"Camp Snoopy" Bed Heads & Beagle Care/The Great Gold Rush
ID | 13193144 |
---|---|
Movie Name | "Camp Snoopy" Bed Heads & Beagle Care/The Great Gold Rush |
Release Name | Camp.Snoopy.S01E09.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS |
Year | 2024 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 32515598 |
Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
2
00:01:10,946 --> 00:01:12,614
"మంచం దిమ్మ ఇంకా బీగల్ కుక్క సంరక్షణ."
3
00:01:17,244 --> 00:01:23,208
తెల్లవారుజామునే సరస్సు దగ్గర ఉండే ప్రశాంతత,
నిశ్శబ్దం ఇంకా ప్రతిబింబాల కన్నా మించినవి మరేమీ ఉండవు.
4
00:01:25,335 --> 00:01:27,462
బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం
5
00:01:30,215 --> 00:01:32,342
ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నావు, స్నూపీ?
6
00:01:32,426 --> 00:01:35,637
నీ దళం తరువాత ఏ బ్యాడ్జ్ సంపాదించాలా అని ఆలోచిస్తున్నావా?
7
00:01:41,143 --> 00:01:42,519
ఏదీ నన్ను చూడనివ్వు.
8
00:01:47,900 --> 00:01:50,819
ఇది బాగుంది. "బీగల్ సంరక్షణ బ్యాడ్జ్.
9
00:01:50,903 --> 00:01:55,782
మీకు ఇష్టమైన బీగల్ కుక్కకి మీ ప్రేమని పంచి
శ్రద్ధ చూపించి దానికి కావలసినవి సమకూర్చండి."
10
00:02:11,256 --> 00:02:13,634
ఇక, తిరిగి నా ప్రశాంతతనీ ఇంకా నిశ్శబ్దాన్నీ…
11
00:02:17,596 --> 00:02:19,056
ఏమీ అనుకోకు, చార్ల్స్.
12
00:02:19,139 --> 00:02:21,850
ఊరికే కాస్త త్వరగా లేచి ప్రాక్టీసు చేస్తున్నాను అంతే.
13
00:02:25,062 --> 00:02:26,396
అయ్య బాబోయ్.
14
00:02:34,238 --> 00:02:38,408
గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి నేను పసిపాపాయిలా నిద్రపోయాను.
15
00:02:49,461 --> 00:02:53,465
ఖచ్చితంగా క్యాంపు మంచానికి
ఎవరిదో జుట్టు చుట్టుకుపోయిన కేసు ఇది.
16
00:02:55,634 --> 00:02:59,346
నేను చూసిన వాటిల్లో ఇదే చాలా కఠినమైన కేసు.
17
00:02:59,847 --> 00:03:05,894
నేను ఇది భరించలేను! ఇక్కడ మనకి టీవీ లేకపోవడం దారుణం.
ఇప్పుడు ఈ సమస్యా?
18
00:03:05,978 --> 00:03:08,146
ఇది మరీ అంత చెడ్డగా ఉందనుకోను.
19
00:03:08,230 --> 00:03:11,108
కానీ నీకు కాస్త ఉపశమనంగా ఉంటుంది అంటే,
నీ జుట్టుని నేను దువ్వి పెడతాను.
20
00:03:14,862 --> 00:03:16,321
జట్టు చిక్కుముడి వీడుతోందా?
21
00:03:24,955 --> 00:03:28,083
"బీగల్ కుక్క సంరక్షణలో
మొట్టమొదటిది ఇంకా చాలా ముఖ్యమైనది ఏమిటంటే
22
00:03:28,166 --> 00:03:32,379
మీ నాలుగు కాళ్ల పెంపుడు జంతువుకి
సరైన ఆహారం అందించడం."
23
00:04:03,535 --> 00:04:07,831
"గుర్తుంచుకోండి,
సమృద్ధిగా ఆహారం తినే బీగల్ కుక్క సంతోషంగా ఉంటుంది."
24
00:04:10,667 --> 00:04:14,213
ఇలాగ క్యాంపులో జుట్టు చిక్కుముడి పడినప్పుడు,
దాన్ని బ్లోయర్ తో ఆరబెట్టాలి.
25
00:04:14,963 --> 00:04:16,130
దాన్ని ఆన్ చేయి.
26
00:04:18,216 --> 00:04:20,719
మనకి ఇంకా పవర్ కావాలి!
27
00:04:24,223 --> 00:04:26,141
ఇంకా పవర్ కావాలి!
28
00:04:26,225 --> 00:04:28,435
ఇందులో రెండు సెట్టింగులు మాత్రమే ఉన్నాయి!
29
00:04:32,231 --> 00:04:34,650
సరే, ఇప్పుడు ఏమైనా సరిగా అయ్యిందా?
30
00:04:36,401 --> 00:04:38,529
మనం మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం.
31
00:04:38,612 --> 00:04:40,239
ఇది మరీ అంత ఘోరంగా లేదు.
32
00:04:42,908 --> 00:04:46,370
"బీగల్ కుక్క సంరక్షణ ఉద్దేశం ఏమిటంటే
మీ పెంపుడు జంతువు
33
00:04:46,453 --> 00:04:48,080
విశ్రాంతిగా సంతోషంగా ఉండేలా చూడటమే."
34
00:05:01,051 --> 00:05:02,469
"సంరక్షణ అనేది కీలకమైనది.
35
00:05:02,553 --> 00:05:05,472
అది జుట్టు కావచ్చు ఇంకా కోటుని చక్కగా ఉంచడం కావచ్చు…
36
00:05:06,932 --> 00:05:08,433
గోళ్ల సంరక్షణ కావచ్చు…
37
00:05:14,273 --> 00:05:16,567
ఇంకా, అలాగే, టూత్ బ్రష్ చేయడం కూడా."
38
00:05:27,452 --> 00:05:30,122
"కానీ బీగల్ కుక్క సంరక్షణలో అతి ముఖ్యమైనది మాత్రం
39
00:05:30,205 --> 00:05:33,041
చక్కని మెత్తని నురగల సబ్బుతో స్నానం చేయించడం,
40
00:05:33,876 --> 00:05:35,377
దాన్ని ప్రతి కుక్క ఇష్టపడుతుంది."
41
00:05:38,297 --> 00:05:40,549
నువ్వు వేరే బ్రష్ ని ఉపయోగించి చూశావా?
42
00:05:40,632 --> 00:05:42,217
నువ్వు చల్లని ట్రీట్మెంట్ ఇచ్చి చూశావా?
43
00:05:42,301 --> 00:05:43,302
వేడి ట్రీట్మెంట్ ఇచ్చి చూశావా?
44
00:05:43,385 --> 00:05:45,137
నువ్వు వెళ్లి ఆ సరస్సులోకి దూకచ్చు కదా?
45
00:05:45,220 --> 00:05:47,973
నువ్వు వెళ్లి ఆ సరస్సులో దూకి రావచ్చు కదా?
46
00:05:50,934 --> 00:05:53,604
అది చాలా నిజాయితీగా ఇచ్చిన సలహా అనుకుంటా.
47
00:05:55,272 --> 00:05:57,608
నిజానికి అది చాలా మంచి ఐడియా.
48
00:05:57,691 --> 00:05:59,860
థాంక్యూ, నా స్వీట్ బబ్బూ.
49
00:06:05,657 --> 00:06:07,534
నేను తన స్వీట్ బబ్బూని కాను.
50
00:06:12,706 --> 00:06:15,167
గుడ్ బై, నా జుట్టు చిక్కుముడి!
51
00:06:17,669 --> 00:06:20,672
నీ ఉద్దేశం ఏమిటి, ఈత కొట్టడానికి ఈ నీళ్లు పనికి రావంటావా?
52
00:06:21,507 --> 00:06:24,593
ఆఖరికి ప్రకృతి కూడా నా మీద కక్ష కట్టింది.
53
00:06:28,805 --> 00:06:31,475
నీ సంశయం చూసి నేను ఆగలేకపోయాను, శాలీ.
54
00:06:31,558 --> 00:06:35,062
నువ్వు నాతో పాటు రిక్రియేషన్ గదిలోకి వస్తే,
నీకు ఏదైనా పరిష్కారం చూపించగలను.
55
00:07:08,679 --> 00:07:11,390
క్యాంప్ స్కిట్ వేడుక సందర్భంగా ట్రంకు పెట్టెలో
నాకు ఈ కాస్ట్యూమ్ దొరికింది.
56
00:07:11,473 --> 00:07:13,892
మనకి ఉపయోగపడేది ఏదైనా బహుశా ఇందులో ఉండచ్చు.
57
00:07:15,727 --> 00:07:16,728
ఇది ప్రయత్నించి చూడు.
58
00:07:18,981 --> 00:07:20,232
చాలా హుందాగా ఉంది.
59
00:07:22,442 --> 00:07:23,902
నీ అభ్యంతరాన్ని ఆమోదిస్తున్నా.
60
00:07:26,154 --> 00:07:27,155
ఇది ప్రయత్నించి చూడు.
61
00:07:28,156 --> 00:07:32,119
ఇది పెట్టుకుంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది
ఇంకా నవ్వుతారు కూడా.
62
00:07:33,662 --> 00:07:35,622
బహుశా విగ్ దీనికి పరిష్కారం కాకపోవచ్చు.
63
00:07:39,751 --> 00:07:42,963
నేను ఈ టోపీ పెట్టుకుని రోడియో మాదిరి
గోవులు కాయడానికి వెళ్లాలేమో.
64
00:07:46,383 --> 00:07:48,177
ఈ ప్రయత్నాలన్నీ పనికిమాలినవి.
65
00:07:55,517 --> 00:07:57,603
నువ్వు కూడా దాక్కుంటున్నావా, ఏహ్, స్నూపీ?
66
00:08:07,988 --> 00:08:11,491
నువ్వు ఇక్కడే ఉంటావు అనుకున్నాను. ఎలా ఉన్నావు?
67
00:08:11,992 --> 00:08:13,243
ఎలా ఉన్నాను అనుకుంటున్నావు?
68
00:08:15,412 --> 00:08:17,789
దీని గురించి నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావో
నాకు అర్థం కావడం లేదు.
69
00:08:17,873 --> 00:08:20,459
నీకు క్యాంపులో జుట్టు చిక్కుముడి పడింది. అయితే ఏంటి?
70
00:08:20,542 --> 00:08:22,711
మనం క్యాంపులో కొన్ని రోజులే ఉంటాం.
71
00:08:22,794 --> 00:08:25,714
అటువంటి విషయం గురించి మనం బాధపడటం చాలా సిగ్గుచేటు.
72
00:08:26,215 --> 00:08:30,052
ఇలా చెప్పడం నీకు తేలికే.
నీ జుట్టు చిక్కుముడి పడలేదు కదా.
73
00:08:31,136 --> 00:08:34,556
నిజం. కానీ బహుశా నువ్వు ఒకసారి ఇది చూడాలి.
74
00:08:36,390 --> 00:08:38,894
క్యాంపు జుట్టు, ఈ టోపీ జుట్టుని ఒకసారి చూడు.
75
00:08:41,522 --> 00:08:43,899
నువ్వు నవ్వినా ఫర్వాలేదులే. నేను ఏమీ అనుకోను.
76
00:08:46,652 --> 00:08:49,863
ఇంక ఇప్పుడు, మనం ఇక్కడి నుండి వెళ్లి
మన రోజుని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది?
77
00:09:01,291 --> 00:09:02,626
ఆహ్… హా.
78
00:09:31,530 --> 00:09:36,326
"మీరు బీగల్ స్కౌట్ కాగలరా?"
ప్రకృతిలో విహారం.
79
00:09:39,621 --> 00:09:43,458
బీగల్ స్కౌట్ అవ్వాలి అనుకుంటే,
మీరు తప్పనిసరిగా మాస్టర్ మార్గాన్వేషి కావాలి.
80
00:09:44,668 --> 00:09:47,796
దాని అర్థం మీ మార్గాన్ని మీరు కనుక్కోవడం కోసం
పర్యావరణం మీద ఆధారపడాలి."
81
00:09:50,799 --> 00:09:52,176
నీ మ్యాప్ ఏది?
82
00:09:52,259 --> 00:09:54,386
మ్యాప్ లేకుండా మనం ఎటు వెళ్తున్నామో ఎలా తెలుస్తుంది?
83
00:10:04,521 --> 00:10:08,233
"మన సత్తా ఏంటో తెలుసుకునే మార్గాలలో ఒకటి
మనం ఎత్తయిన కొండ అంచుకి ఎక్కడమే."
84
00:10:11,987 --> 00:10:14,489
ఇంతకన్నా ఎత్తయిన ప్రదేశం ఏదైనా ఎంచుకోగలవా?
85
00:10:22,039 --> 00:10:23,790
"గాలి కూడా మనకి మార్గం చూపించగలదు."
86
00:10:44,144 --> 00:10:47,940
ఎట్టకేలకు, చిన్న విరామం. నా గొంతు ఎండిపోయింది.
87
00:10:48,732 --> 00:10:49,942
హేయ్!
88
00:10:50,025 --> 00:10:51,360
"మిగతా ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు,
89
00:10:51,443 --> 00:10:54,112
కొద్దిగా నీళ్లు, ఒక ఆకు ఇంకా ఒక స్టీలు సూదితో,
90
00:10:54,196 --> 00:10:56,073
మనమే సొంతంగా కాంపాస్ తయారు చేసుకోవచ్చు."
91
00:11:01,828 --> 00:11:03,789
నువ్వు ఆ సూదిని అయస్కాంతంగా మార్చాలి.
92
00:11:14,633 --> 00:11:18,136
"మీరు బీగల్ స్కౌట్ అయితే గనుక,
మీరు ఎప్పుడూ బాగా ఆలోచించాలని
93
00:11:18,220 --> 00:11:19,805
ఇంకా కొన్నిసార్లు వాసన పసిగట్టాలని గుర్తుంచుకోండి.
94
00:11:20,430 --> 00:11:22,891
అప్పుడు మీరు దేని కోసం అన్వేషిస్తున్నారో
దాన్ని ఖచ్చితంగా కనుక్కోగలుగుతారు."
95
00:11:25,477 --> 00:11:28,146
స్నూపీ, మేము నిన్ను తప్పు దారి పట్టించాము.
96
00:11:28,689 --> 00:11:30,691
బహుశా అది మట్టిలో కప్పి ఉంచిన గుప్తనిధి అయి ఉంటుంది.
97
00:11:50,294 --> 00:11:52,754
చూడబోతే ఈ గొప్ప స్కౌట్ నాయకుడు ఇంకా అతని దళం
98
00:11:52,838 --> 00:11:55,674
తమ జెండా పాతడానికి
అనువైన స్థలం కోసం చూస్తున్నట్లున్నారు.
99
00:11:59,928 --> 00:12:03,849
చక్కగా కూర్చుని ఇంకా దొర్లుతుండే ఒక మామూలు కుక్కని
పెంచుకుని ఉండాల్సిందని
100
00:12:03,932 --> 00:12:06,810
నీకు ఎప్పుడయినా అనిపించిందా?
101
00:12:07,895 --> 00:12:08,979
ఎప్పుడూ అనిపిస్తుంటుంది.
102
00:12:49,811 --> 00:12:51,313
"గొప్ప బంగారం వేట."
103
00:12:55,234 --> 00:12:58,612
అదీ! వార్షిక బంగారం వేట పోటీలు నిర్వహిస్తున్నారు.
104
00:12:59,279 --> 00:13:00,572
అది ఏంటి?
105
00:13:00,656 --> 00:13:03,825
కౌన్సెలర్లు బంగారు రంగు పూత పూసిన రాళ్లని
క్యాంపు ప్రదేశం చుట్టూ దాస్తారు.
106
00:13:03,909 --> 00:13:07,496
వాటిని మనం వెతికి పట్టుకోవాలి,
ఎక్కువ రాళ్లు గెలుచుకున్న జట్టు విజేతగా నిలుస్తుంది.
107
00:13:07,579 --> 00:13:09,248
అంటే ఈస్టర్ ఎగ్ హంట్ మాదిరిగానా?
108
00:13:09,331 --> 00:13:11,834
ఈస్టర్ ఎగ్ హంట్ లో విజేతలు ఎవరూ ఉండరు, శాలీ.
109
00:13:11,917 --> 00:13:15,045
అలాంటిది ఎప్పుడూ గెలుచుకోని వాడిలా మాట్లాడుతున్నావు.
110
00:13:18,549 --> 00:13:20,133
నువ్వు నాతో పాటే ఉండు, లైనస్,
111
00:13:20,217 --> 00:13:22,761
నీకు కావాల్సినంత బంగారాన్ని
నేను నీ కోసం వెతికి పట్టుకుంటాను.
112
00:13:23,262 --> 00:13:26,390
ఎక్కువ బంగారాన్ని వెతికి పట్టుకోవడానికి
నా దగ్గర పక్కా సిస్టమ్ ఉంది.
113
00:13:26,974 --> 00:13:30,018
నా దగ్గర కూడా ఉంది. బంగారాన్ని చూడాలి, దాన్ని తీసుకోవాలి.
114
00:13:31,228 --> 00:13:34,565
మార్సీ, నువ్వు ఈ పోటీలో పాల్గొనడం లేదంటే
నేను నమ్మలేకపోతున్నాను.
115
00:13:34,648 --> 00:13:37,359
నాకు ఏం ఫర్వాలేదు.
క్లాండైక్ గురించి నా దగ్గర ఒక పుస్తకం ఉంది.
116
00:13:37,442 --> 00:13:39,236
దీన్ని చదివే అవకాశం కోసం చూస్తున్నాను.
117
00:13:39,319 --> 00:13:40,487
అది ఏంటి అన్నావు?
118
00:13:40,571 --> 00:13:41,738
క్లాండైక్, సర్.
119
00:13:41,822 --> 00:13:46,034
అలాస్కా ఇంకా యూకాన్ ప్యాన్ హ్యాండిల్ ప్రాంతాలలో 1890లలో
ప్రసిద్ధి చెందిన బంగారపు వేట గురించి రాసిన పుస్తకం.
120
00:13:46,743 --> 00:13:47,828
ప్యాన్ హ్యాండిల్ ఏంటి?
121
00:13:48,704 --> 00:13:51,707
ఈ వేటలో వంట పాత్రలకి సంబంధం ఏమిటో
నాకు తెలియడం లేదు.
122
00:14:59,358 --> 00:15:02,152
"క్లాండైక్ లో కనుగొన్న కొన్ని బంగారపు నిక్షేపాలు
123
00:15:02,236 --> 00:15:03,612
వేలాదిమంది కాబోయే సంపన్నులలో ఆశల్ని పెంచి
124
00:15:03,695 --> 00:15:07,407
జనం వేలంవెర్రిగా ఎగబడేలా చేస్తుందని
125
00:15:07,491 --> 00:15:10,285
బహుశా ఎవ్వరూ ఉహించి ఉండరు."
126
00:15:11,286 --> 00:15:12,538
చాలా ఆసక్తిగా ఉంది.
127
00:15:18,544 --> 00:15:21,255
కాగితం మీద బొమ్మలు గీయడం వల్ల
నువ్వు బంగారాన్ని కనుక్కోలేవని నాకు అనిపిస్తోంది.
128
00:15:21,338 --> 00:15:23,924
ఇది మన క్యాంపు శిబిరం ఇంకా చుట్టుపక్కల ప్రదేశాల మ్యాప్.
129
00:15:24,007 --> 00:15:25,926
నేను దీనిని ఒక గ్రిడ్ మాదిరిగా విభజించాను.
130
00:15:26,009 --> 00:15:29,513
మనం ప్రతి స్క్వేర్ లో ఇంకా ప్రతి క్రాస్ లో
అన్వేషిస్తూ ముందుకు సాగుదాం.
131
00:15:29,596 --> 00:15:32,140
ఇది ఎందుకో నాకు హోమ్ వర్క్ మాదిరిగా అనిపిస్తోంది.
132
00:15:35,561 --> 00:15:39,481
ఇది బంగారపు వేట అని,
నువ్వు విశ్రాంతి తీసుకునే సమయం కాదని,
133
00:15:39,565 --> 00:15:41,400
నీకు గుర్తుచేయక తప్పడం లేదు.
134
00:15:41,483 --> 00:15:42,860
రిలాక్స్.
135
00:15:43,777 --> 00:15:46,655
ఆ బంగారం అంతా ఎక్కడ ఉంటుందో నాకు ముందే తెలుసు.
136
00:15:46,738 --> 00:15:50,409
ప్రతి ఏడాది, ఆ కౌన్సెలర్లు అవే ప్రదేశాలలో వాటిని దాచి పెడతారు.
137
00:15:52,077 --> 00:15:55,497
గుల్లగా ఎండిపోయిన చెట్ల కింద లేదా
అనుమానం రేకెత్తించేలా ఉండే కర్రల కుప్ప కింద.
138
00:15:56,415 --> 00:15:58,750
ఇది దాదాపుగా చీటింగ్ చేస్తున్నట్లే అనిపిస్తోంది.
139
00:15:58,834 --> 00:16:01,712
నేను ఈ గేమ్ లో ముందంజలో ఉన్నాను అని
నేను అనుకుంటున్నాను.
140
00:16:02,796 --> 00:16:06,800
అయితే, ఆ గుడ్లు అన్నీ చాక్లెట్ తో చేసినవా,
లేదా వాటిలో జెల్లీ బీన్స్ కూడా ఉంటాయా?
141
00:16:08,010 --> 00:16:12,055
చాక్లెట్ గుడ్ల మధ్యలో క్రీమ్ కూడా ఉంటుందా?
అవి అంటే నాకు చాలా ఇష్టం.
142
00:16:12,139 --> 00:16:15,809
శాలీ, ఇది ఈస్టర్ ఎగ్ హంట్ కాదని నీకు ముందే చెప్పాను కదా.
143
00:16:15,893 --> 00:16:17,644
మనం బంగారం కోసం అన్వేషిస్తున్నాం.
144
00:16:19,605 --> 00:16:22,608
అంటే బంగారపు రేకుతో చుట్టిన చాక్లెట్ నాణాల మాదిరిగా కదా.
145
00:16:22,691 --> 00:16:24,318
నాకు అవి కూడా చాలా ఇష్టం.
146
00:16:35,662 --> 00:16:38,123
"ఇక్కడికి వాయువ్య ప్రాంతంలోని దట్టమైన అడవులలో
147
00:16:38,207 --> 00:16:40,459
బంగారం నిధి దొరుకుతుందనే మాట జనంలోకి చేరుకోవడంతో,
148
00:16:40,542 --> 00:16:42,628
ఈ ఖండం మొత్తం నుండి నిధి అన్వేషకులు
149
00:16:42,711 --> 00:16:45,088
ఈ సంపదని సొంతం చేసుకోవడానికి
ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు.
150
00:16:48,884 --> 00:16:53,055
ఇదిగో తీసుకో.
బంగారం దాచి ఉంచే మొదటి ప్రదేశం: ఓల్డ్ రిలయబుల్.
151
00:17:00,604 --> 00:17:01,980
ఏంటి? ఇది ఏంటి?
152
00:17:02,064 --> 00:17:04,358
కౌన్సెలర్లు ఈ ప్రదేశాన్ని బహుశా మార్చేసి ఉంటారు.
153
00:17:04,441 --> 00:17:07,694
ఈ వెతుకులాటని నిజానికి అసలైన పోటీగా మార్చడానికి
వాళ్లకి ఎంత ధైర్యం?
154
00:17:09,070 --> 00:17:11,240
"కొందరు సంపన్నులు అవుతున్న దృశ్యాలు చూసి
155
00:17:11,323 --> 00:17:13,992
ప్రత్యక్ష సాక్షులు అసూయతో రగిలిపోయారు.
156
00:17:14,076 --> 00:17:17,913
'గోల్డ్ ఫీవర్' అనే పరిణామానికి అదే ఆరంభం అయింది."
157
00:17:20,082 --> 00:17:24,169
ఇంతవరకూ, నీ పద్ధతి ఏమీ పని చేయలేదు.
158
00:17:24,252 --> 00:17:28,214
నేను ఒప్పుకోను. బంగారం లేని ప్రదేశాలని ఇది చూపిస్తోంది.
159
00:17:28,298 --> 00:17:31,635
అది ఎక్కడ లేదో నేను చెప్పగలను: మన చేతుల్లో.
160
00:17:34,096 --> 00:17:37,224
సరే. ఈ మొత్తం వ్యవహారం అంతా
నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా.
161
00:17:37,307 --> 00:17:41,144
మనం బంగారపు రాళ్లని ఇచ్చి చాక్లెట్లు తీసుకుందాం
అని ఆలోచిస్తున్నావు కదా?
162
00:17:42,312 --> 00:17:43,939
అయ్య బాబోయ్.
163
00:17:44,022 --> 00:17:47,442
ఈ వ్యవహారంలో చాక్లెట్లు అనేవి
తప్పనిసరిగా భాగం అవుతాయని నాకు తెలుసు.
164
00:17:52,656 --> 00:17:56,201
సరే. ఇక్కడ ఏం జరుగుతోంది?
165
00:17:56,827 --> 00:18:00,622
నాకు సమాధానాలు కావాలి. నాకు వివరణ కావాలి.
166
00:18:00,706 --> 00:18:06,044
కొన్ని సంవత్సరాల పాటు బంగారాన్ని ఒకే ప్రదేశాలలో దాచి
హఠాత్తుగా వాటిని మార్చేయకూడదు.
167
00:18:06,128 --> 00:18:08,005
అందులో క్రీడాస్ఫూర్తి ఏం ఉంది?
168
00:18:08,088 --> 00:18:10,674
నిజానికి ఈ ఆట ఎలా ఆడాలంటే…
169
00:18:10,757 --> 00:18:13,468
తక్కువ మాట్లాడాలి, ఎక్కువ అన్వేషించాలి.
170
00:18:13,552 --> 00:18:15,721
అదిగో అక్కడ ముళ్ల పొదలో వెతికి చూడు.
171
00:18:19,057 --> 00:18:21,185
దీనికి అంతటా ముళ్లు ఉన్నాయి.
172
00:18:36,617 --> 00:18:40,162
"గోల్డ్ ఫీవర్ పిచ్చి ఎక్కువైపోయి
ఊహలు కొత్తపుంతలు తొక్కడం మొదలైంది."
173
00:18:53,467 --> 00:18:57,012
"త్వరలోనే, స్నేహితుల మధ్య గొడవలు మొదలయ్యాయి,
ఇరుగుపొరుగువారు ప్రత్యర్థులయ్యారు.
174
00:18:58,180 --> 00:19:00,557
పరిస్థితులు విషాదకరంగా ఇంకా ఉద్రిక్తంగా మారాయి."
175
00:19:01,517 --> 00:19:03,101
మాకు ఏమీ దొరకలేదు.
176
00:19:03,185 --> 00:19:04,311
మాకు కూడా.
177
00:19:04,394 --> 00:19:06,980
నా సిస్టమ్ ఫెయిల్ అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను.
178
00:19:07,064 --> 00:19:11,610
నీకు ఒక మాట చెప్పాలి,
నీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని నాకు ఎప్పుడో తెలుసు.
179
00:19:14,321 --> 00:19:16,532
ఈ పోటీ ఇంక పూర్తయినందుకు నాకు సంతోషంగా ఉంది.
180
00:19:54,653 --> 00:19:56,572
"కొంతమంది సంపన్నులు కాగా,
181
00:19:56,655 --> 00:20:00,701
బంగారపు వేటలో వాస్తవం ఏమిటంటే
అందరిలో నిస్తేజము ఇంకా మూర్ఖత్వం పెరిగాయి,
182
00:20:00,784 --> 00:20:04,788
కలలు కల్లలయ్యాయి, స్నేహాలు పాడయ్యాయి
ఇంకా ఓటమి తప్పలేదు."
183
00:20:18,427 --> 00:20:20,179
ఇది నేను నమ్మలేకపోతున్నాను.
184
00:20:20,262 --> 00:20:22,181
నిధి అన్వేషణ పోటీలో మార్సీ విజేతగా నిలిచింది.
185
00:20:22,264 --> 00:20:23,265
నేను గెలిచానా?
186
00:20:23,974 --> 00:20:26,852
బహుశా జీవితంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు
పుస్తకాలలోనే ఉంటాయేమో.
187
00:20:26,935 --> 00:20:30,522
అది నిజం కావచ్చు, కానీ ఈ రాళ్లని సొంతం చేసుకోవడం
నాకు మంచిగా అనిపించడం లేదు.
188
00:20:30,606 --> 00:20:32,774
బహుశా మనం అందరం కలిసి
ఈ ప్రథమ బహుమతిని పంచుకుందామా?
189
00:20:32,858 --> 00:20:35,527
ఇందులో ఫస్ట్ ప్రైజ్ అసలు ఏంటి?
190
00:20:35,611 --> 00:20:37,070
అది ఒక రిబ్బన్ అనుకుంటా.
191
00:20:38,238 --> 00:20:39,907
రిబ్బనా?
192
00:20:39,990 --> 00:20:42,659
- దాన్ని నువ్వు అందరికీ పంచలేవు.
- దాని బదులు నాకు ఆ రాళ్లే కావాలి.
193
00:20:43,911 --> 00:20:46,413
ఇది అతి చెత్త ఈస్టర్ ఎగ్ హంట్.
194
00:20:49,041 --> 00:20:50,321
చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా
195
00:21:13,982 --> 00:21:15,984
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
196
00:21:19,071 --> 00:21:21,073
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.
196
00:21:22,305 --> 00:22:22,309
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm