"Camp Snoopy" Ring Toss/Letters Home
ID | 13193143 |
---|---|
Movie Name | "Camp Snoopy" Ring Toss/Letters Home |
Release Name | Camp.Snoopy.S01E10.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS |
Year | 2024 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 32515600 |
Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-
2
00:01:04,022 --> 00:01:05,649
"రింగ్ టాస్."
3
00:01:06,233 --> 00:01:09,570
స్ప్రింగ్ సరస్సు
4
00:01:14,157 --> 00:01:18,245
మీ అన్నయ్య పెంపుడు కుక్క
మిగతా కుక్కలకి భిన్నంగా ఉండటం నేను గమనించాను.
5
00:01:18,328 --> 00:01:19,955
దానికి అలవాటుపడిపోయాం.
6
00:01:20,038 --> 00:01:21,373
మా అమ్మ జంతు వైద్యురాలు,
7
00:01:21,456 --> 00:01:25,294
కాబట్టి సాధారణంగానే నాకు కుక్కలతో మంచి అనుబంధం ఉంది
ఇంకా నాకు కుక్కలంటే ఇష్టం కూడా.
8
00:01:25,377 --> 00:01:27,045
మీ కుక్క ఫెచింగ్ ఆటని ఇష్టపడతాడా?
9
00:01:27,546 --> 00:01:29,631
ఆ ఆటలో నువ్వు గెలుస్తావన్న నమ్మకం నాకు లేదు.
10
00:01:30,257 --> 00:01:32,843
ఇదిగో, బాబూ! వెళ్లి దాన్ని తీసుకురా. వెళ్లి తీసుకురా.
11
00:01:37,723 --> 00:01:40,100
ఫెచ్ ఆట మీద నీకు ఆసక్తి లేదు, హా?
12
00:01:41,685 --> 00:01:42,811
సరే.
13
00:01:44,229 --> 00:01:45,731
అయితే మరి…
14
00:01:45,814 --> 00:01:48,275
రింగ్ టాస్ ఆట ఆడదామా?
15
00:01:48,358 --> 00:01:49,610
ముందు నువ్వు.
16
00:01:55,657 --> 00:01:57,201
బాగా వేశావు.
17
00:02:02,372 --> 00:02:03,874
ఇప్పుడు నీ వంతు, శాలీ.
18
00:02:17,554 --> 00:02:20,098
నా కేకు! నా పిన్యాటా!
19
00:02:20,182 --> 00:02:21,642
నా డ్రెస్సు!
20
00:02:21,725 --> 00:02:23,977
ఈ పని ఎవరు చేశారు?
21
00:02:27,773 --> 00:02:28,774
వద్దు, థాంక్స్.
22
00:02:28,857 --> 00:02:31,652
రింగ్ టాస్ అనేది ఒక రకంగా పిల్లల ఆట.
23
00:02:31,735 --> 00:02:34,613
నేను హాప్ స్కాచ్ లాంటి పెద్ద ఆటలు ఆడటానికి ఇష్టపడతాను.
24
00:02:35,113 --> 00:02:36,406
సరే నీ ఇష్టం.
25
00:02:36,490 --> 00:02:37,658
మళ్లీ వేస్తావా?
26
00:02:43,872 --> 00:02:45,541
ఆట మరోసారి టై అయింది.
27
00:02:45,624 --> 00:02:48,043
శాలీ, నీకు నిజంగానే ఆడాలని లేదా?
28
00:02:48,126 --> 00:02:49,002
అవును.
29
00:02:49,086 --> 00:02:54,174
నేను వెళ్లి, ఈ ఆట ఎంత విసుగు పుట్టిస్తుందో
మీరు గ్రహించే వరకూ ఎదురుచూస్తాను.
30
00:03:02,307 --> 00:03:06,728
ఇదిగో, చూడండి, ఇక్కడ మీరు చక్కని రాళ్లు పేర్చే ఆటని
మిస్ అవుతున్నారు.
31
00:03:07,229 --> 00:03:08,772
మళ్లీ టై అయింది!
32
00:03:08,856 --> 00:03:12,401
రింగ్ టాస్ ఆటలో నువ్వు ఇంత ఆటగాడివని
నాకు ఎవరూ చెప్పలేదు, స్నూపీ.
33
00:03:23,036 --> 00:03:25,414
నాకు నీ సలహా కావాలి, పెద్ద అన్నయ్య.
34
00:03:25,497 --> 00:03:28,542
నిజంగానా? నీకు నా సలహా కావాలా?
35
00:03:28,625 --> 00:03:29,668
తప్పకుండా.
36
00:03:29,751 --> 00:03:33,797
పెద్ద సమస్య కాదు,
కానీ నా స్నేహం చెడిపోయే అవకాశం కనిపిస్తోంది.
37
00:03:33,881 --> 00:03:35,048
ఓహో.
38
00:03:35,132 --> 00:03:38,343
అంటే, ఫ్రెండ్షిప్ అనేది సంక్లిష్టమైనది.
39
00:03:38,427 --> 00:03:40,387
స్నేహితుల్ని నమ్మడం గురించి నీకు సలహా కావాలా?
40
00:03:40,470 --> 00:03:42,222
సానుభూతి గురించా? నిజాయితీ గురించా?
41
00:03:42,306 --> 00:03:44,975
నువ్వు నాకు రింగ్ టాస్ ఆట నేర్పించాలి.
42
00:03:47,811 --> 00:03:48,937
సరే.
43
00:04:04,119 --> 00:04:05,621
ఇంకోసారి ఆట టై అయింది.
44
00:04:06,121 --> 00:04:09,291
సరే. ఈసారి ఆటని మరింత కఠినంగా ఆడితే ఎలా ఉంటుంది?
45
00:04:21,220 --> 00:04:22,888
పాచిపోయిన బ్యాగెల్ తో ఆడాలా?
46
00:04:22,971 --> 00:04:26,183
ఇంత తక్కువ సమయంలో రింగ్ మాదిరిగా ఉండేది
నాకు అది మాత్రమే దొరికింది.
47
00:04:26,266 --> 00:04:28,310
సరే, తల పైకెత్తు.
48
00:04:28,393 --> 00:04:29,728
నడుము తిన్నగా పెట్టు.
49
00:04:29,811 --> 00:04:32,272
నీ మోచేతిని ఇంకా మోకాలిని వంచు.
50
00:04:32,773 --> 00:04:34,358
ఇంకో మోకాలిని.
51
00:04:34,441 --> 00:04:38,237
ఇప్పుడు, ఈ ఆట అంతా
మణికట్టులోనే ఉంటుందని గుర్తుంచుకో.
52
00:04:38,320 --> 00:04:40,989
ఇప్పుడు విసురు.
53
00:04:46,828 --> 00:04:49,248
బహుశా నువ్వు ఇంకాస్త దగ్గరగా నిలబడాలేమో.
54
00:04:56,171 --> 00:04:58,841
నేను వేసేశాను. ఇంక నేను రింగ్ టాస్ ఆడగలను.
55
00:04:59,883 --> 00:05:04,179
సరే, టెక్నికల్ గా, మనం ఎలా విసరాలో
ఇంకాస్త సాధన చేయాల్సి ఉంది…
56
00:05:04,263 --> 00:05:06,557
లేదు, నాకు ఆట వచ్చేసింది. థాంక్స్, పెద్ద అన్నయ్యా.
57
00:05:07,266 --> 00:05:11,937
నీకు జీవితానికి సంబంధించి ఏదైనా సలహా ఎప్పుడు కావాలన్నా,
నేను దానికి కూడా అందుబాటులో ఉంటా.
58
00:05:12,020 --> 00:05:14,565
అవసరమైన జ్ఞానం నాలో చాలా ఉంది.
59
00:05:15,607 --> 00:05:16,775
చాలా జ్ఞానం.
60
00:05:19,528 --> 00:05:20,737
సరే.
61
00:05:22,281 --> 00:05:24,241
ఆడటానికి నేను సిద్ధం.
62
00:05:24,324 --> 00:05:26,493
మంచిది. మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం.
63
00:05:26,577 --> 00:05:31,039
మేము తరువాత రింగ్ ని విసిరేటప్పుడు, వెనుక వైపు తిరిగి
అద్దంలో చూస్తూ రింగ్ ని విసరాలి.
64
00:05:31,540 --> 00:05:32,541
మొదట నువ్వు విసురుతావా?
65
00:05:36,795 --> 00:05:41,675
నా విసిరే గ్లౌవ్స్ ని నేను క్యాబిన్ లో మర్చిపోయి వచ్చాను.
66
00:05:45,387 --> 00:05:47,264
విసిరే గ్లౌవ్స్ ఏంటి?
67
00:05:56,398 --> 00:05:58,901
నేను రింగ్ టాస్ ఆటలో నైపుణ్యం సాధించాలంటే,
68
00:05:58,984 --> 00:06:01,778
ఖచ్చితంగా నేను పెద్ద అన్నయ్య కంటే పెద్దగా ఆలోచించాలి
69
00:06:01,862 --> 00:06:04,072
ఇంకా వేరొకరి సహాయం కూడా తీసుకోవాలి.
70
00:06:05,866 --> 00:06:08,285
సారీ, రింగ్ టాస్ నేను ఆడే ఆట కాదు.
71
00:06:08,368 --> 00:06:12,956
నేను సాధారణంగా వలల్లోకి బంతులు విసిరే ఆటలు ఆడతాను,
కానీ వాటి మీద నుంచి కాదు.
72
00:06:13,040 --> 00:06:17,211
అంటే, గోల్ పోస్టులు, గోల్ స్తంభాలు,
బాస్కెట్ బాల్ వలలు లాంటివి.
73
00:06:18,003 --> 00:06:19,546
సరే థాంక్స్.
74
00:06:33,143 --> 00:06:34,311
చెత్త.
75
00:06:35,687 --> 00:06:37,940
బహుశా రింగ్ టాస్ నేను ఆడగలనేమో.
76
00:06:46,031 --> 00:06:48,325
మానసిక వైద్య సహాయం ఐదు సెంట్లు
77
00:06:48,408 --> 00:06:50,077
నా డయాగ్నోసిస్ చెప్పమంటావా?
78
00:06:50,160 --> 00:06:51,954
నీకు గెలుపు అంటే భయం.
79
00:06:52,037 --> 00:06:54,164
అది నా గురించి చెప్పినట్లు లేదు.
80
00:06:54,665 --> 00:06:56,542
ఒక్క నిమిషం ఆగు.
81
00:06:56,625 --> 00:06:59,044
నా పార్టీని పాడు చేసింది నువ్వే కదా?
82
00:07:08,554 --> 00:07:10,681
నువ్వు సరైన చోటుకే వచ్చావు.
83
00:07:11,807 --> 00:07:14,393
"రింగ్ టాస్ ఆట హార్స్ షూస్ ఆట నుండి ఆవిర్భవించింది
84
00:07:14,476 --> 00:07:20,023
ముఖ్యంగా 1876లో భారీగా ఇనుము కొరత ఏర్పడటం,
గుర్రాలకు నాడాలు అవసరమవడం ఈ ఆట పుట్టడానికి కారణాలు."
85
00:07:20,107 --> 00:07:22,401
"ఈ ఆటని ఆటగాళ్లు ఒకరి తరువాత ఒకరు ఆడతారు…"
86
00:07:27,281 --> 00:07:28,782
రింగ్ టాస్ ఆట ఎలా సాగింది?
87
00:07:29,283 --> 00:07:30,284
ఘోరంగా.
88
00:07:30,367 --> 00:07:35,330
స్నూపీతో కలిసి నయోమి రోజంతా ఆడుతోంది
కానీ నాకు ఆడటం చేత కావడం లేదు.
89
00:07:35,414 --> 00:07:37,291
నా ఆట నాకే అవమానంగా అనిపించవచ్చు కదా?
90
00:07:37,374 --> 00:07:40,711
నేను సమ్మర్ క్యాంప్ కి వచ్చింది
ఈ అవమానాలు ఎదుర్కోవడానికి కాదు.
91
00:07:40,794 --> 00:07:42,671
నిన్ను ఎవరైనా ఎందుకు అవమానిస్తారు?
92
00:07:42,754 --> 00:07:47,342
ఎందుకంటే నయోమి బాగా ఆడుతోంది కానీ నేను ఆడలేకపోతున్నాను.
93
00:07:47,426 --> 00:07:52,055
బహుశా తను నన్ను చులకనగా చూడచ్చు ఇంకా మా అభిరుచులు
కలవకపోవడం గురించి ఆలోచించడం మొదలుపెట్టచ్చు.
94
00:07:52,139 --> 00:07:55,976
అప్పుడు మాకు తెలియకుండానే
మేము ఫ్రెండ్స్ గా విడిపోయి ఉంటాము.
95
00:07:56,059 --> 00:08:00,189
శాలీ, మీ అభిరుచులు కలిస్తేనో లేదా
96
00:08:00,272 --> 00:08:02,649
అన్ని విషయాలలో సమానంగా ఉంటేనో
అదే నిజమైన స్నేహం అనుకోకూడదు.
97
00:08:02,733 --> 00:08:04,943
మనల్ని మంచిగా ఫీలయ్యేలా చేసేవాళ్లే మన స్నేహితులు.
98
00:08:06,653 --> 00:08:09,489
ఈ మాట కాస్త ఆశాజనకంగా ఉంది.
99
00:08:09,573 --> 00:08:10,657
బహుశా కావచ్చు.
100
00:08:10,741 --> 00:08:14,453
కానీ నాకు ఏం అనిపిస్తోందంటే
ఏ విషయంలో అయినా బాగా రాణించే ఫ్రెండ్ ని
101
00:08:14,536 --> 00:08:16,622
మనం దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు.
102
00:08:16,705 --> 00:08:19,541
వాళ్లని చూసి గర్వపడటానికి అది ఒక అవకాశం.
103
00:08:21,376 --> 00:08:23,253
నేను ఈ విధంగా స్నేహం గురించి ఆలోచించలేదు.
104
00:08:24,254 --> 00:08:25,714
థాంక్స్, పెద్ద అన్నయ్యా.
105
00:08:30,260 --> 00:08:31,595
ఇదిగో వచ్చావు.
106
00:08:31,678 --> 00:08:34,806
అవును. కొన్ని రింగులు విసరడానికి సిద్ధంకండి.
107
00:08:36,350 --> 00:08:37,601
ఆ ఆటని మేము ముగించాము.
108
00:08:38,143 --> 00:08:41,145
నిజానికి నీకు ఏం చేయాలని ఉందో తెలుసుకోవడానికి
నీ కోసం మేము ఎదురుచూస్తున్నాము.
109
00:08:41,230 --> 00:08:44,483
నిజంగానా? మీరు ఎప్పుడైనా గో ఫిష్ ఆట ఆడారా?
110
00:08:44,566 --> 00:08:46,568
ఆడాను, కానీ అంత బాగా రాదు.
111
00:08:48,153 --> 00:08:49,696
మరేం ఫర్వాలేదు.
112
00:08:49,780 --> 00:08:50,781
నేను ఆడతాను.
113
00:08:51,281 --> 00:08:52,699
స్నూపీ?
114
00:08:57,079 --> 00:08:58,830
నీ దగ్గర తొమ్మిదులు ఉన్నాయా?
115
00:09:00,290 --> 00:09:01,290
గో ఫిష్.
116
00:09:02,209 --> 00:09:03,877
అసాధ్యం.
117
00:09:03,961 --> 00:09:05,879
నీ సంగతి ఏంటి, స్నూపీ?
118
00:09:06,797 --> 00:09:08,465
అసాధ్యం.
119
00:09:19,142 --> 00:09:20,686
సారీ, చక్.
120
00:09:20,769 --> 00:09:23,564
ఈ ఆటని నేను మిస్ కాలేను.
121
00:09:29,444 --> 00:09:30,320
బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం
122
00:09:30,404 --> 00:09:34,992
"బీగల్ స్కౌట్ కుక్క ఓర్పుగా ఉంటుంది."
123
00:09:37,411 --> 00:09:39,454
అయితే, ఈ పరికరం ఏంటో మళ్లీ చెప్పు?
124
00:09:39,538 --> 00:09:40,831
ఇది సోలార్ అవెన్.
125
00:09:40,914 --> 00:09:43,166
నేను దీన్ని ఒక పెట్టె ఇంకా రేకులతో తయారు చేశాను.
126
00:09:43,250 --> 00:09:45,919
ఎండ వేడిని ఉపయోగించుకుని ఇది ఆహారాన్ని వండుతుంది.
127
00:09:46,461 --> 00:09:50,174
మనం ఏం వండుతున్నాం? పంది మాంసమా?
రెండు మాంసం ముక్కలా?
128
00:09:50,257 --> 00:09:53,844
నేను మార్షమల్లో లాంటివి ఏమైనా వండాలి అనుకుంటున్నా, సర్.
129
00:09:55,888 --> 00:09:58,932
వాటిని సాధారణంగా క్యాంప్ ఫైర్ మీద రోస్ట్ చేస్తారేమో కదా?
130
00:10:00,184 --> 00:10:03,645
సూర్యుడి కన్నా పెద్ద క్యాంప్ ఫైర్ ఇంకేం ఉంటుంది?
131
00:10:11,612 --> 00:10:14,990
ఇప్పుడు, మనం చేయాల్సిందల్లా వేచి చూడటమే.
132
00:10:18,702 --> 00:10:21,705
కంగారు పడద్దు. దీనికి కొద్ది సమయం కూడా పట్టదు.
133
00:10:44,811 --> 00:10:46,271
కాస్త ఓపిక పట్టు, స్నూపీ.
134
00:10:46,355 --> 00:10:49,066
మనం మార్షమెల్లోని చూస్తూ ఉంటే అది ఎప్పటికీ రోస్ట్ కాదు.
135
00:10:57,241 --> 00:10:59,201
ఇది పని చేసింది. అవి మాడుతున్నాయి.
136
00:11:01,370 --> 00:11:02,454
ఆగు.
137
00:11:04,790 --> 00:11:06,917
అది కేవలం ఈ ఆకు నీడ.
138
00:11:07,000 --> 00:11:08,168
మరేం ఫర్వాలేదు.
139
00:11:13,048 --> 00:11:17,261
నేను ఇది నమ్మలేకపోతున్నాను. మనం ఈ రోజంతా
ఎదురుచూశాం కానీ ఏమీ కాలేదు.
140
00:11:17,344 --> 00:11:18,929
నేను ఎక్కడ పొరపాటు చేశాను?
141
00:11:26,687 --> 00:11:29,481
పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం అంటే ఇదే, స్నూపీ.
142
00:11:29,565 --> 00:11:32,776
వండని మార్షమెల్లోలు కూడా అంతే రుచిగా ఉంటాయి.
143
00:11:51,086 --> 00:11:53,130
వాళ్లు ఏం చేస్తున్నారు?
144
00:11:53,213 --> 00:11:56,550
తన దళం సభ్యులకి నౌకాయానం బ్యాడ్జ్ లు సంపాదించడం కోసం
స్నూపీ సాయం చేస్తున్నాడు అనుకుంటా.
145
00:12:06,351 --> 00:12:09,229
సరస్సు దూరంగా ఉందని మనం వాడికి చెప్పాలంటావా?
146
00:12:11,440 --> 00:12:13,817
వాళ్లు తొందరలోనే ఆ విషయం గ్రహిస్తారనుకుంటా.
147
00:12:16,945 --> 00:12:18,488
"ఇంటికి ఉత్తరాలు."
148
00:12:23,076 --> 00:12:24,328
హేయ్, స్నూపీ.
149
00:12:24,411 --> 00:12:25,662
ఉత్తరం రాస్తున్నావా?
150
00:12:28,874 --> 00:12:30,334
"డియర్ స్పైక్…"
151
00:12:30,417 --> 00:12:31,919
మీ సోదరుడికి ఉత్తరం రాస్తున్నావా?
152
00:12:32,002 --> 00:12:33,837
నేను హలో చెప్పానని రాయి.
153
00:12:37,424 --> 00:12:40,761
"నాకు ఆహారం తెచ్చిపెట్టే
గుండ్రని ముఖం ఉన్న కుర్రాడు, 'హలో' చెబుతున్నాడు.
154
00:12:40,844 --> 00:12:44,264
నేను ఈ ఉత్తరం రాయడానికి గల కారణం
155
00:12:44,348 --> 00:12:47,935
బీగల్ స్కౌట్ కలెక్షన్ బ్యాడ్జ్ పొందే క్రమంలో
నేను, మా బృందం కలిసి ఒక విషయం కనిపెట్టాము.
156
00:12:48,018 --> 00:12:50,729
ప్రతి సేకర్త మొదటగా ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్నతో
157
00:12:50,812 --> 00:12:55,859
మేము మా టాస్క్ ని ప్రారంభించాము: ఏం సేకరించాలి?
158
00:12:57,319 --> 00:13:01,365
కోన్రాడ్ సూచించినట్లుగా క్లాసిక్ కార్లను సేకరించడం
చాలా ఖరీదైన వ్యవహారం."
159
00:13:03,575 --> 00:13:07,204
"మూన్ రాక్స్ సేకరించాలన్న హారియెట్ సూచన
అసాధ్యమైన పని అనిపించింది."
160
00:13:10,207 --> 00:13:13,418
"మా పరిసరాలలో నుంచే ఏదైనా సేకరించాలని
వుడ్ స్టాక్ సూచించింది.
161
00:13:19,800 --> 00:13:24,471
బహుశా నేను 'సేకరణ' అనే పదానికి
స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంతో మొదలుపెట్టాల్సింది.
162
00:13:27,641 --> 00:13:30,143
ఇది నేను అనుకున్న దానికంటే కష్టంగా ఉండేలా కనిపిస్తుంది."
163
00:13:31,770 --> 00:13:35,899
"డియర్ తాతయ్యా, మంచి బూట్ల జత తరువాత
164
00:13:35,983 --> 00:13:39,111
చక్కని హాస్యచతురత కలిగి ఉండటం కన్నా
మించినది ఏదీ లేదని నువ్వు ఎప్పుడూ చెబుతుంటావు.
165
00:13:39,695 --> 00:13:42,656
అయితే, దాని గురించి నేను ఒక కథ చెప్పాలి.
166
00:13:42,739 --> 00:13:46,451
ఒక రోజు నేను నా పళ్లు తోముకోవడానికి వెళ్లినప్పుడు
ఈ కథ మొదలైంది."
167
00:13:47,911 --> 00:13:50,831
ఇది ఏమైనా వగరు క్రీమా?
168
00:13:50,914 --> 00:13:53,458
"నిజానికి అది వగరు క్రీమే.
169
00:13:53,542 --> 00:13:56,712
క్యాంపులలో ఎప్పుడూ గొప్ప ప్రాంకులు చేసే
170
00:13:56,795 --> 00:14:01,592
కొంటె పనులు చేయడంలో మాస్టర్ గా పేరున్న ష్రోడర్
చేసిన ప్రాంక్ కి నేను చిక్కాను అనుకుంటా.
171
00:14:01,675 --> 00:14:04,469
దానికి బదులు తీర్చుకోవడం తప్ప
నాకు మరో మార్గం లేకపోయింది."
172
00:14:05,804 --> 00:14:07,931
క్యాంపుకి రావడానికి కొద్ది రోజుల ముందే వీటిని కొన్నాను.
173
00:14:08,682 --> 00:14:11,518
ఇవి నాకు ఎందుకు సరిపోవడం లేదు?
174
00:14:16,148 --> 00:14:17,482
ప్రాంక్లిన్.
175
00:14:47,679 --> 00:14:50,724
"నేను ఏం గ్రహించానంటే,
అవి మంచి మనసుతో చేసే ప్రాంకులు అయినా…
176
00:14:52,643 --> 00:14:54,061
లేదా సిల్లీ ప్రాంకులు అయినా…
177
00:14:56,813 --> 00:14:59,983
హాస్య చతురత కేవలం మనకి ఉండటం మాత్రమే మంచిది కాదు.
178
00:15:00,067 --> 00:15:02,653
దాన్ని ఒక ఫ్రెండ్ తో కలిసి పంచుకోవడం ఇంకా మంచి విషయం."
179
00:15:03,820 --> 00:15:06,490
"సేకరణ అంటే ఏంటి అనే అంశం మీద
180
00:15:06,573 --> 00:15:08,784
ఒక సుదీర్ఘమైన ఇంకా ఉపయోగకరమైన చర్చ తరువాత,
181
00:15:09,660 --> 00:15:11,828
మేము మా బ్యాడ్జ్ పొందడానికి సంసిద్ధులం అయ్యాం.
182
00:15:11,912 --> 00:15:16,542
మా పరిసరాలను కాపాడుకునే ప్రయత్నంలో,
మేము ఆకుల్ని సేకరించాలని నిర్ణయించుకున్నాం.
183
00:15:18,001 --> 00:15:21,213
దురదృష్టం కొద్దీ, నేను చిన్న వాస్తవాన్ని మర్చిపోయాను.
184
00:15:21,296 --> 00:15:25,509
తాజాగా కుప్పగా పోసిన ఆకుల గలగలల్ని
ఏ పిట్ట కూడా ఆస్వాదించకుండా ఉండలేదు.
185
00:15:26,593 --> 00:15:28,512
తిరిగి డ్రాయింగ్ బోర్డుకి వెళ్లాల్సి వచ్చింది."
186
00:15:30,931 --> 00:15:34,643
"డియర్ మేరియన్ ఆంటీ,
మా సమ్మర్ క్యాంప్ బాగానే సాగుతోంది.
187
00:15:36,478 --> 00:15:39,273
అందుకు నేను చేస్తున్న విపరీతమైన కృషే కారణం.
188
00:15:39,356 --> 00:15:41,817
ఇక్కడ చాలా కార్యకలాపాలు సరదాగా ఉంటున్నాయి.
189
00:15:42,484 --> 00:15:44,152
మిగతా వారి కార్యకలాపాల కన్నా నయం."
190
00:15:44,653 --> 00:15:46,488
జాబిలి అంటే ఇష్టం.
191
00:15:46,572 --> 00:15:47,906
నేను తహతహలాడుతున్నాను.
192
00:15:47,990 --> 00:15:49,366
అది చాలా కష్టం.
193
00:15:49,449 --> 00:15:52,160
చందమామని చూడటం కోసం అర్ధరాత్రి వరకూ మేలుకుని ఉండాలా?
194
00:15:52,244 --> 00:15:57,249
ఈ పనిని చట్టపరంగా ఒక యాక్టివిటీ అనాలా
లేదా పిచ్చితనం అనాలా నాకు తెలియడం లేదు.
195
00:15:57,332 --> 00:16:03,505
కానీ అది సూపర్ మూన్, అది చంద్రుడు భూమికి దగ్గరగా
వచ్చినప్పుడే మనకి కనిపిస్తుంది.
196
00:16:03,589 --> 00:16:07,509
విశ్వంలోని గ్రహాలు దగ్గరగా వచ్చినప్పుడు
జరిగే అద్భుతాన్ని చూడటానికి రెడీగా ఉండు.
197
00:16:07,593 --> 00:16:08,969
నేను రెడీ.
198
00:16:13,307 --> 00:16:16,393
"వాళ్లు ఆ చెప్పబడిన యాక్టివిటీని కొన్ని ఆటలతో జోడించారు."
199
00:16:22,941 --> 00:16:25,110
"ఇంకా అవి చాలా సరదాగా ఉన్నాయి,
200
00:16:26,278 --> 00:16:27,988
కానీ రాత్రి పూట ఆకాశంలో ఒక రాయిని చూడటం కోసం
201
00:16:28,071 --> 00:16:30,908
ఇంత హడావుడి అవసరమా అనే అనుమానం కలిగింది."
202
00:16:34,578 --> 00:16:36,121
యాయ్!
203
00:16:38,373 --> 00:16:39,499
అందరూ చూడండి.
204
00:16:51,261 --> 00:16:54,056
"సమయం ఊరికే వృథా అవుతుంది అనుకున్న పనిని
205
00:16:54,139 --> 00:16:57,142
ఒకసారి చూద్దాం అనుకుంటే
అది చాలా ప్రత్యేకంగా మారుతుందేమో అనిపించింది."
206
00:16:59,061 --> 00:17:01,104
"ఆకుల సేకరణ ఘటన నేపథ్యంలో,
207
00:17:01,188 --> 00:17:04,900
బీగల్ స్కౌట్లు ఇంకా నేను
పెద్దగా ఆసక్తికరమైనది కాని వస్తువుని
208
00:17:04,983 --> 00:17:07,486
సేకరించాలని నిర్ణయించుకున్నాం:
209
00:17:08,862 --> 00:17:10,071
పైన్ చెట్టు కాయలు.
210
00:17:12,281 --> 00:17:16,411
మరీ ప్రత్యేకంగా, అమెరికన్ రాష్ట్రాలని పోలి ఉండే పైన్ కాయలు.
211
00:17:16,494 --> 00:17:19,039
మినెసోటాని పోలి ఉండే పైన్ కాయని బిల్ సేకరించాడు.
212
00:17:19,122 --> 00:17:23,836
హారియెట్ కి ఉటా ఆకారంలో, వుడ్ స్టాక్, కోన్రాడ్ ఇంకా ఆలివియెర్
213
00:17:23,919 --> 00:17:26,588
టెక్సాస్, ఆరెగాన్ ఇంకా డెలావేర్ ఆకారాలలోని కాయల్ని సేకరించారు.
214
00:17:26,672 --> 00:17:31,969
చూడబోతే పైన్ కాయలు వేరే పైన్ కాయల్నే పోలి ఉంటాయని
తరువాత గ్రహించాము.
215
00:17:33,720 --> 00:17:35,556
మరోసారి అంచనా తప్పాము."
216
00:17:37,724 --> 00:17:43,397
"డియర్ అమ్మా, నాన్నా, నేను ఉత్తరం రాయాలని
పెద్ద అన్నయ్య చెప్పాడు కాబట్టి మీకు రాస్తున్నాను.
217
00:17:46,275 --> 00:17:48,193
నేను ఈ ఉత్తరాన్ని క్లుప్తంగా రాస్తాను.
218
00:17:48,902 --> 00:17:51,947
ఈ మధ్య, నా తోటి క్యాంప్ సభ్యులు, నేను
తెలుసుకున్నది ఏమిటంటే
219
00:17:52,030 --> 00:17:53,866
క్యాంపులో మా కోసం మూవీ ప్రదర్శన ఉందని చెప్పారు."
220
00:17:53,949 --> 00:17:56,451
ఆ సినిమాలో చాలా యాక్షన్ ఉంటుందని ఆశిస్తున్నాను.
221
00:17:56,535 --> 00:17:58,829
అది ఒక డాక్యుమెంటరీ కావాలని నేను ఆశిస్తున్నాను.
222
00:17:58,912 --> 00:18:00,831
మీరు వినలేదా?
223
00:18:00,914 --> 00:18:05,961
మనం భయపెట్టే క్లాసిక్ చిత్రం,
"ఇట్ కేమ్ ఫ్రమ్ ద స్పేస్ లగూన్" చూస్తున్నాం.
224
00:18:06,962 --> 00:18:10,465
వాళ్లు మరీ అంత భయంకరమైనవి ఏవీ
ప్రదర్శించరని అనుకుంటున్నాను.
225
00:18:10,549 --> 00:18:14,595
ఒకసారి వాళ్లు చాలా భయంకరమైన మూవీని ప్రదర్శించగా,
226
00:18:14,678 --> 00:18:17,097
ఒక పిల్లవాడు ఇప్పటికీ బయటకు వెళ్లడానికి
భయపడుతున్నాడని విన్నాను.
227
00:18:18,390 --> 00:18:19,600
అదే సరదాగా ఉంటుంది.
228
00:18:22,728 --> 00:18:25,397
నేను గతంలో ఎప్పుడూ భయంకరమైన మూవీని చూడలేదు.
229
00:18:25,480 --> 00:18:27,316
నాకు భయమేస్తే ఏం చేయాలి?
230
00:18:27,399 --> 00:18:29,193
నా ఉద్దేశంలో అదే అసలు విషయం.
231
00:18:29,276 --> 00:18:31,028
"నాకు ఆందోళనగా ఉంది.
232
00:18:31,111 --> 00:18:35,449
పిరికి అమ్మాయిగా నాకు ముద్రపడితే
దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం.
233
00:18:36,366 --> 00:18:38,493
అదృష్టం కొద్దీ, నా ఫ్రెండ్ నయోమి, నేను
234
00:18:38,577 --> 00:18:41,830
నా భయాన్ని తట్టుకోవడం కోసం ఒక ప్లాన్ వేసుకున్నాము.
235
00:18:59,181 --> 00:19:00,182
బూ!
236
00:19:02,100 --> 00:19:03,352
"నేను రెడీ అయ్యాను."
237
00:19:07,773 --> 00:19:11,693
"చూడబోతే కొద్దిగా భయపడటం కూడా
నిజానికి చాలా మజాగా అనిపిస్తోంది,
238
00:19:11,777 --> 00:19:14,863
ముఖ్యంగా మిగతా అందరితో కలిసి భయపడుతున్నప్పుడు
భలే సరదాగా ఉంది."
239
00:19:20,827 --> 00:19:24,873
"అన్నింటిలోకీ, ఈ మొత్తం వేసవి కాలంలో
మేము గడిపిన అద్భుతమైన క్షణాలలో అది కూడా ఒకటి.
240
00:19:27,042 --> 00:19:31,255
గమనిక, నాకు కుకీలు, వీలయితే చాక్లెట్ చిప్ లని
ప్లీజ్ పంపించండి.
241
00:19:31,338 --> 00:19:33,340
ఉంటాను, శాలీ బ్రౌన్."
242
00:19:37,636 --> 00:19:41,765
"ఇంతవరకూ, సేకరణకి సంబంధించి
మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.
243
00:19:41,849 --> 00:19:44,476
మా సేకరణ ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని నాకు తెలుసు,
244
00:19:44,560 --> 00:19:48,313
కానీ అది ఏంటి అన్నది మాకు ఇంకా అంతు చిక్కకుండా ఉంది."
245
00:19:55,487 --> 00:19:57,281
"నాకు అప్పుడు తట్టింది.
246
00:20:02,077 --> 00:20:04,204
మేము సేకరించవచ్చు,
247
00:20:04,288 --> 00:20:07,249
లేదా చెప్పాలంటే అప్పటికే మేము సేకరిస్తున్నాం:
248
00:20:09,209 --> 00:20:10,294
జ్ఞాపకాలు.
249
00:20:10,377 --> 00:20:13,672
మనం జ్ఞాపకాన్ని ఎంచుకుని దాన్ని దాచుకోలేకపోవచ్చు…
250
00:20:16,258 --> 00:20:20,220
కానీ వాటిని జీవితాంతం మనం గుండెల్లో పదిలంగా దాచుకోవచ్చు,
251
00:20:21,013 --> 00:20:24,600
అందువల్ల ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ
అన్నింటికన్నా చాలా విలువైనవి అవుతాయి."
252
00:20:31,815 --> 00:20:33,901
ఉత్తరాలు
253
00:20:39,907 --> 00:20:43,827
"బీగల్ స్కౌట్ క్యాంప్ నుండి
నీ ప్రియమైన సోదరుడు, స్నూపీ."
254
00:20:51,335 --> 00:20:52,878
చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా
255
00:21:16,276 --> 00:21:18,278
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
256
00:21:21,365 --> 00:21:23,325
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.
256
00:21:24,305 --> 00:22:24,460