా కదా, 200 00:21:15,275 --> 00:21:16,777 చివరి క్షణాల్లో మీ ప్రభువు ఎలా అయితే, 201 00:21:17,736 --> 00:21:21,657 నా మీద ప్రేమ కురిపించాడో, మీరు కూడా అలాగే నాపై ప్రేమ కురిపిస్తారు. 202 00:21:23,408 --> 00:21:25,619 ఆ పాప ఏది? 203 00:21:27,120 --> 00:21:28,413 ఎక్కడ ఉంది? 204 00:21:32,918 --> 00:21:33,919 నీ పేరేంటి? 205 00:21:34,002 --> 00:21:35,337 స్కర్లెట్, సర్. 206 00:21:35,420 --> 00:21:38,507 ఆ పేరు మా నాన్న పెట్టారు. అది కాల్గనీస్ భాషలో ఉంది. 207 00:21:39,216 --> 00:21:40,509 అంటే "బంగారు బొమ్మ" అని అర్థం. 208 00:21:41,093 --> 00:21:42,719 పేరు చాలా బాగుంది. 209 00:21:43,637 --> 00:21:45,973 దయచేసి ఇంకెప్పుడూ "సర్" అని పిలవవద్దు. 210 00:21:46,056 --> 00:21:47,683 మ్యూల్ అని పిలిస్తే చాలు. 211 00:21:49,017 --> 00:21:51,144 మరి, స్కర్లెట్… 212 00:21:53,730 --> 00:21:54,731 నీకు నేనంటే ఇష్టమా? 213 00:21:56,191 --> 00:21:57,401 ప్రాణం కన్నా ఎక్కువ. 214 00:22:00,195 --> 00:22:02,614 ప్రాణం కన్నా ఎక్కువ. 215 00:22:06,618 --> 00:22:10,747 మీరు వినే ఉంటారు, నేను జనాలను నావైపుకు తిప్పుకోగలను. 216 00:22:12,541 --> 00:22:13,959 వారి ప్రేమని పొందగలను. 217 00:22:15,210 --> 00:22:20,966 కానీ, అలా చేయడం సులభమేం కాదు. నేను కాస్త క్రమశిక్షణగా ఉండాల్సి ఉంటుందంతే. 218 00:22:21,967 --> 00:22:25,721 అదృష్టవశాత్తూ, నేను అందరినీ మార్చాల్సిన పని లేదనే విషయాన్ని తెలుసుకున్నాను. 219 00:22:26,805 --> 00:22:30,225 కొందరికి ఒక ఉదాహరణ చూపి మార్చగలను. 220 00:22:31,351 --> 00:22:33,562 ఈ మార్పులను చూసే వారందరూ, 221 00:22:33,645 --> 00:22:37,191 నాకు… తేలిగ్గా భక్తులు అయిపోతారు. 222 00:22:38,233 --> 00:22:41,528 కాబట్టి, స్కర్లెట్. 223 00:22:42,738 --> 00:22:45,532 మార్పు ఎలా జరుగుతుందో వీళ్ళకి చూపిస్తావా? 224 00:22:46,033 --> 00:22:47,659 మహదానందంగా 225 00:22:47,743 --> 00:22:48,952 అదీ లెక్క. 226 00:22:49,703 --> 00:22:50,704 ఇలా రా. 227 00:22:54,458 --> 00:22:55,459 కూర్చో. 228 00:23:12,142 --> 00:23:13,143 ఇదేంటో తెలుసా నీకు? 229 00:23:13,769 --> 00:23:14,811 ఇది మా నాన్న తుపాకీ. 230 00:23:14,895 --> 00:23:16,480 దీనితో ఎప్పుడైనా ఆడుకోనిచ్చాడా నిన్ను? 231 00:23:16,563 --> 00:23:18,732 లేదు. ఇది చాలా ప్రమాదకరమని చెప్పాడు. 232 00:23:18,815 --> 00:23:19,942 ఆయన చెప్పింది నిజమే. 233 00:23:20,025 --> 00:23:24,655 దాన్ని ఇతరులపైకి కానీ, నీపైకి కానీ అస్సలు ఎక్కుపెట్టకూడదు. 234 00:23:26,573 --> 00:23:28,951 కానీ మార్పులో అద్భుతమైన విషయం ఏంటో చెప్పనా! 235 00:23:29,034 --> 00:23:33,705 ఒకసారి నేను మీ బుర్రలోకి ప్రవేశించాక, నాకు నచ్చినట్టు మిమ్మల్ని ఆడించగలను. 236 00:23:34,831 --> 00:23:38,377 ఒక్కసారి మీ బుర్రని కాస్తంత కదిపితే చాలు, 237 00:23:38,460 --> 00:23:43,048 ఇక మీకు ఇష్టం లేకపోయినా, నాకు నచ్చింది చేసేయడానికి… 238 00:23:44,716 --> 00:23:45,843 తహతహలాడిపోతారు. 239 00:23:48,762 --> 00:23:51,598 ఏం పర్వాలేదు, బంగారు బొమ్మా. 240 00:23:53,767 --> 00:23:54,768 దాన్ని ఎత్తు. 241 00:23:58,647 --> 00:23:59,648 బరువుగా ఉంది. 242 00:23:59,731 --> 00:24:00,774 అయ్యయ్యో. 243 00:24:02,734 --> 00:24:04,319 తలకి ఎక్కుపెట్టుకోలేనంత బరువుగా ఉందా? 244 00:24:14,079 --> 00:24:15,497 పాప కూడా… 245 00:24:17,749 --> 00:24:19,042 తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తోంది. 246 00:24:19,877 --> 00:24:21,962 ట్రిగ్గర్ నొక్కుతావా, స్కర్లెట్? 247 00:24:22,462 --> 00:24:23,922 మహదానందంగా. 248 00:24:24,006 --> 00:24:26,550 మహదానందంగా! 249 00:24:28,260 --> 00:24:29,845 ఒకటి నుండి మూడు లెక్కపెడతా మరి. 250 00:24:33,098 --> 00:24:34,099 ఒకటి. 251 00:24:37,019 --> 00:24:38,020 రెండు. 252 00:24:39,730 --> 00:24:40,731 మూడు. 253 00:24:49,198 --> 00:24:50,782 నాకు హృదయం లేదని అనుకున్నారా? 254 00:24:56,663 --> 00:24:57,998 ఇందుకే మార్పు అద్భుతమైనదని అంటాను. 255 00:25:06,590 --> 00:25:09,510 అది ఇచ్చేయ్, స్కర్లెట్. ఇచ్చేయ్. 256 00:25:12,179 --> 00:25:14,681 ఇంకెప్పుడైనా కాల్చుకుందువులే. ఒట్టేసి చెప్తున్నా, ఆ అవకాశం ఇస్తా. 257 00:25:16,266 --> 00:25:17,518 ఒట్టేసి చెప్తున్నా. 258 00:25:21,438 --> 00:25:22,439 ఇక తిను. 259 00:25:31,740 --> 00:25:33,242 మీరందరూ నన్ను ప్రేమిస్తారు. 260 00:25:37,037 --> 00:25:38,789 కొంత కాలానికే… 261 00:25:42,543 --> 00:25:44,336 గెలాక్సీ అంతా కూడా నన్ను ప్రేమిస్తుంది. 262 00:25:48,090 --> 00:25:49,758 క్లావిజర్ బరాక్స్ 263 00:25:49,842 --> 00:25:52,344 నా దగ్గర నాణేలెవీ లేవు, కానీ… 264 00:25:55,138 --> 00:25:56,223 అది న్యాయమైనది కాదు. 265 00:25:56,306 --> 00:25:57,558 హేయ్, నీకు కూడా ఇంటికి వెళ్లి, 266 00:25:57,641 --> 00:26:01,395 మీ ఇంట్లో ఉండే పాత విలువైన వస్తువు తేవాలనుంటే, ఉదాహరణకు చక్కెర డబ్బాని, 267 00:26:01,478 --> 00:26:02,688 హ్యాపీగా తెచ్చేసేయ్. 268 00:26:02,771 --> 00:26:05,524 మీ వారసత్వ సంపదని పందెంగా పెట్టి ఆడుతున్నారని డెమెర్జల్ కి తెలుసా? 269 00:26:06,441 --> 00:26:07,985 ఏమవుతుందో చూద్దాం. 270 00:26:15,409 --> 00:26:18,412 మా మధ్యతరగతి కుటుంబానికి మీ చక్కెర డబ్బా దక్కుతుందంటారా? 271 00:26:18,495 --> 00:26:20,163 దక్కించుకోవడం అంత తేలిక కాదమ్మా. 272 00:26:28,839 --> 00:26:30,257 ఇప్పుడు దక్కించేసుకున్నావుగా. 273 00:26:30,340 --> 00:26:31,967 కానిద్దాం. దీన్ని ముందు లోపల వేసేసుకుందాం. 274 00:26:32,050 --> 00:26:33,635 కోటలో ధగధగలాడిపోయేవి చాలా ఉన్నాయి. 275 00:26:55,449 --> 00:26:56,742 స్పోర్స్. 276 00:26:58,327 --> 00:26:59,411 ఒకసారి పీల్చి చూడు. 277 00:27:00,370 --> 00:27:01,455 పర్వాలేదులే. 278 00:27:01,538 --> 00:27:04,750 మంచోడివి. ఇది తీసుకుంటే ప్రాణాలు పోతాయి. 279 00:27:07,586 --> 00:27:09,046 సిగ్నెట్ అయితే దీనితో ఆడుకుంటుంది. 280 00:27:09,880 --> 00:27:11,215 ఇవాళ డాక్టర్ ని మళ్ళీ కలిశాం. 281 00:27:12,216 --> 00:27:13,634 పెద్ద మార్పేమీ లేదు, కానీ… 282 00:27:15,344 --> 00:27:18,180 చెప్తున్నా కదా, ఉన్నన్నాళ్లూ హాయిగా, ఏ చీకూ చింతా లేకుండా బతకాలని 283 00:27:18,263 --> 00:27:20,599 తను కృతనిశ్చయంతో ఉంది. 284 00:27:20,682 --> 00:27:23,310 - నేను కూడా ఏమీ చేయలేకపోతున్నా… - తెలుసు. 285 00:27:29,066 --> 00:27:30,984 కొత్త వేకువ రాజును పుట్టిస్తున్నారు. 286 00:27:32,110 --> 00:27:33,654 ఆ పని అయిపోవచ్చేసింది కూడా. 287 00:27:34,821 --> 00:27:36,114 అప్పుడే పుట్టినవాళ్ళు ముచ్చటగా ఉంటారు. 288 00:27:38,283 --> 00:27:39,284 మీకు అతను నచ్చుతాడులే. 289 00:27:39,368 --> 00:27:43,664 అంతే అంటావా? ఎగిరెగిరి తంతానో, మామూలుగా తంతానో చూద్దాం. 290 00:27:45,624 --> 00:27:47,626 భలేవారే. అతనంటే మీరే కదా. 291 00:27:48,293 --> 00:27:49,795 మిమ్మల్ని మీరు ప్రేమించుకోరా ఏంటి! 292 00:27:49,878 --> 00:27:50,879 అంటే… 293 00:27:53,674 --> 00:27:55,008 కానివ్వండి. ఆడుకోండి. 294 00:27:55,676 --> 00:27:57,886 కానీ నా వస్తువులని దొంగిలించకండి. 295 00:27:57,970 --> 00:28:00,639 మీ అందరినీ ముక్కలుముక్కలు చేయించగలను. 296 00:28:02,766 --> 00:28:08,063 మన విధిని మనం వదిలేసుకోవచ్చు, కానీ దాని నుండి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యమే. 297 00:28:09,940 --> 00:28:11,483 గెలాక్సీకి అవతలి వైపున, 298 00:28:11,567 --> 00:28:15,362 రెండవ విపత్తు సమయంలో, మహారాజు కవచాన్ని ఛేదించాక 299 00:28:15,445 --> 00:28:19,032 హోబర్ మాలో పేరు చరిత్రపుటల్లోకి ఎక్కేసింది. 300 00:28:22,744 --> 00:28:26,623 హోబర్ వంశస్థులు వ్యాపారుల కూటమిని ఏర్పాటు చేశారు. 301 00:28:28,208 --> 00:28:31,128 కానీ వారి వంశంలో అతి పిన్న వయస్కుడైన టోరన్ మాలో, 302 00:28:31,211 --> 00:28:33,297 వ్యాపారుల వైపు అస్సలు చూడాలనుకోవట్లేదు. 303 00:28:33,380 --> 00:28:34,798 అలాగే రానున్న విపత్తు వైపు కూడా. 304 00:28:38,218 --> 00:28:42,806 కానీ అందరినీ తన వైపు లాక్కునే ప్రత్యేకత మ్యూల్ కి ఉంది. 305 00:28:42,890 --> 00:28:44,391 అది ఎలాగైనా కానీ. 306 00:28:52,858 --> 00:28:53,859 బంగారం? 307 00:28:54,526 --> 00:28:56,695 ఆ దొంగ మాకు ఎండ తగలకుండా చేస్తున్నాడు. 308 00:29:00,741 --> 00:29:03,118 చెప్పండి, కొత్త భార్యాభర్తలారా. 309 00:29:03,202 --> 00:29:04,203 నవ వధూవరులని అనాలి. 310 00:29:04,786 --> 00:29:07,581 అంటే కొత్తగా పెళ్లయిందని అర్థం. ఇది పాత ఆచారంలే. 311 00:29:07,664 --> 00:29:08,916 మళ్ళీ దాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నాం. 312 00:29:08,999 --> 00:29:10,792 ఇది చూసి, మీకూ వెంటనే పెళ్లి చేసేసుకోవాలని అనిపించవచ్చు. 313 00:29:11,376 --> 00:29:12,878 తప్పకుండా. 314 00:29:13,587 --> 00:29:15,130 మీకేం కావాలి, మిస్టర్ మాలో? 315 00:29:15,839 --> 00:29:18,467 ఏ అంతరాయమూ ఎదురు కాకూడదని నా భార్య, నేను ఈ విల్లాని ఎంచుకున్నాం, 316 00:29:18,550 --> 00:29:22,971 కానీ హఠాత్తుగా, దురాక్రమణ చేసిన షిప్ నీడ మాకు ఎండ తగలనీయకుండా చేస్తోంది. 317 00:29:23,055 --> 00:29:24,640 క్షమించాలి. 318 00:29:26,141 --> 00:29:27,226 దాన్ని పక్కకు పంపించగలరా? 319 00:29:27,309 --> 00:29:31,980 మిస్టర్ మాలో, బ్లాక్ టంగ్ షిప్, మ్యూల్ ది. 320 00:29:32,481 --> 00:29:33,524 రాజకీయంగా అయన చేసే పనులు… 321 00:29:33,607 --> 00:29:35,359 - మాకు "దురాక్రమణ" నచ్చింది. - హా. 322 00:29:35,984 --> 00:29:40,322 అతని దురాక్రమణ వల్ల తప్పక అసౌకర్యాలు కలుగుతాయి. 323 00:29:42,282 --> 00:29:43,951 బహుశా మీరు… 324 00:29:44,034 --> 00:29:45,077 - ఏంటి? - ఏంటి? 325 00:29:45,744 --> 00:29:47,704 ఆ స్పేస్ షిప్పును జరపడం కన్నా, 326 00:29:47,788 --> 00:29:51,166 మీరు వేరే చోట కూర్చోవడమే సులభమేమో? 327 00:29:52,751 --> 00:29:56,547 టోరీ, ఇతను అపర మేధావి. 328 00:29:57,214 --> 00:29:59,633 కానీ, మీ మనుషులని కొందరిని పంపించి మాకు సాయపడమని చెప్తారా? 329 00:29:59,716 --> 00:30:02,553 ఈ టవల్ చాలా బరువుగా ఉంది, అందుకని. 330 00:30:10,519 --> 00:30:11,937 అర్థమైంది. కెమెరాలు ఉన్నాయని కదా. 331 00:30:12,479 --> 00:30:13,480 సూపర్. 332 00:30:13,564 --> 00:30:15,065 - మీరు అదరగొట్టేశారు. - నిజమే. 333 00:30:15,148 --> 00:30:16,275 అల్లుకుపోయినందుకు థ్యాంక్స్. 334 00:30:18,569 --> 00:30:21,029 ఇంటికి సుస్వాగతం. డ్రింక్స్ చేసి ఇవ్వమంటారా? 335 00:30:21,113 --> 00:30:22,573 తప్పకుండా, బంగారం. 336 00:30:24,074 --> 00:30:26,326 ఈ షిప్ కొత్త వాయిస్ నాకు నచ్చింది. 337 00:30:27,786 --> 00:30:30,581 తన గొంతులో తెగువ కనిపిస్తోంది. దానికి బంగారం అని పేరు పెడుతున్నా. 338 00:30:31,748 --> 00:30:34,168 బాగుంది. బంగారం అని అన్నప్పుడు ఎవరిని పిలుస్తున్నావని అనుకోవాలో! 339 00:30:35,335 --> 00:30:37,379 బీచ్ దగ్గర వీడియో చాలా బాగా వచ్చింది. 340 00:30:37,462 --> 00:30:40,215 కానీ దురాక్రమణ జరిగిన ప్రాంతం సూపర్ గా ఉంటుందంట. 341 00:30:40,299 --> 00:30:41,633 బాగానే ఉంటుంది, కానీ రిస్క్. 342 00:30:41,717 --> 00:30:43,135 మీ డ్రింక్ సిద్ధంగా ఉంది. 343 00:30:46,388 --> 00:30:49,474 ఐ లవ్ యూ, టోరీ. నీతో జీవితం చాలా బాగుంది. 344 00:30:50,309 --> 00:30:52,352 నీతో కూడా, బంగారం. 345 00:30:52,436 --> 00:30:53,604 థ్యాంక్యూ. 346 00:30:59,735 --> 00:31:02,738 ఈ ఆక్రమణకు, వ్యాపారులకు ఏదైనా సంబంధం ఉందంటావా? 347 00:31:03,697 --> 00:31:06,158 ఎవరికి తెలుసులే. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. 348 00:31:06,825 --> 00:31:10,204 అందరూ ఒక్కటే, వాళ్ళ రూపురేఖలే వేరుగా ఉంటాయి. 349 00:31:11,622 --> 00:31:13,999 అందరూ ఒక ప్రభుత్వం కిందే ఉంటే బాగుండు అనిపిస్తుంది. 350 00:31:15,459 --> 00:31:16,960 మా అంకుల్ పట్టించుకుంటాడు. 351 00:31:17,044 --> 00:31:19,129 ముందు నీలోని మంచితనాన్ని మీ అంకుల్ గుర్తించాలి, 352 00:31:19,213 --> 00:31:21,006 అప్పటిదాకా, ఆయన దేన్ని పట్టించుకున్నా నాకు అనవసరం. 353 00:31:21,089 --> 00:31:22,299 నువ్వు కూడా పట్టించుకోకు. 354 00:31:28,388 --> 00:31:30,349 ఒక తీపి కబురు. ఇక్కడికి ఒక అతిథి విచ్చేశారు. 355 00:31:33,560 --> 00:31:35,270 కాంప్లిమెంటరీ మసాజ్ ఏమో. 356 00:31:36,021 --> 00:31:39,441 మీ చేయి బాగా రఫ్ గా ఉన్నట్టుందే. 357 00:31:39,525 --> 00:31:41,151 అవును. 358 00:31:41,235 --> 00:31:43,487 ఎవరు మీరు? 359 00:31:43,570 --> 00:31:47,032 నేను కెప్టెన్ హాన్ ప్రిచర్ ని. ఫౌండేషన్ నిఘా శాఖలో పని చేస్తా. 360 00:31:47,991 --> 00:31:49,409 నేను కాక్టెయిల్ షేకర్ తెస్తా. 361 00:31:50,452 --> 00:31:52,621 నేను ఈ గదిలో ఉన్నంత వరకు మీ కెమెరాలేవీ పని చేయకూడదు. 362 00:31:52,704 --> 00:31:54,164 అర్థమైందా? 363 00:31:56,875 --> 00:31:57,876 హా. 364 00:31:58,460 --> 00:31:59,545 ఇది కాస్త వింతగా ఉంది. 365 00:32:00,212 --> 00:32:03,715 అప్పుడప్పుడూ, నేనెవరో చెప్తే, 366 00:32:03,799 --> 00:32:05,133 అవతలి వాళ్ళు కాస్తంత భయపడతారు. 367 00:32:05,217 --> 00:32:06,426 మేమెందుకు భయపడాలి? 368 00:32:06,510 --> 00:32:08,762 ఒక కారణం ఏంటంటే, మీరు రణరంగంలో ఉన్నారు. 369 00:32:09,638 --> 00:32:11,056 ఇంకా పోరు జరుగుతూనే ఉంది. 370 00:32:11,974 --> 00:32:12,975 బాంబు దాడులు జరుగుతున్నాయి. 371 00:32:17,354 --> 00:32:18,647 ఆక్రమణ గురించి మీకు ఏమైనా తెలుసా? 372 00:32:18,730 --> 00:32:22,526 అది మ్యూల్ అనే వ్యక్తి చేశారని తెలుసు. మొండి వెధవ కాబట్టి ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. 373 00:32:22,609 --> 00:32:26,405 అతని షిప్ పేరు, బ్లాక్ టంగ్. ఆ పేరు వింటేనే ఒళ్ళంతా జలదరిస్తుంది. 374 00:32:26,488 --> 00:32:29,324 సరే. అతను మంచివాడు కాదు. 375 00:32:29,408 --> 00:32:33,328 ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతడిని చేరుకోవడం కూడా కష్టమే. 376 00:32:33,412 --> 00:32:36,832 టోరన్, మనకి ఈయన ఏదో పని అప్పగించేలా ఉన్నాడు. 377 00:32:36,915 --> 00:32:40,711 కెప్టెన్, మా అంకుల్ రాండూ మాలో అని మీకు తెలుసు కదా. 378 00:32:41,461 --> 00:32:42,546 మీకోసం గూఢచర్యం చేస్తున్నామని తెలిస్తే, 379 00:32:42,629 --> 00:32:44,715 దీని వెనుక వ్యాపారుల హస్తం ఉందని అందరూ అనుకుంటారు. 380 00:32:50,721 --> 00:32:53,557 దీని వల్ల ఇండ్బర్ కి, మిగతా ఫౌండేషన్ నాయకత్వానికి ఇందులో ప్రమేయం లేదని తెలుస్తుంది. 381 00:32:56,310 --> 00:32:57,978 మ్యూల్ నిజంగా అంత ప్రమాదకరమైన వాడా? 382 00:32:58,061 --> 00:32:59,813 మేము ఆనందంగా హనీమూన్ చేసుకుంటున్నాం. 383 00:32:59,897 --> 00:33:01,315 అవును, మ్యూల్ ఉక్కుపాదంతో అణచివేస్తుంటే, 384 00:33:01,398 --> 00:33:03,400 మిగతా కాల్గన్ అంతా రక్తపుటేరులు పారుతుంటే, 385 00:33:03,483 --> 00:33:05,277 మీరు ఫోటోలు తీసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. 386 00:33:05,360 --> 00:33:06,570 మేమదంతా గమనించాం. 387 00:33:08,280 --> 00:33:11,158 కానీ మీకు దాని ప్రభావం తెలుస్తోందా? గాలి ఇప్పుడు తాజాగానే లేదు. 388 00:33:11,825 --> 00:33:13,243 సామాన్యులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు, 389 00:33:13,327 --> 00:33:14,912 తమ పక్కింట్లోకి మ్యూల్ మనుషులు ఆవేశంగా వెళ్లడం చూసి. 390 00:33:15,621 --> 00:33:17,247 సర్, మీరు నా భార్యని భయపెట్టాలని చూస్తుంటే గనక… 391 00:33:18,290 --> 00:33:19,499 లేదు. 392 00:33:19,583 --> 00:33:21,668 మీకు బాగా డబ్బుంది, భయమంటే తెలీదు మీకు. 393 00:33:22,794 --> 00:33:24,129 లోకం తీరు తెలీదు. ఎవడికేమైనా పట్టించుకోరు. 394 00:33:25,547 --> 00:33:27,883 అందుకే, నేను మీ షిప్పులోకి వచ్చినా మీలో ఆశ్చర్యమనేదే కనిపించలేదు. 395 00:33:29,092 --> 00:33:32,012 అందుకే, మీకు మ్యూల్ మనుషుల అడుగుల చప్పుళ్ళు వినిపించినా, 396 00:33:32,095 --> 00:33:33,597 అవెక్కడో దూరం నుండి వస్తున్నాయని, 397 00:33:33,680 --> 00:33:36,475 వేరే వాళ్ళని హింసిస్తున్నారని, మీకేం కాదని అనుకుంటుంటారు. 398 00:33:37,309 --> 00:33:38,352 ఏం కావాలి మీకు? 399 00:33:39,394 --> 00:33:41,438 సాధారణంగా, నియంతలు కావాలనుకునే ఇలాంటివాళ్ళు, 400 00:33:41,980 --> 00:33:45,150 ఏదైనా గ్రహాన్ని ఆక్రమించుకున్నాక, కొన్ని రోజుల పాటు ఏ హడావిడీ చేయరు. 401 00:33:45,234 --> 00:33:47,194 కానీ మ్యూల్ ఏదో నిరూపించాలనుకుంటున్నాడు. 402 00:33:47,277 --> 00:33:48,695 అతనికి ఇంకా రక్షణ ఉంది. 403 00:33:48,779 --> 00:33:50,656 కానీ తన క్రూరత్వం అంటే తనకి భలే ఇష్టం. 404 00:33:51,281 --> 00:33:53,325 ఈరాత్రి ఒక పార్టీ ఇస్తున్నాడు. 405 00:33:54,493 --> 00:33:59,748 గెలాక్సీ సెలబ్రిటీలైన టోరన్, బేయిటాలకు దానికి ఆహ్వానం కూడా అందింది. 406 00:33:59,831 --> 00:34:03,627 బేయిటా, ఈ కెప్టెన్ కూడా మనతో రావాలనుకుంటున్నాడు. 407 00:34:08,172 --> 00:34:10,050 హారి సెల్డన్ ఎవరో నీకు తెలుసా? 408 00:34:10,634 --> 00:34:11,635 తెలీదు. 409 00:34:12,302 --> 00:34:15,931 అతను చనిపోయి చాలా శతాబ్దాలు అయింది, కానీ అప్పుడప్పుడూ వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు. 410 00:34:17,599 --> 00:34:20,893 ఎంపైర్ పతనం వైపు అడుగులేస్తోందని చెప్పాడు. 411 00:34:20,978 --> 00:34:25,815 మేము ఆ పతనానికి దూరమైతే పెంచాం, కానీ దాని వైపు అడుగులు వేస్తూనే ఉన్నాం. 412 00:34:25,899 --> 00:34:27,442 కొత్త విషయం ఏంటంటే, 413 00:34:29,235 --> 00:34:32,989 కొన్ని వారాల్లోనే అంతా ముగిసిపోతుందని ఇప్పుడు మాకు తెలిసింది. 414 00:34:43,792 --> 00:34:45,377 త్వరలోనే అంతా ముగిసిపోతుంది. 415 00:34:45,960 --> 00:34:47,588 అది మీకెలా తెలుసు? 416 00:34:48,714 --> 00:34:52,259 హారి సెల్డన్ భవిష్యత్తును అంచనా ఎలా వేయాలో తెలుసుకున్నాడు. 417 00:34:53,760 --> 00:34:56,179 దాన్ని ఎలా చూడాలో మాకు కూడా నేర్పాడు, అలా మాకు తెలుసు. 418 00:34:59,683 --> 00:35:00,851 దాన్ని మీరు నమ్ముతున్నారా? 419 00:35:00,934 --> 00:35:02,561 వాళ్ళు నమ్ముతున్నారు. 420 00:35:02,644 --> 00:35:05,480 నా సోదరులకు కళ్ళు నెత్తికెక్కి, దాన్ని ఆపగలమని అనుకుంటున్నారు. 421 00:35:06,106 --> 00:35:07,107 నేను నమ్మట్లేదు. 422 00:35:08,108 --> 00:35:11,445 ఏదేమైనా, పరిస్థితులు బాగా దిగజారుతాయి. 423 00:35:12,404 --> 00:35:15,616 అలా జరిగినప్పుడు ఇక్కడ ఉండాలని నాకు లేదు. 424 00:35:17,826 --> 00:35:19,786 నేను మైకోజెన్ కి వెళ్ళిపోతా. 425 00:35:21,955 --> 00:35:24,333 నువ్వు పుట్టిన ప్రదేశాన్ని చూడాలనుంది. 426 00:35:27,628 --> 00:35:28,670 చెప్పవయ్యా. 427 00:35:30,255 --> 00:35:32,633 కాస్త నీతో ఏకాంతంగా మాట్లాడొచ్చా? 428 00:35:33,467 --> 00:35:34,468 కుదరదు. 429 00:35:35,052 --> 00:35:37,471 - నేను వెళ్తాలే. - వద్దు, ఇది నీ ఇల్లు కూడా. 430 00:35:38,388 --> 00:35:40,516 ఈమె ఇక్కడే ఉంటుంది. 431 00:35:41,266 --> 00:35:44,728 సరే. తనకి క్షమాపణలు చెప్తున్నా. 432 00:35:57,282 --> 00:36:00,744 నీకు మొదట్నుంచీ రేడియంట్ ఇష్టం లేదు, దానిపై మేము ఆధారపడటమూ ఇష్టం లేదు. 433 00:36:02,162 --> 00:36:04,414 అది సరైన పనే అని నాకు ఇప్పుడు అర్థమైంది. 434 00:36:05,165 --> 00:36:06,291 నన్ను క్షమించు. 435 00:36:07,626 --> 00:36:09,378 పెద్దమనిషి. 436 00:36:11,463 --> 00:36:14,591 నీ పెద్దమనిషి మాటలను నామీద కూడా ప్రయోగిస్తున్నావు, బాగుంది. 437 00:36:16,260 --> 00:36:17,845 నేను సాయపడాలనుకుంటున్నా. 438 00:36:17,928 --> 00:36:20,264 ఈ బరువునంతా నువ్వు ఒక్కడివే మోయాల్సిన పని లేదు. 439 00:36:20,347 --> 00:36:24,810 నీకు ఆ బరువును మోయడం కూడా ఇష్టం లేదు కదా, అందుకని ఆ బరువును మోసే బాధ్యత నాకు ఇవ్వు. 440 00:36:26,353 --> 00:36:28,230 డ్రిఫ్ట్ ప్రారంభమైనప్పుడు, మనం… 441 00:36:29,648 --> 00:36:32,818 మన వివేక శక్తి త్వరగానే సన్నగిల్లుతోందని గమనించాం, 442 00:36:33,735 --> 00:36:36,864 అందుకని పగటి రాజు టైమింగ్ ని సవరించాడు. 443 00:36:37,573 --> 00:36:42,911 మనందరి జీవిత కాలాన్ని తగ్గించాడు. 444 00:36:42,995 --> 00:36:44,329 కాబట్టి… 445 00:36:45,914 --> 00:36:48,000 పగటి రాజు మళ్ళీ దాన్ని సవరించగలడు. 446 00:36:51,837 --> 00:36:57,092 కొన్ని నెలలకు ఆ జీవిత కాలాన్ని పెంచితే చాలు. 447 00:36:59,553 --> 00:37:01,305 ఈ సమస్య పరిష్కారమయ్యే దాకా. 448 00:37:04,516 --> 00:37:06,643 మనందరం మహానటులం, కదా? 449 00:37:08,061 --> 00:37:09,897 సినిమాల్లో నటించి ఉంటే సూపర్ స్టార్స్ అయిపోయి ఉండేవాళ్ళం. 450 00:37:14,318 --> 00:37:15,652 ముందు డెమెర్జల్ ని అడిగావు కదా? 451 00:37:17,196 --> 00:37:19,823 అది కుదరదని చెప్పి ఉంటుంది, ఇక గతి లేక నా దగ్గరికి వచ్చావు. 452 00:37:22,659 --> 00:37:27,039 మన బుర్రలు పని చేయడం త్వరగా ఆగిపోతాయి కాబట్టే, మనం కూడా తర్వాతి హోదాకి త్వరగా మారిపోతాం. 453 00:37:27,748 --> 00:37:31,168 అది అసహజంగా అనిపిస్తే, మంచిదే కదా. 454 00:37:32,419 --> 00:37:34,421 మన డిక్షనరీలో సహజం అనే పదమే లేదు. 455 00:37:36,173 --> 00:37:38,926 మనం మహారాజుల ముసుగులో ఉన్న కీలు బొమ్మలం. 456 00:37:39,968 --> 00:37:41,136 రాకాసులం. 457 00:37:48,101 --> 00:37:49,102 చూడు. 458 00:37:50,938 --> 00:37:51,939 చూశావా? 459 00:37:52,814 --> 00:37:55,317 మన ఒంట్లో ఉండే నానైట్స్ ఎలా పని చేస్తున్నాయో చూడు. 460 00:38:11,542 --> 00:38:12,543 చూడు. 461 00:38:13,669 --> 00:38:16,964 కీలు బొమ్మ మళ్ళీ మామూలుది అయిపోయింది. 462 00:38:30,269 --> 00:38:32,104 పగటి రాజు రావట్లేదు, కదా? 463 00:38:32,855 --> 00:38:34,731 రావట్లేదనే అనుకుంటా, మహారాజా. 464 00:38:37,150 --> 00:38:38,610 ఎవరు చనిపోయారేంటి? 465 00:38:38,694 --> 00:38:41,613 పగటి రాజుపై నాకున్న రవ్వంత గౌరవం చచ్చిందిలే. 466 00:38:42,573 --> 00:38:44,074 మా సోదరుడికి మంచి వస్త్రాలు తీసుకురండి. 467 00:38:45,200 --> 00:38:47,870 అతని స్థానంలో నేనుంటే పర్లేదనే అనుకుంటున్నా. 468 00:38:47,953 --> 00:38:51,498 సంప్రదాయం వల్లో, విధి వల్లో అతను రాడని ముందే ఊహించా, కానీ… 469 00:38:53,208 --> 00:38:56,420 నాలోని చిన్నపిల్లాడు, మంచితనానికైనా పోయి అతను వస్తాడని ఆశించాడు. 470 00:38:57,087 --> 00:38:58,463 నీకు పట్టాభిషేకం చేయడానికి అతను సరైన వాడు కాదు. 471 00:39:00,465 --> 00:39:03,385 నన్ను పగటి రాజుగా పట్టాభిషిక్తుడిని చేసిన క్లియాన్, అన్నయ్యలా కాకుండా తండ్రిలా చూసుకున్నాడు. 472 00:39:05,095 --> 00:39:07,806 అతను మధ్య సింహాసనాన్ని ఎంతో ప్రేమతో ప్రసాదించాడు నాకు. 473 00:39:10,475 --> 00:39:13,854 నేను మన సోదరుడిని పట్టాభిషిక్తుడిని చేసేటప్పుడు, మనోడు అంతా గడబిడ చేసేస్తాడని అర్థమైపోయింది. 474 00:39:17,524 --> 00:39:20,402 కానీ, నిన్ను గర్వంగా పట్టాభిషిక్తుడిని చేస్తా. 475 00:39:24,072 --> 00:39:26,408 ఇవాళ రాత్రి నేను, రాయబారి క్వెంట్ డ్రింక్స్ పార్టీ చేసుకుంటున్నాం. 476 00:39:26,491 --> 00:39:27,993 నువ్వు కూడా రా. 477 00:39:29,411 --> 00:39:31,038 తను నాకు ఎప్పట్నుంచో మంచి స్నేహితురాలు. 478 00:39:31,121 --> 00:39:32,289 అవును. 479 00:39:33,707 --> 00:39:37,794 మనకు నిజంగానే ఎక్కువ సమయం లేకపోతే, చివర్లో నలుగురు మిత్రులు చెంతనే ఉంటే, కాస్త బాగుంటుంది. 480 00:39:39,046 --> 00:39:40,547 ఈ చివరి రోజుల్లో… 481 00:39:41,507 --> 00:39:43,383 నాకు వీలైనంత సాయం నీకు అందిస్తూనే ఉంటా. 482 00:39:44,343 --> 00:39:46,094 క్వెంట్ ని మచ్చిక చేసుకొని నీ వైపు తిప్పుకోవడంలో సాయపడతా. 483 00:39:46,178 --> 00:39:47,179 ఇంకా… 484 00:39:48,680 --> 00:39:51,099 నేను ఎవరికీ చెప్పని కానుక ఇంకోటి ఉంది. 485 00:39:51,725 --> 00:39:53,143 ఏంటది? 486 00:39:57,606 --> 00:39:59,107 సరైన సమయంలో చెప్తా. 487 00:40:00,359 --> 00:40:02,194 డెమెర్జల్ కి తెలిసే ఉంటుందిగా. 488 00:40:02,277 --> 00:40:06,490 తెలీదు. డెమెర్జల్ దగ్గర నేను రహస్యంగా ఉంచిన ఏకైక విషయం అదే. 489 00:40:06,573 --> 00:40:09,243 ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ, నిన్ను అది సురక్షితంగా ఉంచగలదు. 490 00:40:11,870 --> 00:40:15,332 "వేకువ రాజు, పగటి రాజుగా పట్టాభిషిక్తుడు కానున్నాడు. 491 00:40:15,999 --> 00:40:19,336 ఇప్పుడే ఉదయించిన అందాల సూర్యుడివి నువ్వు." 492 00:40:21,380 --> 00:40:28,053 "నీకు సాటిలేని జ్ఞానం దక్కగలదని, దాన్ని, ఆశని ఉపయోగించి ఎంపైర్ ని లోలోపల నుండి బలోపేతం చేయగలవాని ఆశిస్తున్నా." 493 00:40:29,513 --> 00:40:30,764 థ్యాంకూ. 494 00:40:34,852 --> 00:40:35,853 సరిగ్గా సరిపోయింది. 495 00:40:39,565 --> 00:40:42,985 ఇప్పుడల్లా దీని అవసరం ఉండదనే అనుకున్నా, 496 00:40:43,068 --> 00:40:47,573 కానీ ఇటీవల తెలిసిన కొన్ని విషయాలు, మనకు సమయం పెద్దగా లేకుండా చేశాయి. 497 00:40:47,656 --> 00:40:51,285 అంతా మీరు కోరినట్టే సిద్ధం చేశాం, మహారాజా. 498 00:40:51,368 --> 00:40:53,745 అయితే, వేకువ రాజు పాలన ఎదురులేనిది అవుతుంది, 499 00:40:53,829 --> 00:40:55,914 ఇక నేను తప్పుకోవచ్చు. 500 00:40:57,082 --> 00:40:58,166 అందుకు ఇది తప్పక పని చేయాలి. 501 00:41:01,211 --> 00:41:03,255 ఇది పని చేస్తుందా? 502 00:41:04,882 --> 00:41:08,343 మీ కృప వలన, ఇది పని చేస్తోంది, మహారాజా. 503 00:41:08,969 --> 00:41:11,889 నోవాకుల బాంబు లాంటిది ఇప్పటిదాకా పుట్టుకురాలేదు. 504 00:41:11,972 --> 00:41:14,016 ఇది బ్లాక్ హోల్ బాంబు. 505 00:41:14,766 --> 00:41:20,022 మనం ఉపయోగించుకొనే శక్తి, అవధుల్లేకుండా శరవేగంగా తిరిగే ఈ బీస్ట్ నుండి వస్తుంది. 506 00:41:20,647 --> 00:41:26,653 ఒక సెకనుకు, ఈ బీస్ట్ కొన్ని వందల సార్లు తిరుగుతుంది. 507 00:41:29,198 --> 00:41:32,659 బ్లాక్ హోల్ నుండి తప్పించుకోవడం అసాధ్యం. 508 00:41:32,743 --> 00:41:37,706 దాని లోపల, టైమ్, స్పేస్ లకి అర్థం ఉండదు. 509 00:41:38,457 --> 00:41:42,419 కానీ బయటి పొర అయిన ఎర్గో స్ఫియర్ ని 510 00:41:42,503 --> 00:41:46,757 మనం కదిపి, వాడుకోవచ్చు. 511 00:41:46,840 --> 00:41:50,093 దాని పైకి ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ కిరణాలను ప్రసరింపజేస్తే, 512 00:41:50,636 --> 00:41:54,556 మన ఊహకందని వేడితో ఫోటాన్లు, అంటే లైట్ అనంత విశ్వంలో 513 00:41:54,640 --> 00:41:57,142 దూసుకుపోతాయి. 514 00:41:57,851 --> 00:42:00,479 వాటిలో మన ఊహలకందని శక్తి ఉంటుంది. 515 00:42:00,562 --> 00:42:03,565 కానీ ప్రతి సెకనుకు అవి సంఖ్యాబలాన్ని పెంచుకుంటూ సంసిద్ధం అవుతూ ఉంటాయి. 516 00:42:04,316 --> 00:42:10,864 ఈ నిప్పులు కక్కే, తిరుగులేని శక్తితో, 517 00:42:10,948 --> 00:42:15,827 మన సేనలకు ఎదురే ఉండదు, మన సామ్రాజ్యాన్ని మనం విస్తరించుకోవచ్చు. 518 00:42:15,911 --> 00:42:17,246 చూడండి. 519 00:42:56,910 --> 00:42:59,454 ఆ గ్రహంలో ఎంత భాగం గాల్లో కలిసిపోయింది? 520 00:42:59,538 --> 00:43:01,123 ఏదీ గాల్లో కలిసిపోలేదు. 521 00:43:01,915 --> 00:43:05,919 అది అక్కడే ఉంటుంది. కానీ పూర్తిగా మారిపోతుంది. 522 00:43:07,838 --> 00:43:11,341 శభాష్. 523 00:43:12,426 --> 00:43:17,014 మీ చేతులకి నేను యమపాశాన్ని అందించానని జనాలకు తెలుస్తుంది. 524 00:43:19,308 --> 00:43:21,101 ఇది కేవలం మన జోలికి ఎవరూ రాకుండా హెచ్చరించడానికే. 525 00:43:21,727 --> 00:43:23,645 దీన్ని కేవలం వేకువ రాజు మాత్రమే ఉపయోగించాలి, 526 00:43:23,729 --> 00:43:26,273 అది కూడా అత్యవసర పరిస్థితుల్లోనే. 527 00:43:27,733 --> 00:43:31,445 కానీ ఆ అత్యవసర పరిస్థితి ముంచుకొస్తున్నట్టుంది. 528 00:43:37,409 --> 00:43:41,163 ఇండ్బర్ ని అడిగి తెలుసుకునే సమయం నీకు ఉండిందా, 529 00:43:41,246 --> 00:43:45,626 లేకపోతే మనోడు కాల్గన్ లోని క్యాసినోలలో జూదం ఆడుతూ బిజీగా ఉన్నాడా? 530 00:43:46,793 --> 00:43:48,879 కాల్గన్ పతనం అవ్వడం 531 00:43:48,962 --> 00:43:51,673 ఫౌండేషన్ ని షాక్ కి గురి చేసిందని తెలుసుకున్నా. 532 00:43:51,757 --> 00:43:53,342 ఇండ్బర్ కి ఏమీ తెలీదు. 533 00:43:53,425 --> 00:43:55,135 మనోడికి అసలు ఏమైనా తెలిస్తే కదా. 534 00:43:55,219 --> 00:43:58,597 వాల్ట్ తెరుచుకున్నప్పుడు మనకి మరింత సమాచారం తెలుస్తుంది, అంతేగా? 535 00:43:59,389 --> 00:44:01,266 అది తెరుచుకోబోతుంది, కదా? 536 00:44:02,601 --> 00:44:06,146 ఇవన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి? నాకేదో అనుమానంగా ఉంది. 537 00:44:06,230 --> 00:44:09,024 మా దారులు మాకు ఉన్నాయిలే. 538 00:44:10,484 --> 00:44:11,485 తను నవ్వితే భలేగా ఉంటుంది. 539 00:44:14,071 --> 00:44:16,949 కాల్గన్ ఎవరి ఆధీనంలో ఉన్నా నాకు అనవసరం. 540 00:44:18,784 --> 00:44:21,495 కానీ దాన్ని హస్తగతం చేసుకున్న ఆ దొంగ గురించే ఆలోచిస్తున్నా. 541 00:44:22,538 --> 00:44:24,665 ఆ గ్రహాన్ని అతను ఇంకా ఎవరికీ అమ్మేయలేదు, 542 00:44:24,748 --> 00:44:28,085 కాబట్టి దాన్ని తనే ఉంచుకోవాలనుకుంటున్నాడని అనిపిస్తోంది. 543 00:44:28,168 --> 00:44:32,798 మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? కాల్గన్ లో నివసించే అమయాక జనాల గురించా? 544 00:44:34,800 --> 00:44:35,801 కాదు. 545 00:44:36,343 --> 00:44:39,137 లేదు, నేను ఇంకా మహారాజునే. మా కోసం తప్ప నేనెవరి గురించీ ఆలోచించను. 546 00:44:41,098 --> 00:44:42,391 సిద్ధంగా ఉండాలనుకుంటున్నా, అంతే. 547 00:44:44,726 --> 00:44:46,311 నువ్వు సిద్ధంగానే ఉంటావులే. 548 00:44:47,271 --> 00:44:48,313 అందులో నాకేం సందేహం లేదు. 549 00:44:53,443 --> 00:44:55,362 నేను చెప్పాలనుకున్నది ఇదే. 550 00:44:55,445 --> 00:44:59,116 నేను తాగను కాబట్టి, మీరు తాగుతూ హాయిగా ఆస్వాదించండి. 551 00:45:03,704 --> 00:45:04,872 మహారాజా? 552 00:45:06,874 --> 00:45:11,837 వేకువ సోదరా, సాధారణంగా మీకు తెలియాల్సిన విషయాల కన్నా ఎక్కువ తెలుస్తుంటాయి. 553 00:45:11,920 --> 00:45:14,006 కాబట్టి మీకు ఆందోళనగా ఉంటే, నేను కూడా ఆందోళనపడాల్సిందే. 554 00:45:14,089 --> 00:45:16,049 మీరు నిజంగా దేని గురించి ఆందోళన చెందుతున్నారో చెప్పండి. 555 00:45:17,676 --> 00:45:20,846 మ్యూల్ లాంటి వ్యక్తుల గురించే నేను ఆలోచిస్తున్నా, 556 00:45:20,929 --> 00:45:22,514 ఎందుకంటే వాళ్ళు ఏవేవో చేసేయగలరు. 557 00:45:23,682 --> 00:45:25,392 సెల్డన్ బోధించేది కూడా అదే కదా? 558 00:45:25,475 --> 00:45:28,562 మా నవ్వులు, డ్రింక్స్ కోసం ఆ బోధనలను పక్కకు పెట్టేశారా ఏంటి? 559 00:45:30,480 --> 00:45:33,233 సెల్డన్ బోధనలే నన్ను నడిపిస్తున్నాయి. 560 00:45:34,026 --> 00:45:36,445 వాటి కోసమే నేను వేరే గ్రహంలో ఉంటున్నాను. 561 00:45:38,447 --> 00:45:40,157 మిమ్మల్ని ఒప్పించడం నా ఉద్దేశం కాదు. 562 00:45:40,240 --> 00:45:42,743 కానీ క్షమించాలి, నాకు… నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. 563 00:46:33,585 --> 00:46:34,711 మ్యూల్. 564 00:46:35,462 --> 00:46:37,965 ఆ పేరు వినగానే, నువ్వు కాల్ చేస్తావని అనుకున్నా. 565 00:46:39,174 --> 00:46:41,510 మీరు ప్రయోజకులుగా మారే సమయం వచ్చింది, మహారాజా. 566 00:48:10,474 --> 00:48:12,476 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్ 566 00:48:13,305 --> 00:49:13,356 Do you want subtitles for any video? -=[ ai.OpenSubtitles.com ]=-